Telangana: ప్రభుత్వాసుపత్రుల్లో చికిత్సకు ఆధార్ ఖచ్చితంగా అవసరమా..? తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం..
ఆధార్ కేవలం స్థానికతను నిర్ధారించేందుకు మాత్రమే ప్రామాణికంగా తీసుకున్నామని వైద్య సేవలకు ఆధార్ కార్డు కచ్చితంగా కాదని తెలిపింది. ఆరోగ్యశ్రీ పథకం లో ఉచిత వైద్య సేవలు అందించటానికి మిగతా ఆసుపత్రులు ఆధార్ ను ప్రామాణికంగా తీసుకుంటున్నాయని అందులో భాగంగా ఫార్మాలిటీగా ఆధార్ స్థానికత నిర్ధారించడానికి అడుగుతున్నారు. తప్ప నిజానికి ప్రభుత్వాసుపత్రిలో వైద్య చికిత్సలకు ఆధార్ అవసరం

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సేవలు పొందాలి అంటే ఆధార్ కార్డ్ తప్పనిసరిగా అవసరం లేదని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు శుక్రవారం(ఫిబ్రవరి28) నాడు తెలిపింది. ఆధార్ కేవలం స్థానికతను నిర్ధారించేందుకు మాత్రమే ప్రామాణికంగా తీసుకున్నామని వైద్య సేవలకు ఆధార్ కార్డు కచ్చితంగా కాదని తెలిపింది. ఆరోగ్యశ్రీ పథకం లో ఉచిత వైద్య సేవలు అందించటానికి మిగతా ఆసుపత్రులు ఆధార్ ను ప్రామాణికంగా తీసుకుంటున్నాయని అందులో భాగంగా ఫార్మాలిటీగా ఆధార్ స్థానికత నిర్ధారించడానికి అడుగుతున్నారు. తప్ప నిజానికి ప్రభుత్వాసుపత్రిలో వైద్య చికిత్సలకు ఆధార్ అవసరం లేదని ప్రభుత్వం తేల్చి తెలిపింది.
నిమ్స్ వంటి ఆసుపత్రిలో నామమాత్రపు రుసుముతో ట్రీట్మెంట్ అందిస్తుంటారు ఆరోగ్యశ్రీ పథకం వర్తించటానికి స్థానికతను నిర్ధారించడానికి అక్కడ ఆధార్ అడుగుతున్నారు అని తెలిపింది. ఆధార్ లేకపోవడంతో స్థానికేతరులకు కూడా ప్రభుత్వ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ పొందుతున్నందు వల్ల స్థానికులకు అవకాశం తగ్గే పరిస్థితి ఉండటంతో ఆధార్ ను కేవలం స్థానికతమ నిర్ధారించేందుకు మాత్రమే ఉపయోగిస్తున్నామని ఆధార్ లేనంత మాత్రాన ట్రీట్మెంట్ జరుగుతుందో లేదో అనడంలో వాస్తవం లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది.
హైదరాబాద్ కి చెందిన అబ్బాయి శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తి ప్రభుత్వ ఆస్పత్రి వైద్య సేవలకు ఆధార్ తప్పనిసరి అవసరమా అంటూ ప్రజా ప్రయోజనం వేయడంతో కోర్టు దినిపై విచారణ చేపట్టింది. అయితే గ్రామీణ ప్రమీల అని మహిళకు ఆధార్ లేనందువల్ల ఆస్పత్రిలో చేయాల్సిన వైద్య సేవలు నిరాకరించారని సోషల్ మీడియాలో వచ్చిన కథనాలపై స్పందిస్తూ ప్రమీలతో పాటు మరో వంద మందికి ఆధార్ లేకున్నా వైద్య సేవలు అందించాలని ప్రభుత్వం తరపు వాదనలో వినిపించింది. ఉత్తమ వ్యవహారాన్ని పరిశీలించిన ధర్మాసనం అంశంపై ఎటువంటి ఎంక్వయిరీ అవసరం లేదని కేస్ ను క్లోజ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..