Swab Stick Broken in Nose: కరోనా పరీక్ష కేంద్రం ముఖ్య అతిథి ముక్కులో విరిగిన స్వాబ్ స్టిక్.. తొలి టెస్టు చేస్తుండగా ఘటన !
కరోనా టెస్ట్ చేస్తున్న సమయంలో స్వాబ్ స్టిక్ పుల్ల ముక్కులో విరిగిపోయిన ఘటన కరీంనగర్ జిల్లాలో చోటు చేసుకుంది.
Swab Stick Broken in Nose: కరోనా టెస్ట్ చేస్తున్న సమయంలో స్వాబ్ స్టిక్ పుల్ల ముక్కులో విరిగిపోయిన ఘటన కరీంనగర్ జిల్లాలో చోటు చేసుకుంది. రామడుగు మండలం వెంకట్రావుపల్లెలో సర్పంచ్ శేఖర్ కరోనా టెస్ట్ చేయించుకుంనేందుకు పరీక్షా కేంద్రానికి వచ్చారు. అయితే పరీక్ష చేస్తుండగా, స్వాబ్ స్టిక్ పుల్ల ముక్కులో విరిగిపోయింది. దీంతో వెంటనే బాధితుడిని కరీంనగర్ ఆసుపత్రికి తరలించగా ఎండోస్కోపీ విధానం ద్వారా దాన్ని బయటకి తీశారు. దీంతో గ్రామస్తులంతా ఉపిరి పీల్చుకున్నారు.
రామడుగు మండలం వెంకట్రావుపల్లి పరిధిలోని గోపాల్‌రావుపేట పీహెచ్‌సీ ఆధ్వర్యంలో గ్రామంలో ప్రత్యేక కరోనా పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. దీని ప్రారంభానికి ముఖ్య అతిథిగా స్థానిక సర్పంచ్ జవ్వాజి శేఖర్ హాజరయ్యారు. తొలి పరీక్షను ఆయనకే నిర్వహించారు. ఈ సందర్భంగా స్వాబ్ స్టిక్ చివరి భాగం ముక్కులోనే విరిగిపోయింది. దీంతో హుటాహుటిన కరీంనగర్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. వైద్యుడు డాక్టర్ వంశీకృష్ణారావు ఎండోస్కోపీ ద్వారా దానిని బయటకు తీశారు. దీంతో ప్రమాదం తప్పింది.