CM Revanth: సీఎం రేవంత్ కీలక హామీ.. తెలంగాణలో మరో కొత్త జిల్లా ఏర్పాటు?
సికింద్రాబాద్ జిల్లా ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారని సికింద్రాబాద్ జిల్లా సాధన సమితి అధ్యక్షులు గుర్రం పవన్ కుమార్ గౌడ్ తెలిపారు. సికింద్రాబాద్ జిల్లాను ఏర్పాటు చేయాలని కోరుతూ గురువారం ఖైరతాబాద్ MLA, సికింద్రాబాద్ కాంగ్రెస్ MP అభ్యర్థి దానం నాగేందర్ ఆధ్వర్యంలో జూబ్లీహిల్స్ లోని నివాసంలో ముఖ్యమంత్రి ని కలిసి వినతిపత్రం అందజేసి జిల్లా ఏర్పాటు ఆవశ్యకత ను వివరించారు.

స్పందించిన ముఖ్యమంత్రి ఎన్నికలు ముగిసిన అనంతరం జిల్లా ఏర్పాటుకు తీసుకోవాల్సిన చర్యలను పరిశీలించి సానుకూల నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు పవన్ కుమార్ గౌడ్ తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి దంపతులతో కూడిన చిత్రపటాన్ని అందజేశారు. జిల్లా ఏర్పాటు విషయంలో తనవంతు మద్దతు సహాయ సహకారాలు ఉంటాయని గతంలోనే ప్రకటించి నేడు ముఖ్యమంత్రి వద్దకు తీసుకెళ్లిన దానం నాగేందర్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సమితి ప్రధాన కార్యదర్శి సాదం బాల్ రాజ్ యాదవ్, సభ్యులు అశోక్, కృష్ణ ముదిరాజ్, శ్రీకాంత్ రెడ్డి, జగ్గయ్య తదితరులు ఉన్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి