Pradosha Vratam: రేపు విశిష్టమైన రోజు.. శని ప్రదోష వ్రతం.. శివయ్యను ఎలా పూజించాలంటే..

సాధారణంగా శివుడిని పూజించే భక్తులను శనీశ్వరుడు ఇబ్బంది పెట్టడని నమ్మకం. శివుడిని పూజించేవారికి శనీశ్వరుడి బాధలు ఉండవు. అందుకే శనీశ్వరుడు వక్ర దృష్టితో బాధపడేవారు సైతం శివపూజ, రుద్రాభిషేకాలు నిర్వహిస్తారు. ఈరోజు శివుడికి ఇష్టమైన నైవేద్యం, పూలు పండ్లు సమర్పించి అభిషేకం చేస్తారు. శనీశ్వరుడు శివుని ఆశీర్వాదంతో జన్మించాడు. అందుకే శనివక్ర దృష్టి శివభక్తులపై ఉండదు.

Pradosha Vratam: రేపు విశిష్టమైన రోజు.. శని ప్రదోష వ్రతం.. శివయ్యను ఎలా పూజించాలంటే..
Shani Pradosha Vratam
Follow us
Surya Kala

|

Updated on: Apr 05, 2024 | 7:47 AM

సాధారణంగా ప్రదోష వ్రతం సాయంత్రం సమయంలో చేస్తారు. ప్రదోష వ్రతం నెలలో ఒకసారి వస్తుంది. ఈరోజు శివుడిని పూజించడం ఆచారంగా వస్తుంది. అయితే ప్రదోషవ్రతం ఈసారి అంటే ఏప్రిల్ 6 న శనివారం రానుంది. దీనిని శని ప్రదోష వ్రతం అంటారు. ఈ రోజున అత్యంత పరమ పవిత్రమైన రోజుగా భావిస్తారు. ఈ రెండు కలిసి రావడం అత్యంత విశేషమైన రోజుగా హిందువులు పరిగణిస్తారు.

శనివారం ప్రదోష వ్రతం రెండు కలిసి వచ్చినప్పుడు శని ప్రదోష వ్రతం ఆచరిస్తారు. ఇది చాలా పవిత్రమైన రోజు. శని త్రయోదశి అనేది శనీశ్వరుడిని ఆరాధించడానికి ముఖ్యమైన రోజు. ప్రదోషవతం రోజు శివుడిని పూజిస్తారు. ఈ మాసంలో శనివారం ప్రదోషవ్రతం వచ్చిన కారణంగా శని ప్రదోష వ్రతం రోజున శివుడిని, శనీశ్వరుడిని పూజిస్తారు. ఇలా చేయడం వలన శనీశ్వరుడి దోష బాధల నుంచి కూడా విముక్తి పొందుతారు.

సాధారణంగా శివుడిని పూజించే భక్తులను శనీశ్వరుడు ఇబ్బంది పెట్టడని నమ్మకం. శివుడిని పూజించేవారికి శనీశ్వరుడి బాధలు ఉండవు. అందుకే శనీశ్వరుడు వక్ర దృష్టితో బాధపడేవారు సైతం శివపూజ, రుద్రాభిషేకాలు నిర్వహిస్తారు. ఈరోజు శివుడికి ఇష్టమైన నైవేద్యం, పూలు పండ్లు సమర్పించి అభిషేకం చేస్తారు. శనీశ్వరుడు శివుని ఆశీర్వాదంతో జన్మించాడు. అందుకే శనివక్ర దృష్టి శివభక్తులపై ఉండదు. అలాగే ఆంజనేయుని పూజించినా శనీశ్వరుడి బాధల నుంచి విముక్తి పొందుతారు. శనివారం ఆంజనేయుని గుడికి వెళ్లి పూజలు నిర్వహిస్తారు. దానానికి శనివారం ఎంతో ప్రత్యేకమైన రోజు.

ఇవి కూడా చదవండి

ఏప్రిల్ 6వ తేదీ శనివారం శని ప్రదోష వ్రతం రానుంది. శని ప్రదోష వ్రతం సాధారణంగా ప్రదోష వ్రతం సాయంత్రం సమయంలో చేస్తారు. ఈ ప్రదోష వ్రతం సూర్యాస్తమయానికి ఒక గంట ముందు ఆచరిస్తారు. శివుడికి ఇష్టమైన నైవేద్యలను సమర్పిస్తారు. దగ్గర్లోని శివాలయాలకు వెళ్లి భక్తులు శివుడికి అభిషేకం చేస్తారు. ఈరోజున చేసే దానానికి కూడా ఎంతో ప్రత్యేకత ప్రాముఖ్యత ఉంది. శనివారం సాయంత్రం సమయంలో శివుడికి పాలు గంగాజలంతో అభిషేకం చేయడం వలన విశేష ఫలితం వస్తుంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు