Telangana: అతని ఇళ్లే ఓ పండ్ల తోట.. 100 రకాల పండ్ల మొక్కలతో విరబూసిన తోట..!
వృత్తి ఉపాధ్యాయుడు, ప్రవృత్తి ప్రకృతి ప్రేమికుడు.. ప్రకృతి సేద్యంతో ఇంటి ఆవరణలో 100 రకాల పండ్ల మొక్కలు, కూరగాయలు పండించి ఆరోగ్యకరమైన జీవితాన్ని అనుభవిస్తూ నలుగురికి ఆదర్శంగా నిలుస్తున్నాడు.
వృత్తి ఉపాధ్యాయుడు, ప్రవృత్తి ప్రకృతి ప్రేమికుడు.. ప్రకృతి సేద్యంతో ఇంటి ఆవరణలో 100 రకాల పండ్ల మొక్కలు, కూరగాయలు పండించి ఆరోగ్యకరమైన జీవితాన్ని అనుభవిస్తూ నలుగురికి ఆదర్శంగా నిలుస్తున్నాడు. ఓ రిటైర్డ్ ఉపాధ్యాయుడు వినూత్న ప్రయోగంతో తన ఇంటిని తోటలా మార్చేశాడు.
పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం ర్యాకల్ దేవ్ పల్లి గ్రామానికి చెందిన రిటైర్డ్ ఉపాధ్యాయుడు కమలాకర్ రెడ్డి ఉపాధ్యాయ వృత్తిలో ఎంతోమంది విద్యార్థుల భవిష్యత్తుకు బాటలు వేశారు. పదవి విరమణ పొందిన తర్వాత తన స్వగ్రామంలో శేష జీవితాన్ని కొత్తగా ప్రారంభించారు.తన ఇంటి ఆవరణను ప్రకృతి వనంగా మార్చేశారు. సుమారు 100 కు పైగా పండ్ల మొక్కలను నాటి, ఇంటికి కావలసిన కూరగాయలు, మొక్కలను పెంచి ఆరోగ్యమైన జీవితాన్ని అనుభవిస్తున్నారు. నలుగురికి ఆదర్శంగా నిలుస్తున్నారు.
తన ఇంటి ఆవరణలో జామ, మామిడి, సపోటా, అరటితోపాటు ద్రాక్ష, పైనాపిల్, కీవీ ఫ్రూట్స్, అంజీర వంటి ప్రత్యేకమైన చెట్లను పెంచడంతోపాటు గిరి, సాయివాలా వంటి శ్రేష్టమైన ఆవులను పెంచుతున్నారు. వాటి పాలతో నెయ్యిని తయారుచేసి, అమెరికాలో ఉన్న తన కుటుంబ సభ్యులు కొడుకు, కూతురికి పంపిస్తూ పూర్తి ఆరోగ్యవంతంగా జీవిస్తున్నారు. పూర్తి సేంద్రియ ఎరువులు, వెరైటీ మొక్కలను పెంచి, తన ఇంటిని పార్కు లాగా మలిచిన కమలాకర్ రెడ్డి చేస్తున్న సాగును చూసేందుకు పరిసర గ్రామాల ప్రజలు కూడా వచ్చి తిలకిస్తున్నారు. పలువురికి ఆదర్శంగా నిలుస్తున్న కమలాకర్ రెడ్డిని గ్రామస్తులు అభినందిస్తున్నారు.
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..