AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: ఆరు గ్యారెంటీల అమలుపై నేడు సీఎం కీలక సమావేశం..

ఇక ఆరు గ్యారంటీల్లో మిగతా పథకాలపై మహాలక్ష్మీ, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇళ్లు, చేయూత పథకాలను ప్రజలకు అందించేందుకు సిద్ధమైంది. ప్రస్తుతం పాత విధానంలాగే పెన్షన్లను అందిస్తున్న ప్రభుత్వం త్వరలోనే పెరిగిన పెన్షన్‌ను అందించనుంది. ఇందులో భాగంగానే ప్రజాపాలన కార్యక్రమం పేరుతో అర్హులైన వారి నుంచి దరఖాస్తులను స్వీకరించింది...

Telangana: ఆరు గ్యారెంటీల అమలుపై నేడు సీఎం కీలక సమావేశం..
CM Revanth
Narender Vaitla
|

Updated on: Jan 08, 2024 | 6:55 AM

Share

కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేసే దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. లోక్‌ సభ ఎన్నికలలోపే వీలైనన్ని పథకాలను ప్రజలకు చేరువచేయాలనే ఆలోచనలో ఉన్నట్లు స్పష్టమవుతోంది. ఇందులో భాగంగానే ఇప్పటికే ఆరోగ్యశ్రీ బీమా పరిమితిని పెంచడంతో పాటు ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం కల్పించింది.

ఇక ఆరు గ్యారంటీల్లో మిగతా పథకాలపై మహాలక్ష్మీ, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇళ్లు, చేయూత పథకాలను ప్రజలకు అందించేందుకు సిద్ధమైంది. ప్రస్తుతం పాత విధానంలాగే పెన్షన్లను అందిస్తున్న ప్రభుత్వం త్వరలోనే పెరిగిన పెన్షన్‌ను అందించనుంది. ఇందులో భాగంగానే ప్రజాపాలన కార్యక్రమం పేరుతో అర్హులైన వారి నుంచి దరఖాస్తులను స్వీకరించింది. డిసెంబర్‌ 28వ తేదీ నుంచి ఈ నెల 6వ తేదీ వరకు అధికారులు దరఖాస్తులు స్వీకరించారు.

ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. గ్రామాలు, పట్టణాల వారిగా ఏ వార్డుకు ఆ వార్డులో దరఖాస్తులు స్వీకరించడంతో ప్రజాపాలన కార్యక్రమం సజావుగా సాగింది. ఇక దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ పూర్తయిన నేపథ్యంలో వీటిపై తదుపరి కార్యాచరణ ఏంటన్న దానిపై సీఎం రేవంత్‌ రెడ్డి దృష్టిసారించారు. ఇందులో భాగంగానే ఈరోజు (సోమవారం) ఉదయం 11 గంటలకు సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు, సీఎస్‌ శాంతికుమారి, అన్ని శాఖల కార్యదర్శులు, ఉమ్మడి జిల్లాలకు ప్రత్యేకంగా నియమించిన నోడల్‌ అధికారులు, సీజీజీ డైరెక్టర్‌ జనరల్‌, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ తదితర ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో ప్రజాపాలనపై ప్రత్యేకంగా రూపొందించిన వెబ్‌సైట్‌ prajapalana.telangana.gov.in ను సీఎం ప్రారంభించనున్నారు.

ఇక ప్రజాపాలనలో వచ్చిన దరఖాస్తులకు సంబంధించి డేటా ఎంట్రీని ఈ నెల 17వ తేదీలోగా పూర్తి చేయాలని సీఎస్‌ అన్ని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. పది రోజుల్లో మొత్తం 1,25,84,383 దరఖాస్తులు అందాయి. వీటిలో అయిదు హామీలకు సంబంధించి 1,05,91,636 అర్జీలు రాగా.. ఇతర అభ్యర్థనలకు సంబంధించి 19,92,747 వచ్చాయి. వీటిలో అధికంగా నెలకు రూ. 2500 ఆర్థిక సాయం, ఇందిరమ్మ ఇళ్లు, రేషన్‌ కార్డుల కోసం అత్యధిక దరఖాస్తులు వచ్చినట్లు తెలుస్తోంది. మరి ఇతర పథకాల అమలు గురించి సీఎం ఈ రోజు ఏ ప్రకటన చేస్తారో చూడాలి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..