Unique Love: భారత్ అబ్బాయి.. లండన్ అమ్మాయి.. హిందూ సంప్రదాయంలో పెళ్లి..

ముఖ్యంగా విదేశీ యువత భారతీయ యువతి యువకులను ప్రేమించి పెళ్లి చేసుకోవడానికి మనదేశం తరలి వస్తున్నారు. మన సంప్రదాయంలో పెళ్లి చేసుకుంటున్నారు. తాజాగా తెలుగు అబ్బాయి .. లండన్ అమ్మాయిని ప్రేమించి హిందూ సంప్రదాయంలో పెళ్లి చేసుకున్నాడు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం పాత బెల్లంపల్లి గ్రామానికి చెందిన కర్రే చంద్రయ్య, సరోజ ల చిన్న కుమారుడు రాజు గత మూడేళ్ల క్రితం లండన్ వెళ్లి అక్కడే వ్యాపారం చేస్తున్నాడు.

Unique Love: భారత్ అబ్బాయి.. లండన్ అమ్మాయి.. హిందూ సంప్రదాయంలో పెళ్లి..
Unique Love
Follow us
Naresh Gollana

| Edited By: Surya Kala

Updated on: Apr 05, 2024 | 8:03 AM

ఉద్యోగం, ఉపాధి, చదువు ఇలా రకరకాల కారణాలతో కన్నవారిని పుట్టిన ఊరు విడిచి విదేశాల బాట పడుతున్నారు నేటి యువత. అయితే అక్కడ వారితో పరిచయాలు , స్నేహం ప్రేమగా మారి పెళ్లిళ్లు చేసుకునేవారు సంఖ్య కూడా రోజు రోజుకీ పెరుగుతోంది. ముఖ్యంగా విదేశీ యువత భారతీయ యువతి యువకులను ప్రేమించి పెళ్లి చేసుకోవడానికి మనదేశం తరలి వస్తున్నారు. మన సంప్రదాయంలో పెళ్లి చేసుకుంటున్నారు. తాజాగా తెలుగు అబ్బాయి .. లండన్ అమ్మాయిని ప్రేమించి హిందూ సంప్రదాయంలో పెళ్లి చేసుకున్నాడు. వివరాల్లోకి వెళ్తే..

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం పాత బెల్లంపల్లి గ్రామానికి చెందిన కర్రే చంద్రయ్య, సరోజ ల చిన్న కుమారుడు రాజు గత మూడేళ్ల క్రితం లండన్ వెళ్లి అక్కడే వ్యాపారం చేస్తున్నాడు. ఇదే సమయంలో లండన్ కు చెందిన డయానా రాజు ప్రేమించుకున్నారు. డయానా కు భారత్ లో పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన బలంగా కలిగింది. అనుకున్నదే తడవుగా వీరిద్దరూ భారత్ లోనే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. హిందూ ఆచార సంప్రదాయాల ప్రకారం వేదమంత్రాల నడుమ ఈ జంట ఒకటయ్యింది.

బెల్లంపల్లి పట్టణంలోని కాల్ టెక్స్ ఏఆర్ కన్వెన్షన్ లో గురువారం పెళ్లి వేడుకలను సంప్రదాయాల ప్రకారం ఘనంగా నిర్వహించారు.పెళ్లి వేడుకల్లో బంధుగణమంతా ఆసక్తిగా తిలకించారు. లండన్ నుంచి వధువు తల్లిదండ్రులు కారణాల వల్ల రాకపోవడంతో బెల్లంపల్లి చెందిన జర్నలిస్టు ముత్తె వెంకటేష్ – లావణ్య దంపతులు కన్యాదానం చేసి తల్లిదండ్రుల వాత్సల్యాన్ని పంచారు. ఈ సందర్భంగా కన్యాదానం చేసిన దంపతులను ప్రతి ఒక్కరు అభినందించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

కళ్లు పొడిబారి దురద పెడుతున్నాయా.. వెంటనే ఇలా చేయండి!
కళ్లు పొడిబారి దురద పెడుతున్నాయా.. వెంటనే ఇలా చేయండి!
వార్నీ ఇదేం ఏడుపుగొట్టు సంప్రదాయంరా బాబు..పెళ్లికి నెలరోజుల ముందు
వార్నీ ఇదేం ఏడుపుగొట్టు సంప్రదాయంరా బాబు..పెళ్లికి నెలరోజుల ముందు
ఆ రోడ్డుపై వాహనం నడపాలంటే హడల్‌.. నరకంగా మారిన ప్రయాణం, ఎక్కడంటే.
ఆ రోడ్డుపై వాహనం నడపాలంటే హడల్‌.. నరకంగా మారిన ప్రయాణం, ఎక్కడంటే.
ఏడాది చివరిలో స్క్రాంబ్లర్ బైక్ పై అదిరే ఆఫర్..!
ఏడాది చివరిలో స్క్రాంబ్లర్ బైక్ పై అదిరే ఆఫర్..!
ప్రతి రైలు టికెట్‌పై 46 శాతం రాయితీ.. పార్లమెంట్‌లో రైల్వే మంత్రి
ప్రతి రైలు టికెట్‌పై 46 శాతం రాయితీ.. పార్లమెంట్‌లో రైల్వే మంత్రి
అభిమానులతో కలిసి పుష్ప 2 ప్రీమియర్ చూడనున్న అల్లు అర్జున్.
అభిమానులతో కలిసి పుష్ప 2 ప్రీమియర్ చూడనున్న అల్లు అర్జున్.
'సీజ్‌ ది షిప్‌'.. టైటిల్‌ రిజిస్టర్‌ చేసుకున్న ప్రముఖ నిర్మాణ సం
'సీజ్‌ ది షిప్‌'.. టైటిల్‌ రిజిస్టర్‌ చేసుకున్న ప్రముఖ నిర్మాణ సం
జాతీయ భద్రతకు విఘాతం కలిగించేలా పోస్ట్ చేస్తే ఉక్కుపాదమే..
జాతీయ భద్రతకు విఘాతం కలిగించేలా పోస్ట్ చేస్తే ఉక్కుపాదమే..
భారత్‌లో పది వేల రూపాయల నోటు ఉండేదని తెలుసా?
భారత్‌లో పది వేల రూపాయల నోటు ఉండేదని తెలుసా?
భూకంపం విషయంలో ప్రకృతి ముందే హెచ్చరించిందా?
భూకంపం విషయంలో ప్రకృతి ముందే హెచ్చరించిందా?