Etela Rajender Joining BJP: కమలం పార్టీ చెంతకు ఈటల.. సోమవారం బీజేపీలో చేరిక!

ఈటల యుద్ధానికి సిద్ధమయ్యారు. కాషాయ రథచక్రంలో కూర్చుని.. హుజూరాబాద్ నుంచే శంఖారావం పూరించబోతున్నారట. ఆ రథ చక్రానికి సారధి తరుణ్ ఛుగ్ అట..

Etela Rajender Joining BJP: కమలం పార్టీ  చెంతకు ఈటల.. సోమవారం బీజేపీలో చేరిక!
Etela Rajender Joining In Bjp
Follow us
Balaraju Goud

|

Updated on: Jun 12, 2021 | 10:09 AM

Ex Minister Etela Rajender for Joining In BJP: ఈటల యుద్ధానికి సిద్ధమయ్యారు. కాషాయ రథచక్రంలో కూర్చుని.. హుజూరాబాద్ నుంచే శంఖారావం పూరించబోతున్నారట. ఆ రథ చక్రానికి సారధి తరుణ్ ఛుగ్ అట.. ఈటల ఇంట కుదురిన ఒప్పందం.. భారతీయ జనతా పార్టీలో చేరేందుకు ఈటల చేరేందుకు లైన్ క్లియర్ అయిన్నట్లు కనిపిస్తోంది.

ఈటల రాజీనామా ఎపిసోడ్ బాగానే రక్తి కట్టింది..మలుపులు తిరిగింది…మెరుపులు మెరిపించింది..చివరకు అనుకున్నట్టే.. ఆహ్వానిచ్చినట్టే.. ముందుస్తుగా కుదిరినట్టే.. కాషాయం కండువాను కప్పుకోబోతున్నారు. అవిధంగా వారిమధ్య తాంబూలాలు ఇచ్చిపుచ్చుకోవడాలు అయిపోయాయట. పదిరోజులుగా కుదరని ఈటల-బీజేపీ సంబంధం…వన్ సిట్టింగ్‌లో ఎలా కుదిరిందనేగా డౌటు. ఎక్కడ కూర్చుంటే.. ఒప్పందాలు ఓపికగా వింటారో.. ఎక్కడ మాట్లాడితే సానుకూల స్పందన వస్తుందో.. ఎక్కడ చర్చిస్తే ఆత్మారాముడు ఇగోలకు పోడో.. ఎక్కడ తెలుగోడి సంప్రదాయం షడ్రచులతో ఆహ్వానిస్తుందో.. అక్కడే ముహుర్తం చూసుకుని కూర్చున్నారు. కుదుర్చుకున్నారు. ఆ టైమే భోజనాల టైము. ఆ టైమ్‌లో.. బంధాలు బలపడతాయి.. బాంధవ్యాలు చక్కబడతాయి…చర్చలూ చిక్కపడతాయి…అదే పనిచేసింది ఈటల-బీజేపీ అండ్‌కో.

ఈటల ఇంటికి బీజేపీ రాష్ట్ర ఇన్‌చార్జి తరుణ్ ఛుగ్, డీకే అరుణ విజయశాంతి, విజయశాంతి, రాజాసింగ్‌, రఘునందన్‌రావు ఇలా బీజేపీ బంధుగణమంతా వెళ్లింది. లంచ్‌ మీటింగ్‌ పెట్టుకున్నారు. బండి సంజయ్‌ రావాల్సి ఉన్నా గన్‌మెన్‌కు కరోనా పాజిటివ్‌ రావడంతో ఆయన క్వారంటైన్‌లో ఉన్నారట. అయితేనేం అయన లేని లోటును తరుణ్‌ సాబ్ తీర్చేశారనుకోండి…

బీజేపీ బంధుగణమంతా ఈటల ఇంటికి చేరగానే పొలిటికల్ ఎపిసోడ్ చూడాలి.. అనుచరగణమంతా.. జిందాబాద్ అని అరవడాలు…ఇంటికి వచ్చిన బీజేపీ అతిథులను సాదరంగా ఈటల ఆహ్వానిచండాలు.. తర్వాత ఒకర్నొకరు ఆప్యాయంగా హత్తుకోవడాలు.. ఆ ఆప్యాయతలు.. ఆ ఆనురాగాలు..చూసేందుకు రెండు కళ్లూ సరిపోలేదంటే నమ్మండి…

ఏమైనా బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్.. బాగానే వర్కవుట్ అవుతోంది. ఈటలను తమవైపు తిప్పుకోవడంలోనూ..అది కూడా పెద్దగా కండీషన్స్‌ గట్రా లేకుండా చేర్చుకోవడంలో సఫలమైంది. ఈటలతోనే ఈ ఆపరేషన్ ఆగదట.. ఇంకా చాలామంది నేతలను తమలో కలిపేసుకునేందుకు పావులు కదుపుతోంది. గల్లీ లీడర్‌నుంచి ఎవరైనా.. సరే పార్టీలోకి రావొచ్చు అంటూ తలుపులు బార్లా తెరిచింది.

అయితే, పార్టీలో చేర్చినంత ఈజీకాదుగా..ఎన్నికల్లో గెలవడం. ఇప్పుడు ఈటల రాజీనామాతో త్వరలోనే ఉపఎన్నిక గండం ముంచుకువస్తుంది. అవతల కేసీఆర్‌.. ఓ కొండ.. ఇవతల ఈటల.. కొండ కాకపోయినా.. బీజేపీ అండతో ఢికొట్టబోతున్నారు. బీజేపీ దుబ్బాక, గ్రేటర్‌లో మెరుపులు తప్ప.. ఆ ఊపును కంటిన్యూ చేయలేకపోతోంది. ఇప్పుడు ఈటలను గెలిపించి…ముందుంది..ముసళ్ల పండగ అన్న హెచ్చరికలు ప్రత్యర్ధులకు పంపాలని చూస్తోంది. అందుకే ఆ దిశగా బీజేపీ అగ్రనాయకత్వం ఈటల ఇంటికి వెళ్లింది. తాంబూళాలు పుచ్చుకుని.. సంబంధం కుదుర్చుకుంది.

ఇటు, కేసీఆర్ కూడా హుజురాబాద్‌లో గులాబీ దళాన్ని బాగానే మోహరించారు. ఇప్పటికే ట్రబుల్ షూటర్ హరీష్‌ అదే పనిలో బిజీగా ఉన్నారు.ఏమాత్రం చాన్స్ తీసుకోవద్దని…తెలంగాణలో మరో పార్టీకి స్పేస్ ఇచ్చేంత గ్యాప్‌ లేదని చెప్పడానికి ఈ ఎన్నికతో ప్రత్యర్ధులకు తెలిసేలా చేయాలని గులాబీ బాస్ భావిస్తున్నారట. ఇది ఓరకంగా అధికారపార్టీకి గెలిస్తే వరం.. ఓడితే శాపం. ముఖ్యంగా ఈటల గెలిస్తే.. తన నిర్ణయం తప్పు అని చెప్పడానికి..ఈటలపై సానుభూతి పెరగడానికి కారణమవుతుంది. అది ఫ్యూచర్ పాలిటిక్స్‌నూ డిసైడ్ చేస్తోంది. బీజేపీ మరింత గుదిబండై కూర్చుంటుంది. అందుకే కేసీఆర్ టీమ్ ఈ ఎన్నికను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇక ఈటల బీజేపీ సంబంధంపై సలసల కాగిపోతున్న కాంగ్రెస్ అసలా కమలానికి కరీంనగర్‌లో అంత సీన్‌లేదంటోంది.

ఇలా ఈటల-బీజేపీ కాపురం కారాలు మిరియాలు నూరుతున్నారు ప్రత్యర్ధులు. మరి చూడాలి..హుజురాబాద్‌లో ఎవరి పాచిక పారుతుందో…

Read Also…. Brahmamgari Matam: ముదిరిన బ్రహ్మంగారి మఠాధిపతి వివాదం.. మఠంలో అలజడికి ప్రయత్నం.. మారుతీలక్ష్మమ్మ సంచలన ఆరోపణలు!