KCR Polambata: నేడు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మాజీ సీఎం పొలంబాట.. ఎండిన పంటల పరిశీలన!

బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ పొలంబాట పడుతున్నారు. సాగునీరందక పొలాలు ఎండుతుంటే రైతన్నలను కలిసి పరామర్శించి వారి కష్టసుఖాలు తెలుసుకునేందుకు ఆయన క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు. ఇవాళ కరీంనగర్‌ రూరల్‌ మండలం ముగ్దుంపూర్‌ గ్రామానికి రానున్నారు. ఈ సందర్భంగా సాగు నీరందక ఎండిన పంట పొలాలను ఆయన పరిశీలిస్తారు.

KCR Polambata: నేడు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మాజీ సీఎం పొలంబాట.. ఎండిన పంటల పరిశీలన!
Kcr Polambata
Follow us
Balaraju Goud

|

Updated on: Apr 05, 2024 | 8:02 AM

బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ పొలంబాట పడుతున్నారు. సాగునీరందక పొలాలు ఎండుతుంటే రైతన్నలను కలిసి పరామర్శించి వారి కష్టసుఖాలు తెలుసుకునేందుకు ఆయన క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల నల్లగొండ, సూర్యాపేట, జనగామ జిల్లాల్లో పర్యటించిన కేసీఆర్, ఇవాళ కరీంనగర్‌ రూరల్‌ మండలం ముగ్దుంపూర్‌ గ్రామానికి రానున్నారు. ఈ సందర్భంగా సాగు నీరందక ఎండిన పంట పొలాలను ఆయన పరిశీలిస్తారు.

ఉదయం 8.30 గంటలకు ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రం నుంచి బయలుదేరి 11 గంటలకు కరీంనగర్ రూరల్ మండలం ముగ్దుమ్‌పూర్ గ్రామం చేరుకుంటారు.అక్కడ ఎండిపోయిన పంటలను పరిశీలించి రైతుల సమస్యలు అడిగి తెలుసుకుంటారు..అనంతరం మధ్యాహ్నం 2:00 గంటలకు బోయినపల్లి మండల కేంద్రంలో ఎండిన వరి పొలాలను పరిశీలిస్తారు..సాయంత్రం 3:00 గంటలకు శాభాష్‌పల్లి బ్రిడ్జి వద్ద మిడ్ మానేరు ప్రాజెక్టు‌ను సందర్శిస్తారు. ఆ తర్వాత బీఆర్ఎస్ కీలక నేతలతో గులాబీ దళపతి సమావేశం అవుతారు. అనంతరం సిరిసిల్ల నుంచి బయలుదేరి ఎర్రవెల్లి ఫామ్ హౌస్‌కు కేసీఆర్ చేరుకుంటారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…