Revanth Reddy: ముఖ్యమంత్రిగా వన్‌మంత్ పాలనలో తనదైన మార్కుతో మార్పు తెచ్చిన రేవంత్ రెడ్డి
ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి...నెల రోజులు పూర్తి చేసుకున్నారు. వన్ మంత్ అంటే చాలా తక్కువ టైమ్. అయితే ఈ తక్కువ సమయంలోనే రేవంత్ తనదైన ముద్ర వేశారా? పరిపాలనలో ఆయన తన మార్కు చూపించగలిగారా? ఈ 30 రోజుల్లో ఆయన ఏం చేశారు. ఎలాంటి సాహసోపేత నిర్ణయాలు తీసుకున్నారు? పరిపాలన అయినా, రాజకీయం అయినా సింగిల్‌గా సాగిపోతున్నారా?
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు దీరి నెల రోజులు అయింది. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి…నెల రోజులు పూర్తి చేసుకున్నారు. వన్ మంత్ అంటే చాలా తక్కువ టైమ్. అయితే ఈ తక్కువ సమయంలోనే రేవంత్ తనదైన ముద్ర వేశారా? పరిపాలనలో ఆయన తన మార్కు చూపించగలిగారా? ఈ 30 రోజుల్లో ఆయన ఏం చేశారు. ఎలాంటి సాహసోపేత నిర్ణయాలు తీసుకున్నారు? పరిపాలన అయినా, రాజకీయం అయినా సింగిల్‌గా సాగిపోతున్నారా? అందరితో మింగిల్ అవుతున్నారా? రేవంత్..వన్ మంత్..పాలనా పరంగా ఎలాంటి మార్పులు తెచ్చింది? ఇదే అందరి నోట నానుతున్న ప్రశ్న..!
డిసెంబర్ 7…తెలంగాణ ముఖ్యమంత్రిగా ఏనుముల రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. జనవరి 7కి.. రేవంత్ వన్ మంత్ పరిపాలన పూర్తి చేసుకున్నారు. అయితే ఈ నెల రోజుల్లో పరిపాలనలో ముఖ్యమంత్రిగా తనదైన ముద్ర వేశారు రేవంత్. అధికారం చేపట్టగానే….కాంగ్రెస్ ఇచ్చిన ఆరు హామీల్లో రెండింటిని 48 గంటల్లో అమలు చేశారు. మహాలక్ష్మి పథకం కింద రాష్ట్రంలోని మహిళలంందరికీ ఫ్రీ బస్ సౌకర్యం అమలు చేయడంతో మహిళా లోకం మురిసిపోయింది. ఆ తర్వాత ఆరోగ్య శ్రీ పరిమితిని 10 లక్షల రూపాయలకు పెంచారు. ప్రగతి భవన్‌ను ప్రజా భవన్‌గా మార్చి.. ప్రజలు తమ గోడు చెప్పుకునేందుకు ప్రజావాణి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
ఆ తర్వాత పేపర్ లీకులతో వీక్ అయిపోయిన TSPSC ప్రక్షాళన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు సీఎం రేవంత్. నేనున్నా అంటూ నిరుద్యోగులకు భరోసా కల్పించే ప్రయత్నం చేశారు. దానికోసం ఢిల్లీకి కూడా వెళ్లి UPSC చైర్మన్‌తో కూడా భేటీ అయ్యారు. ఇక సీఎం అవగానే ఐఏఎస్, ఐపీఎస్‌ల మార్పులు చేర్పులకు శ్రీకారం చుట్టారు. .డ్రగ్స్ అనే మాట తెలంగాణలో వినపడకూడదంటూ సన్ బర్న్ లాంటి ప్రోగ్రామ్‌లకు అడ్డుకట్ట వేసి తనదైన మార్కు చూపించారు.
పరిపాలనలోనే కాకుండా ప్రభుత్వ, పార్టీ కార్యక్రమాల్లో కూడా తనదైన మార్కుతో రాణిస్తున్నారు రేవంత్. సీఎం అయ్యాక నేనొక్కడినే అన్నట్లు కాకుండా మనమందరం అంటూ ముందుకు సాగుతున్నారు ముఖ్యమంత్రి రేవంత్. హైదరాబాద్‌లో అయినా, ఢిల్లీ పర్యటనలో అయినా తన మంత్రివర్గ సహచరులను కలుపుకుపోతున్నారు. ఇటీవలే ఢిల్లీ పర్యటనకు వెళ్లిన ఆయన తన మంత్రివర్గ సహచరులతో కలిసి కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు. ఇలా టీమ్ వర్క్ అంటూ ముందుకు సాగుతున్నారు. సింగిల్‌గా కాకుండా అందరితో మింగిల్ అవుతున్నారు రేవంత్.
ఇక తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి నెలరోజులు పూర్తయిన సందర్భంగా సీఎం రేవంత్ ట్వీట్ చేశారు. సంకెళ్లను తెంచి, స్వేచ్ఛను పంచి జనం ఆకాంక్షలను నిజం చేస్తూ సాగిన ఈ నెల రోజుల ప్రస్థానం ఎంతో తృప్తినిచ్చిందన్నారు. నెలరోజుల ప్రయాణం కొత్త అనుభూతిని ఇచ్చిందని ఎక్స్‌లో పోస్ట్ చేశారు. పేదలు, మహిళలు, యువత భవిత, రైతుకు భరోసా ఇస్తూ సాగిన నెల రోజుల ప్రయాణం ఉజ్వల భవిత వైపునకు అడుగులు వేస్తోందన్నారు. తెలంగాణ కోసం గట్టి పట్టుదలతో సాగిన ఈ నెల రోజుల పాలన బాధ్యతగా సాగిందన్నారు. రేవంతన్నగా పిలిచే తనను తెలంగాణ ప్రజల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయేలా ఇక ముందు కూడా తన బాధ్యత నిర్వర్తిస్తానన్నారు ఆయన.
సంకెళ్లను తెంచి, స్వేచ్ఛను పంచి జనం ఆకాంక్షలను నిజం చేస్తూ సాగిన ఈ నెల రోజుల ప్రస్థానం తృప్తినిచ్చింది.
సేవకులమే తప్ప పాలకులం కాదన్న మాట నిలబెట్టుకుంటూ… పాలనను ప్రజలకు చేరువ చేస్తూ… అన్నగా నేనున్నానని హామీ ఇస్తూ జరిగిన నెల రోజుల ప్రయాణం కొత్త అనుభూతిని ఇచ్చింది.
పేదల గొంతుక… pic.twitter.com/gkzpRy1zGT
— Revanth Reddy (@revanth_anumula) January 7, 2024
నెలరోజుల పాలనలో ప్రజలకు మరింత చేరువ అయ్యాం అన్నారు నీటి పారుదల, పౌర సరఫరాల శాఖా మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి. ఇక నెల రోజుల కాంగ్రెస్ పాలన ప్రజారంజకంగా సాగిందన్నారు ఆ పార్టీ సీనియర్ నేత మల్లు రవి. కేవలం నెలరోజుల్లోనే సీఎం రేవంత్‌రెడ్డి తనదైన మార్క్ పాలనతో ప్రజల మనస్సును చూరగొన్నారన్నారు. వన్ మంత్ పాలనలో రేవంత్ తనదైన మార్కుతో ముందుకు సాగిపోతున్నారు. ఇక వంద రోజుల్లోపు ఆరు గ్యారంటీలు అమలు చేసి…లోక్‌సభ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలిచే వ్యూహంతో సీఎం రేవంత్ అడుగులు వేస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…