Telangana: మద్యం ప్రియులకు షాక్.. నీటి చుక్కే కాదు.. ఇకపై బీరు సీసా దొరకడం కష్టమే.. ఎందుకంటే..

ప్రస్తుతం వేసవిలో తీవ్రమైన నీటి కొరత కారణంగా తెలంగాణలో బీరు ఉత్పత్తి తగ్గుముఖం పట్టింది. ఇలాంటి పరిస్థితులు టిప్పర్ల యాజమాన్యాలు, డ్రైవర్లను నిరాశపరిచింది. ఉపాధి లేక విలవిలబోతున్నారు కార్మికులు. ఇదిలా ఉంటే మందుబాబులకు కూడా బీరు ఉత్పత్తి తీవ్ర నిరాశను మిగిల్చింది.

Telangana: మద్యం ప్రియులకు షాక్.. నీటి చుక్కే కాదు.. ఇకపై బీరు సీసా దొరకడం కష్టమే.. ఎందుకంటే..
Beer Production
Follow us

|

Updated on: Apr 04, 2024 | 9:53 PM

ప్రస్తుతం వేసవిలో తీవ్రమైన నీటి కొరత కారణంగా తెలంగాణలో బీరు ఉత్పత్తి తగ్గుముఖం పట్టింది. ఇలాంటి పరిస్థితులు టిప్పర్ల యాజమాన్యాలు, డ్రైవర్లను నిరాశపరిచింది. ఉపాధి లేక విలవిలబోతున్నారు కార్మికులు. ఇదిలా ఉంటే మందుబాబులకు కూడా బీరు ఉత్పత్తి తీవ్ర నిరాశను మిగిల్చింది. వేసవి భానుడు విజృంభించి తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఒకవైపు వర్షాలు కురిసే పరిస్థితులు ఎక్కడా కనిపించడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో చల్లగా బీరు తాగి సేదతీరుదామనుకునే వారికి చేదు వార్త అనే చెప్పాలి. బీరు సరఫరా కోసం పెరుగుతున్న డిమాండ్‌ నేపథ్యంలో స్థానికంగా ఉన్న నీరు సరిపోలడం లేదు. ఎక్సైజ్ శాఖకు ఇప్పటికే 48,71,668 బీరు బాక్సుల అమ్మకాలు జరపడం ద్వారా పన్ను రూపంలో రూ.1,458 కోట్ల ఆదాయం సమకూరింది. నీటి కొరత కారణంగా మరో రెండు నెలల్లో బీరు ఉత్పత్తి తీవ్రంగా దెబ్బతిననుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. దీంతో ప్రభుత్వానికి ఆదాయం కూడా గండిపడే అవకాశం ఉందని చెబుతున్నారు.

తెలంగాణలో బీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలో మైక్రోబ్రూవరీలకు భారీగా అనుమతులు లభించాయి. బీర్ల తయారీ ప్రక్రియ స్థానికంగానే సాగుతూ వచ్చేది. అయితే నీటి కొరతతో గ్రామీణ ప్రాంతాలకు బీర్ల సరఫరా తగ్గింది. బీరు తయారీలో ఎన్నడూ లేని విధంగా నీటి కొరత గడచిన నాలుగేళ్లలో కనీవినీ ఎరుగని రీతిలో ఉందని ఉపాధి కోల్పోయిన బాధితులు చెబుతున్నారు. ఫలితంగా రాష్ట్ర ఖజానాకు రూ.1200 కోట్ల ఆదాయానికి గండి పడనున్నట్లు అంచనా వేస్తున్నారు అధికారులు. నగరం చుట్టూ ఉన్న ప్రధాన రిజర్వాయర్లలో నీటి మట్టాలు తగ్గుముఖం పట్టడం వల్ల బీరు ఉత్పత్తిపై తీవ్రమైన ప్రభావం చూపుతోంది.

ఇంతకుముందు 1999లో ఒకసారి ఇటువంటి నీటి కొరత ఏర్పడింది. అయితే ఇది కొంత కాలం మాత్రమే ఉందని చెబుతున్నారు నిర్వహకులు. రాష్ట్ర ప్రభుత్వం సంగారెడ్డి జిల్లా సింగూర్ జలాశయం నుండి నాలుగు బీరు తయారీ పరిశ్రమలకు నామమాత్రపు ధరకు 44 లక్షల లీటర్ల నీటిని సరఫరా చేసింది. ప్రస్తుతం ఈ ప్రాజెక్టుల నుంచి తాగునీటి కేటాయింపులు సక్రమంగా జరగడం లేదు. ప్రభుత్వం సింగూర్ ప్రజల దాహార్తిని తీర్చకుండా బ్రూవరీలకు నీటిని ఎలా సరఫరా చేస్తుందనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ప్రజలకే తాగేందుకు నీరు లేని పక్షంలో బీరు తయారీ పరిశ్రమలకు నీటిని ఎలా సరఫరా చేస్తారని కొందరు చర్చించుకుంటున్నారు. అందుకే బీరు ఉత్పత్తి చేసే పరిశ్రమలు నిలిచిపోయినట్లు తెలుస్తోంది. కరువు, తాగునీటి ఎద్దడి కారణంగా సింగూరు, మంజీర రిజర్వాయర్లలో నీటిమట్టం మరింత తగ్గుముఖం పట్టింది. హెచ్‌ఎండబ్ల్యూఎస్‌ఎస్‌బీ ప్రయివేటు వనరుల నుంచి నీటిని సేకరించడం కష్టంగా ఉంది. అందువల్ల, SAB మిల్లర్ ఇండియా, యునైటెడ్ బ్రూవరీస్ లిమిటెడ్, కార్ల్స్‌బర్డ్ ఇండియా, క్రౌన్ బీర్స్‌లకు నీటిని సరఫరా చేయలేకపోతున్నారు. దీంతో బీర్ల ఉత్పత్తి తగ్గిపోయింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

అనుమానాస్పదంగా ఆగిన రెడ్ కలర్ కారు.. డోర్లు ఓపెన్ చేస్తే..
అనుమానాస్పదంగా ఆగిన రెడ్ కలర్ కారు.. డోర్లు ఓపెన్ చేస్తే..
ఈ సినిమాను పైరసీ చెయ్యలేరు .. సవాల్ విసిరిన నరేష్
ఈ సినిమాను పైరసీ చెయ్యలేరు .. సవాల్ విసిరిన నరేష్
ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే
ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే
కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!
కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!
‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి
‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి
అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..
అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..
వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..
వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..
కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!
కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!
18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.
18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.
మరికొన్ని గంటల్లో భారత్- శ్రీలంక మ్యాచ్.. ఆస్పత్రిలో కీలక ప్లేయర్
మరికొన్ని గంటల్లో భారత్- శ్రీలంక మ్యాచ్.. ఆస్పత్రిలో కీలక ప్లేయర్