Dengue Fever: భాగ్యనగరాన్ని వణికిస్తున్న సీజనల్ వ్యాధులు..మూడురోజులుగా 65 డెంగీ అనుమానిత కేసులు

Dengue Fever: ఓ వైపు కరోనా ప్రభావం ఇంకా తగ్గలేదు.. మరోవైపు భాగ్యనగరంపై సీజనల్ వ్యాధులు పంజా విసురుతున్నాయి. తాజాగా హైదరాబాద్ లో డెంగీ కేసులు..

Dengue Fever: భాగ్యనగరాన్ని వణికిస్తున్న సీజనల్ వ్యాధులు..మూడురోజులుగా  65 డెంగీ అనుమానిత కేసులు
Dengue Fever
Follow us

| Edited By: Surya Kala

Updated on: Jul 11, 2021 | 5:45 PM

Dengue Fever: ఓ వైపు కరోనా ప్రభావం ఇంకా తగ్గలేదు.. మరోవైపు భాగ్యనగరంపై సీజనల్ వ్యాధులు పంజా విసురుతున్నాయి. తాజాగా హైదరాబాద్ లో డెంగీ కేసులు నమోదవుతున్నాయని వైద్యులు చెప్పారు. వాతావరంలో మార్పులు.. వర్షాల కారణంగా సీజనల్ వ్యాధ్యులు విజృభిస్తున్నాయని.. ప్రజలు తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. తాజాగా నగరంలో 65 డెంగీ అనుమానిత కేసులు నమోదయ్యాయని.. వాటిల్లో తొమ్మిదిమందికి పాజిటివ్ వచ్చినట్లు తెలిపారు.

ఓ వైపు త్వరకి థర్డ్ వేవ్ రానున్నదని.. పిల్లలపై ప్రభావం చూపిస్తుందని.. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఇప్పటికే వైద్య సిబ్బంది హెచ్చరికలుజారీ చేయగా… మరో వైపు డెంగ్యూ కేసులు రోజు రోజుకీ పెరగడంతో నగర వాసులు భయబ్రాంతులకు గురవుతున్నారు.

సీజనల్ వ్యాధులు మరింత విస్తరించకముందే జీహెచ్‌ఎంసీ అధికారులు వ్యాధులు నివారణ చర్యలు చేపట్టాలని, రెండు నెలల్లో డెంగీ కేసులు మరిన్ని పెరిగే చాన్స్ ఉందని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. గత నాలుగేళ్లుగా డెంగీ కేసులు పరిశీలిస్తే 2017 సంవత్సరంలో 410 మందికి, 2018లో 263 మందికి సో కగా, 2019లో 1406 మంది, 2020లో 100లోపు నమోదయ్యయాని గణాంకాలు ద్వారా తెలుస్తోంది.

దగ్గు, జలుబు, జ్వరం లక్షణాలుంటే వెంటనే సమీపంలో ఉన్న ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లడంతో స్టిట్ టెస్టులు చేసుకోవాలని కోరారు. ప్రభుత్వ ఆస్పత్రులైన ఉస్మానియా, గాంధీ, టిమ్స్ ఆసుపత్రుల్లో డెంగు నిర్థ్దారణ పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తున్నారు. లక్షణాలు కనిపించిన వారికి ప్రభుత్వాస్పత్రుల్లో ఎలిజా టెస్టులు చేస్తారని చెప్పారు. డెంగీను గుర్తించాలంటే ఖరీదైన యంత్ర పరికరాలు వియోగిస్తారని చెప్పారు.

గత 15 రోజుల నుంచి సీజనల్ వ్యాధులు పెరగడంతో భారీ సంఖ్యలో నగరవాసులు బస్తీ దవఖానాలు, పట్టణ ఆరోగ్య కేంద్రాలను ఆశ్రయిస్తున్నారు. వారిలో ఎక్కువగా డెంగీ అనుమానితులు ఉన్నారని.. టెస్టుల కోసం పరికరాలు, వైద్యసిబ్బందిని అందుబాటులో ఉంచాలని నగర వాసులు కోరుతున్నారు.

Also Read: గత 10 ఏళ్ల నుంచి రోడ్డుమీద గుంతలను పూడుస్తున్న వృద్ధ జంట.. కారు గిఫ్ట్ ఇచ్చిన అమితాబ్