పెళ్లి చేయాలనుకుంటున్నారా.. అయితే ఈ ఉచిత కళ్యాణ మండపం గురించి తెలుసుకోండి..
ఇల్లు కట్టి చూడు.. పెళ్లి చేసి చూడు అన్నారు పెద్దలు. ఈ రెండిటికీ అయ్యే ఖర్చు ఒక మధ్యతరగతి వాడి కలలో కూడా ఊహించలేనిది. అటువంటి మధ్యతరగతి కుటుంబాలలో జరిగే పెళ్లిళ్లకి తమ వంతు సహాయం అందిస్తూ వారి కలని నెరవేరుస్తున్నారు. దాదాపు కోటి రూపాయలతో కళ్యాణ మండపాన్ని నిర్మించి ఉచితంగా పెళ్లిళ్లు జరిపిస్తున్నారు. బడులు, గుడులు కట్టిస్తే తమ పేరు పది కాలాలపాటు ఉంటుంది అనుకునే వారు వున్నారు.

ఇల్లు కట్టి చూడు.. పెళ్లి చేసి చూడు అన్నారు పెద్దలు. ఈ రెండిటికీ అయ్యే ఖర్చు ఒక మధ్యతరగతి వాడి కలలో కూడా ఊహించలేనిది. అటువంటి మధ్యతరగతి కుటుంబాలలో జరిగే పెళ్లిళ్లకి తమ వంతు సహాయం అందిస్తూ వారి కలని నెరవేరుస్తున్నారు. దాదాపు కోటి రూపాయలతో కళ్యాణ మండపాన్ని నిర్మించి ఉచితంగా పెళ్లిళ్లు జరిపిస్తున్నారు. బడులు, గుడులు కట్టిస్తే తమ పేరు పది కాలాలపాటు ఉంటుంది అనుకునే వారు వున్నారు. కానీ ఇందుకు భిన్నంగా ఒకరు మధ్యతరగతి ఆలోచనలను గమనించి వారి కలలో ఒకటైన పెళ్లికి సంబంధించిన ఖర్చులు తగ్గించడానికి ఏకంగా అందరి అవసరాలకు అనుగుణంగా కళ్యాణ మండపాన్ని ఏర్పాటు చేసి నూరేళ్లపంట అయిన పెళ్లిలను నిర్వహిస్తున్నారు. ఈ కళ్యాణ మండపం మెదక్ జిల్లా నరసాపూర్ మండలం లింగాపూర్ గ్రామంలో ఉంది. ఈ కళ్యాణ మండపాన్ని సందీప్ శ్రీనివాస్ గౌడ్ అనే వ్యక్తి స్థానికంగా ఉన్న అతి పురాతనమైన గండబేరుండ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో నిర్మించారు. తన సొంత నిధులు కోటి రూపాయలతో తండ్రి కీర్తిశేషులు నర్సా గౌడ్ జ్ఞాపకార్థం కళ్యాణ మండపాన్ని ఏర్పాటు చేశారు.
ఈ కళ్యాణ మండపంలో ఎవరైనా సరే ఉచితంగా వివాహాలను జరిపించుకోవచ్చు. దీనికి సంబంధించి వారు ఎటువంటి ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. ఇలా నిర్మించిన ఈ మండపంలో మొదటి పెళ్లి జరిగింది. నర్సాపూర్ మండలం లింగాపూర్ గ్రామానికి చెందిన చింతల్ కిషన్ కుమార్తె వివాహం ఘనంగా ఈ కళ్యాణ మండపంలో జరగడంతో అమ్మాయి తండ్రి ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేశారు. తన కూతురు పెళ్లి వేరే కళ్యాణ మండపం ఏర్పాటు చేయడానికి లక్షల్లో అడిగారని కానీ ఈ కళ్యాణ మండపంలో చేయడంతో తనకు ఒక్క రూపాయి ఖర్చు కాకపోవడంతో పాటు ఆ గండ వీరుండా లక్ష్మీనరసింహస్వామి ఆశీస్సులు సైతం అందాయని ఆయన తెలిపారు. ఈ కళ్యాణ మండపం నిర్మించిన చండీ శ్రీనివాస్ గౌడ్‌ను ఆ గ్రామ ప్రజలతోపాటు పెళ్లికూతురు తండ్రి కిషన్ ప్రశంసించారు. ఈ సందర్భంగా కళ్యాణ మండప నిర్మాణ దాత చండీ శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. కూతురి వివాహం చేయడం ఏ తండ్రికైనా తలకు మించిన భారమ.. అటువంటి సమయంలో ఈ కళ్యాణ మండపం తమకు ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. అటువంటి కార్యక్రమం చేపట్టినందుకు చాలా సంతోషంగా ఉందని.. ఇక్కడ పుట్టినందుకు సొంత ఊరికి ఈ నిర్మాణంతో కాస్త రుణం తీర్చుకున్నానని ఆయన తెలిపారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…




