AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CM Revanth Reddy: సోమవారం సీఎం రేవంత్‌ ఉన్నతస్థాయి సమీక్ష.. క్యాబినెట్ భేటీలో చర్చించే అంశాలివే..

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కార్యక్రమం ప్రజాపాలన. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా, మండల, గ్రామ స్థాయిలో ప్రజలకు సంక్షేమ పథకాలు అందించాలని దీనిని రూపొందించారు. ఈ కార్యక్రమం డిసెంబర్‌ 26 నుంచి జనవరి 6 వరకు నిర్వహించారు. దీనిపై సోమవారం సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించనున్నారు.

CM Revanth Reddy: సోమవారం సీఎం రేవంత్‌ ఉన్నతస్థాయి సమీక్ష.. క్యాబినెట్ భేటీలో చర్చించే అంశాలివే..
Cm Revanth Reddy
Srikar T
|

Updated on: Jan 07, 2024 | 10:00 PM

Share

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కార్యక్రమం ప్రజాపాలన. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా, మండల, గ్రామ స్థాయిలో ప్రజలకు సంక్షేమ పథకాలు అందించాలని దీనిని రూపొందించారు. ఈ కార్యక్రమం డిసెంబర్‌ 26 నుంచి జనవరి 6 వరకు నిర్వహించారు. దీనిపై సోమవారం సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారితో పాటు వివిధశాఖలకు చెందిన ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, నోడల్ అధికారులు, సీజీజీ డైరెక్టర్ జనరల్, జీహెచ్ఎంసీ కమిషనర్ సహా ఉన్నతాధికారులు హాజరుకానున్నారు.

దాదాపు 10 రోజుల పాటు సాగిన ఈ కార్యక్రమంలో ఎదురైన సమస్యలు, లోపాలను గురించి చర్చించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఆ తరువాత ప్రజాపాలనపై ప్రత్యేకంగా రూపొందించిన prajapalana.telangaana.gov .in వెబ్‌సైట్‌‎ను ప్రారంభిస్తారు. ప్రజాపాలన కార్యక్రమంలో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1,25,84,383 దరఖాస్తులు అందాయి. ఇందులో ఐదు గ్యారంటీలకు సంబంధించి 1,05,91,636 దరఖాస్తులు కాగా.. ఇతర అభ్యర్థలనకు సంబంధించి 19 ,92 ,747 దరఖాస్తులు వచ్చాయి. ప్రజాపాలన సజావుగా జరిగేందుకు పది ఉమ్మడి జిల్లాలు, జీహెచ్‌ఎంసీలోని ఐదు జోన్లకు ఒక్కొక్క సీనియర్ ఐఏఎస్ అధికారిని ప్రత్యేక పర్యవేక్షణాధికారులుగా ప్రభుత్వం నియమించింది. ఈ దరఖాస్తులన్నింటిని జనవరి 17లోగా డేటా ఎంట్రీ చేయాలని సంబంధిత కలెక్టర్లను ప్రభుత్వం ఆదేశించింది.

మంత్రి వర్గం సమావేశంపై ఉత్కంఠ..

రేపు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో కేబినెట్ భేటీ కానుంది. అయితే.. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి నేటితో నెల పూర్తయిన నేపథ్యంలో.. కేబినెట్ భేటీ నిర్వహించడం సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ మంత్రి వర్గ సమావేశంలో ఏ అంశంపై చర్చించనున్నారు అని ప్రతి ఒక్కరు ఎదురు చూస్తున్నారు. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో నెల రోజుల పాలన, ఆరు గ్యారెంటీల అమలుపైనే ప్రధానంగా చర్చజరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో అధికారం చేపట్టి ముందుకు సాగుతున్న తరుణంలో పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై కూడా చర్చించనున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు మరిన్ని హామీలు అమలుకు సంబంధించిన విషయాలు చర్చకు రానున్నట్లు సమాచారం. అలాగే దేశ వ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలు జరుగనున్నాయి. ఎంపీ ఎన్నికల నేపథ్యంలో ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చేలోపే.. ఎమ్మెల్సీ పదవులతో పాటు కార్పొరేషన్ల ఛైర్మన్లు, టీఎస్పీఎస్సీ ఛైర్మన్ నియామకాలు చేపట్టాలని రేవంత్ రెడ్డి భావిస్తున్నట్లు సమాచారం.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..