Telangana News: బిగినర్స్ మిస్టేక్స్ ఇవన్నీ.. అడ్డంగా బుక్ అయిన దొంగ..

పరిగి మండలం గడిసింగాపూర్‌కు చెందిన అజయ్ అనే వ్యక్తి ఈ నెల 18న పరిగిలోని విజేత ఆస్పత్రికి పని నిమిత్తం వచ్చి బయట బైక్ పార్కు చేసి వెళ్లాడు. ఇదే అదనుగా భావించి ఓ దొంగ ఆ బైకును చోరీ చేశాడు. ఇంకేముంది.. నెంబర్ మార్చి అదే బైకుపై దర్జాగా రోడ్లపై తిరుగుతూ ఉన్నాడు. చివరికి ఎలా దొరికిపోయాడో తెలుసా?

Telangana News: బిగినర్స్ మిస్టేక్స్ ఇవన్నీ.. అడ్డంగా బుక్ అయిన దొంగ..
Bike Stolen Person Arrested
Follow us
Noor Mohammed Shaik

| Edited By: Velpula Bharath Rao

Updated on: Oct 22, 2024 | 12:57 PM

ఈ మధ్య బైకు దొంగతనాలు మరీ ఎక్కువైపోయాయి. ఇంటి బయట పార్కు చేసిన బైకులను ఏ అర్ధరాత్రి పూటో సరైన సమయం చూసుకుని చుట్టుపక్కల ఎవరూ లేకపోవడమే అదనుగా పక్కా ప్లాన్ చేసుకుని దొంగతనాలకు పాల్పడుతున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే ఒక్కటి చోటు చేసుకుంది. దొంగతనం చేయడమే కాకుండా నెంబర్ ప్లేట్ మార్చి దర్జాగా అదే బైకుపై తిరిగాడు ఆ దొంగ. ఇది గమనించిన బైక్ యజమాని ఛేజ్ చేసి మరీ పట్టుకుని దేహశుద్ధి చేశాడు. ఇది ఎక్కడ జరిగిందో పూర్తి వివరాలు తెలుసుకుందాం..

వికారాబాద్ జిల్లా పరిగి మండలం గడిసింగాపూర్‌కు చెందిన అజయ్ అనే వ్యక్తి ఈ నెల 18న పరిగిలోని విజేత ఆస్పత్రికి పని నిమిత్తం వచ్చి బయట బైక్ పార్కు చేసి వెళ్లాడు. ఇదే అదనుగా భావించి ఓ దొంగ ఆ బైకును చోరీ చేశాడు. ఇంకేముంది.. నెంబర్ మార్చి అదే బైకుపై దర్జాగా రోడ్లపై తిరుగుతూ ఉన్నాడు. ఇదే క్రమంలో ఆ బైక్ యజమాని అజయ్ ఇది గమనించి.. అది తన బైకే అని నిర్ధారించుకున్నాడు. బండి ఆపమన్నా ఆపకుండా ఆ దొంగ వెళ్లిపోవడం చూసి బైకు యజమాని ఛేజ్ చేశాడు. గడిసింగాపూర్ గ్రామంలో ఉంటున్న తన బంధువులకు సమాచారం ఇవ్వడంతో బైకును ఆపి దొంగను ఎట్టకేలకు పట్టుకున్నారు. అనంతరం ఆ దొంగకు తగిన విధంగా బుద్ధి చెప్పాలని స్తంభానికి కట్టి దేహశుద్ది చేశారు. ఇలాంటివి మరోసారి జరగకుండా ఉండాలని భావించి ఆ దొంగను పోలీసులకు అప్పగించారు. కాగా, ఇదే కాకుండా పరిగిలో చోరీ కాబడిన బైకుల వివరాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. ఇలాంటి దొంగతనాలకు పాల్పడే వారిపై తగిన విధంగా చర్యలు తీసుకుని.. భవిష్యత్తులో పునరావృతం కాకుండా చూస్తామని పోలీసులు చెబుతున్నారు.

వీడియో ఇదిగో:

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..