Sr NTR Coin: హైదరాబాద్‌లో ఎన్టీఆర్ స్మారక నాణేన్ని ఎలా కొనుగోలు చేయాలంటే.? పూర్తి వివరాలు..

రాష్ట్రపతి చేతుల మీదుగా విడుదలైన ఎన్టీఆర్ వంద రూపాయల నాణెం విక్రయాలు ప్రారంభమైయ్యాయి..దేశవ్యాప్తంగా 12వేల వంద రూపాయల కాయిన్స్ ముద్రించారు. వాటిని కొనుగోలు చేసేందుకు ఎన్టీఆర్ అభిమానులు మింట్ కాంపౌండ్ వద్ద బారులు తీరారు. ఎన్టీఆర్ చిత్రంతో నాణెం రిలీజ్ చేయడంతో దాన్ని కొనుగోలు చేసేందుకు..

Sr NTR Coin: హైదరాబాద్‌లో ఎన్టీఆర్ స్మారక నాణేన్ని ఎలా కొనుగోలు చేయాలంటే.?  పూర్తి వివరాలు..
Sr Ntr Rs 100 Coin
Follow us
Ravi Kiran

|

Updated on: Aug 29, 2023 | 6:48 PM

ప్రైడ్ ఆఫ్ తెలుగు.. నందమూరి తారక రామారావు… ఆ మహనీయుణ్ణి గట్టిగా స్మరించుకునే ఛాన్స్ మళ్లీ దొరికింది. అన్నగారి స్మారక చిహ్నంగా… నిన్న ఆయన శతజయంతి సందర్భంగా రిలీజైన 100 రూపాయల నాణేన్ని తెలుగు జాతి యావత్తూ గుండెలకు హత్తుకుంటోంది.

ఢిల్లీలో రాష్ట్రపతి చేతుల మీదుగా ఆవిష్కృతమైంది వంద రూపాయల స్మారక నాణెం… ఇప్పుడు దీని గురించే తెలుగునాట చర్చంతా. అసలేమిటీ కాయిన్.. నందమూరి అందగాడి బొమ్మ సరే.. అటువైపున్న బొరుసు సంగతేంటి.. ఆ కాయిన్ ఎందుకంత విశిష్టమైంది.. దాని తయారీకి జరిగిన పరిశ్రమ ఎంత… చూద్దాం..

మన హైదరాబాద్‌ మింట్‌లోనే తయారైంది ఈ కాయిన్. ఇది ఎందుకంత స్పెషల్ అంటే… నాలుగు ధాతువుల మిశ్రమంగా రూపొందిన కాయిన్ కనుక..

  • –50 శాతం వెండి
  • –40 శాతం రాగి
  • –5 శాతం నికెల్
  • –5 శాతం జింక్

ఈ రేరెస్ట్ మెటల్ కంపోజిషన్‌తో పాటు.. ఎన్టీయార్ ఫేస్‌లో ఉండే ఎక్స్‌ప్రెషన్స్‌ అన్నిటినీ రిప్రజెంట్ చేస్తూ తయారు చేశారు. రాష్ట్రపతి చేతుల మీదుగా విడుదలైన ఎన్టీఆర్ వంద రూపాయల నాణెం విక్రయాలు ప్రారంభమైయ్యాయి..దేశవ్యాప్తంగా 12వేల వంద రూపాయల కాయిన్స్ ముద్రించారు. వాటిని కొనుగోలు చేసేందుకు ఎన్టీఆర్ అభిమానులు మింట్ కాంపౌండ్ వద్ద బారులు తీరారు. ఎన్టీఆర్ చిత్రంతో నాణెం రిలీజ్ చేయడంతో దాన్ని కొనుగోలు చేసేందుకు చాలామంది తెలుగువారు ఆసక్తి చూపుతున్నారు.

హైదరాబాద్‌లో కేవలం 4000 కాయిన్స్ మాత్రమే విక్రయించడంతో వాటిని కొనుగోలు చేసేందుకు మింట్ కాంపౌండ్ వద్ద ఎన్టీఆర్ అభిమానులు క్యూ లైన్ లో ఉన్నారు. మూడు రకాలుగా ఉన్న ఈ వంద రూపాయల ఒక్క నాణెం రూ. 4050 నుంచి 4850గా నిర్ణయించారు. ఎన్టీఆర్ మీద ఉన్న అభిమానంతో చాలామంది ఆయనకు గుర్తుగా దాచుకోవడం కోసం ఈ కాయిన్ కొంటున్నారు. మరి మీరూ ఈ నాణేన్ని కొనుగోలు చేయాలంటే.. వందరూపాయల బిళ్ల కదా అని వందరూపాయలకే దక్కించుకుందాం అనుకుంటారేమో.. ఛాన్సే లేదు. ఆన్‌లైన్‌లో కొనుక్కుంటే ఈ కాయిన్ కాస్ట్ 4 వేలకు పైగా పలుకుతుంది. ప్యాకేజింగ్ స్టయిల్‌ని బట్టి రేటు ఇంకా పెరిగినా పెరగొచ్చు. ‘ఇండియా గవర్నమెంట్ మింట్’ అనే వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌లో దొరుకుతోంది. హైదరాబాద్‌లోని మింట్ కౌంటర్లలో నేరుగా కూడా కొనుగొలు చెయ్యొచ్చు. వందరూపాయల బిళ్ల కదా అని వందరూపాయలకే దక్కించుకుందాం అనుకుంటారేమో.. ఛాన్సే లేదు. ఆన్‌లైన్‌లో కొనుక్కుంటే ఈ కాయిన్ కాస్ట్ 4 వేలకు పైగా పలుకుతుంది. ప్యాకేజింగ్ స్టయిల్‌ని బట్టి రేటు ఇంకా పెరిగినా పెరగొచ్చు. ‘ఇండియా గవర్నమెంట్ మింట్’ అనే వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌లో దొరుకుతోంది. హైదరాబాద్‌లోని మింట్ కౌంటర్లలో నేరుగా కూడా కొనుగొలు చెయ్యొచ్చు.