Hyderabad: కొత్త సంవత్సరంలో కుమ్మిపడేశారు.. 4,07,820 బీర్లు, 4,56,228 ఫుల్ బాటిళ్లు.. అక్కడ మాత్రమే..
న్యూ ఇయర్ అంటే అదో పండుగ. పాత జ్ఞాపకాలు, అనుభవాలను గుడ్ బై చెప్పి.. కొత్త ఆశలతో నూతన సంవత్సరానికి వెల్ కమ్ చెప్పే సమయం ఇది. ఇక కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతున్నామంటే చాలు.. ప్రజల్లో ఆనందం...
న్యూ ఇయర్ అంటే అదో పండుగ. పాత జ్ఞాపకాలు, అనుభవాలను గుడ్ బై చెప్పి.. కొత్త ఆశలతో నూతన సంవత్సరానికి వెల్ కమ్ చెప్పే సమయం ఇది. ఇక కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతున్నామంటే చాలు.. ప్రజల్లో ఆనందం మాములుగా ఉండదు. ఆ ఆనందంలో హైదరాబాద్ నగరవాసులు కోట్ల రూపాయల మద్యం తాగేశారు. 4,07,820 బీర్లు, 4,56,228 ఫుల్ బాటిళ్లు.. ఈ నంబర్ చూస్తే చాలు. ఎంతగా కుమ్మేశారో. కొత్త సంవత్సరం సందర్భంగా నగరంలో మద్యం విక్రయాలు రికార్డు స్థాయిలో జరిగాయి. దుకాణాలు, బార్లలో మద్యం విక్రయాలకు అనుమతి ఇవ్వడంతో భారీగా విక్రయాలు పెరిగాయి. అత్యధికంగా రంగారెడ్డి జిల్లా పరిధిలో జోరుగా విక్రయాలు జరిగాయి. మూడు జిల్లాల్లో కలిపి రూ.82.07 కోట్ల ఆదాయం వచ్చింది.
మరోవైపు.. ‘ హ్యాపీ న్యూ ఇయర్’ అంటూ యావత్ దేశం నూతన సంవత్సరానికి స్వాగతం పలికింది. గత ఏడాది జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ.. కొత్త సంవత్సరంలో అంతా మంచే జరగాలని కోరుకుంటూ ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పారు. కేకులు కోసి వేడుకలు చేసుకున్నారు. హైదరాబాద్‌లోని పలు చోట్ల ఏర్పాటు చేసిన వేడుకల్లో యువత ఉత్సాహంగా పాల్గొంది. పెద్ద ఎత్తున యువత పాల్గొని కేరింతలు కొడుతూ కొత్త సంవత్సరానికి స్వాగతం పలికారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు.
ఏపీలో మద్యం రేట్లు ఎక్కువగా ఉండటం, అన్ని బ్రాండ్ల మద్యం దొరక్కపోవడంతో అక్రమంగా మద్యం సరఫరా జరుగుతోంది. తెలంగాణలో గత ఏడాది మద్యం సేల్స్ భారీగా పెరగడానికి ఇది కూడా ఒక కారణంగా చెబుతున్నారు. ఏది ఏమైనా ప్రతీ ఏడాది తెలంగాణలో లిక్కర్ సేల్స్ రికార్డు బద్దలు కొడుతున్నాయి. దీని వల్ల ప్రభుత్వంకు కూడా పెద్ద మొత్తంలో ఆదాయం వస్తోంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం