TCongress MLA: 10 కిలోల కణితిని తొలగించిన ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ
నాగర్ కర్నూలు జిల్లా బల్మూర్ మండలం కొండనాగుల గ్రామానికి చెందిన అనిత అనే మహిళ గత ఏడాది నుంచి కడుపునొప్పితో బాధపడుతోంది. అయితే ఇదే విషయాన్ని ఆమె అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ దృష్టికి తీసుకెళ్లగా, మహిళకు కడుపులో కణితి ఉన్నట్లు గుర్తించారు. అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణతో పాటు మరో ముగ్గురు వైద్యుల బృందంతో కలిసి ఆపరేషన్ చేసి కణితిని తొలగించారు.
నాగర్ కర్నూలు జిల్లా బల్మూర్ మండలం కొండనాగుల గ్రామానికి చెందిన అనిత అనే మహిళ గత ఏడాది నుంచి కడుపునొప్పితో బాధపడుతోంది. అయితే ఇదే విషయాన్ని ఆమె అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ దృష్టికి తీసుకెళ్లగా, మహిళకు కడుపులో కణితి ఉన్నట్లు గుర్తించారు. ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణతో పాటు మరో ముగ్గురు వైద్యుల బృందంతో కలిసి ఆపరేషన్ చేసి కణితిని తొలగించారు. మహిళ కడుపులో 10 కిలోల కణితి ఉందని, పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే వంశీ చెప్పారు.
ఎమ్మెల్యే వంశీకృష్ణకు రాజకీయాలతో పాటు డాక్టర్ గాను రాణిస్తున్నారు. ఆయన రాజకీయాలతో బిజీగా ఉన్నప్పటికీ డాక్టర్ గా అవతారమెత్తి పలు ఆపరేషన్లు కూడా చేశారు. ముఖ్యంగా నల్లమల ప్రాంతాలోని ఎంతోమంది పేదలకు ఉచితంగా వైద్యసాయం చేసి వార్తల్లో నిలిచారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన బీఆర్ఎస్ గువ్వల బాలరాజుపై పోటీ చేసి గెలిచారు. అయితే ఓ వైపు ఎమ్మెల్యేగా బాధ్యతలు నిర్వర్తిస్తూనే.. మరోవైపు వైద్య సేవలందిస్తున్నారు.