AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: ఆ ఇంటి చుట్టూ ఎప్పుడూ పక్షుల గుంపే.. ప్రతిరోజూ తిండి పెడుతున్న దంపతులు

వీరికి... పక్షులు అంటే ప్రేమ. వాటికీ కడుపు నిండా తిండి పెడుతారు. ఉదయం పూట పక్షుల కిల.. కిలలు.. ఇంటి చుట్టూ పక్షులతో నిండి ఉంటుంది. ఈ ఇంట్లో అడుగు పెడితే ముందుగా పక్షులే దర్శనమిస్తాయి. గోడ, ఇంటిపై వాలుతాయి. ఆకలి అయితే చాలు.. అరుస్తుంటాయి. అంతే కాదు.. పక్షుల కోసం వారు ప్రత్యేకంగా వంట కూడా చేస్తున్నారు. కడుపు నిండా తిన్న తరువాత అవి ఎగిరి పోతాయి. ఇదే ప్రాంతంలో పక్షులు ఎక్కువగా తిరుగుతున్నాయి. దీంతో ఈ ఇల్లు చిన్నపాటి పర్యాటక ప్రాంతంగా మారిపోయింది.

Telangana: ఆ ఇంటి చుట్టూ ఎప్పుడూ పక్షుల గుంపే.. ప్రతిరోజూ తిండి పెడుతున్న దంపతులు
Sparrow
G Sampath Kumar
| Edited By: |

Updated on: Aug 29, 2023 | 2:25 PM

Share

వీరికి… పక్షులు అంటే ప్రేమ. వాటికీ కడుపు నిండా తిండి పెడుతారు. ఉదయం పూట పక్షుల కిల.. కిలలు.. ఇంటి చుట్టూ పక్షులతో నిండి ఉంటుంది. ఈ ఇంట్లో అడుగు పెడితే ముందుగా పక్షులే దర్శనమిస్తాయి. గోడ, ఇంటిపై వాలుతాయి. ఆకలి అయితే చాలు.. అరుస్తుంటాయి. అంతే కాదు.. పక్షుల కోసం వారు ప్రత్యేకంగా వంట కూడా చేస్తున్నారు. కడుపు నిండా తిన్న తరువాత అవి ఎగిరి పోతాయి. ఇదే ప్రాంతంలో పక్షులు ఎక్కువగా తిరుగుతున్నాయి. దీంతో ఈ ఇల్లు చిన్నపాటి పర్యాటక ప్రాంతంగా మారిపోయింది. ఈ దంపతులకు పక్షులపై ఎందుకు అంత ప్రేమ కలిగింది. ఎందుకు వాటికోసం ప్రత్యేకంగా వంట చేస్తూ వాటిని పోషిస్తున్నారు అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ఇక వివరాల్లోకి వెళ్తే పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‎లోని గాంధీనగర్ చెందిన అల్లం సత్యనారాయణ, భాగ్యలక్ష్మి దంపతులు. వృత్తిరీత్యా ఉపాధ్యాయులైన వీరు ఎంతోమంది విద్యార్థులకు దారి చూపారు. ఆ తర్వాత రిటైర్ అయిపోయారు. ఇప్పుడు ఈ విశ్రాంత సమయంలో వారు పక్షి ప్రేమికులుగా మారిపోయారు. ఉదయం పూట వారు తినేటువంటి బిస్కెట్, ఇడ్లీలను పక్షులకు పెడుతున్నారు. అంతేకాదు వారు అన్నం తినే ముందు పక్షులకు తమ ఇంటి ముందు గోడపైన అన్నం పెట్టి వారు తింటారు. 10 నిమిషాలు ఆలస్యమైతే చాలు మధ్యాహ్నం పూట వారి ఇంటి పైన పక్షులు గిరగిరా తిరుగుతుంటాయి. వారు ఎటైనా ఊరికి వెళ్తే ఇంటి ముందు పక్షులు గుంపులు గుంపులుగా వచ్చి కూర్చుంటాయి. అయితే నిత్యం వాటి కడుపు నింపుతున్న ఈ పక్షి ప్రేమికులను చూసి అందరూ ఈ దంపతులను శభాష్ అని మెచ్చుకుంటున్నారు.

ఇవి కూడా చదవండి

పిచ్చుక.. కాకులు ఇతర పక్షులకు ఈ ఇల్లు ఇప్పుడు ఆవాస కేంద్రంగా మారిపోయింది. సహజంగా కాకులకు మనుషులు కనబడుతే చాలు.. అక్కడి నుంచి వెళ్ళిపోతాయి. కానీ ఈ దంపతులను చూస్తే మాత్రం పక్షులు వారి దగ్గరి వరకు వస్తున్నాయి. అప్పుడప్పుడు చేతిపై కూడా వాలుతున్నాయి. ఎటు వెళ్లినా కూడా.. వీటికి ఆహారం అందించిన తర్వాతే వారు బయటకు వెళ్తున్నారు. వివిధ రకాల పక్షులను చూడాలంటే ఈ ఇంటికి రావాల్సిందే. ఇలా ఆహారం పెట్టడం.. తమకు ఎంతో తృప్తి ఉందని చెబుతున్నారు ఈ దంపతులు.

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!