Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SC ST Atrocities: ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో 82% బాధితులు మైనర్లే.. బడుగు వర్గాలకు రక్షణేది?

బడుగు బలహీన వర్గాల క్షేమం ప్రశ్నార్ధకంగా మారింది. ఎస్సీ, ఎస్టీల కోసం 1989లో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్టును తీసుకొచ్చినా వీరిపై జరుగుతున్న అగాయిత్యాలకు మాత్రం అడ్డుకట్ట పడటం లేదు. కులం పేరుతో దూషించిన ఏదైనా కారణాలతో వీరిపై అఘాయిత్యాలకు పాల్పడిన కఠినమైనటువంటి శిక్షలతో పాటు జీవిత ఖైదీ కూడా అమలయ్యేలా ఈ చట్టం తీసుకొచ్చారు. అయితే ఈ మధ్యకాలంలో వీరిపై విపరీతంగా దాడులు జరుగుతున్నాయి..

SC ST Atrocities: ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో 82% బాధితులు మైనర్లే.. బడుగు వర్గాలకు రక్షణేది?
SC ST Atrocities
Follow us
Peddaprolu Jyothi

| Edited By: Srilakshmi C

Updated on: Feb 08, 2025 | 3:11 PM

హైదరాబాద్, ఫిబ్రవరి 8: బడుగు బలహీన వర్గాల క్షేమం కోసం ఎన్నో చట్టాలను మనదేశంలో తీసుకుని వచ్చారు. ఎస్సీ, ఎస్టీల కోసం 1989వ సంవత్సరంలో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్టును తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ చట్టంలో కులం పేరుతో దూషించిన ఏదైనా కారణాలతో వీరిపై అఘాయిత్యాలకు పాల్పడిన కఠినమైనటువంటి శిక్షలతో పాటుగా ఆ కేసు తీవ్రతను బట్టి జీవిత ఖైదీ కూడా అమలయ్యేలా ఈ చట్టంలో ఉంది. అయితే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు ఈ మధ్యకాలంలో విపరీతంగా పెరిగిపోతున్నాయి. 2023 లో 1877 కేసులు నమోదు కాగా 2024 లో 2257 కేసులు నమోదయ్యాయి.

ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులలో 82% మైనర్లు బాధితులుగా ఉండగా వారిపై జరిగినటువంటి వివిధ కేసులలో 20 మందికి జీవిత ఖైదు న్యాయస్థానం. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ జీరో డాలర్ ఇన్స్ విధానంలో రాష్ట్ర పోలీస్ శాఖ కట్టుబడి ఉందని వారిపై జ్ఞా నమోదు అయినటువంటి కేసులతోపాటు వివిధ పోలీస్ స్టేషన్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. గౌరవం సామాజిక న్యాయాన్ని నిలబట్టే దళిత సమాజాన్ని రూపొందించడానికి అన్ని రకాలుగా పోలీస్ అధికారులు కృషి చేస్తున్నారని తెలుపుతున్నారు. అయితే వారి మీద నమోదు చేసినటువంటి కేసుల్లో బాధితులకు ఇచ్చినటువంటి కంపాన్సేషన్ విషయంలో ఎక్కడ రాసి లేదని తెలిపారు. ఈ విధంగా 766 కేసులలో మూడు కోట్ల 50 లక్షల రూపాయల పరిహారం బాధితులకు అందజేశామని పోలీస్ అధికారులు తెలుపుతున్నారు.

మరోవైపు కిడ్నాప్, అపహరణ కేసుల విషయంలో 18 సంవత్సరాలు నిండినటువంటివాళ్లు ఎక్కువగా ఉన్నట్లు రికార్డులు చెప్తున్నాయి. ఇప్పటివరకు 1525 కేసులు నమోదు కాగా 1251 మంది 18 ఏళ్ల లోపు వయసు ఉన్నటువంటి వారే అపహరణకు ఎక్కువగా గురైనట్లు తెలుస్తోంది. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని గౌరవించి దళిత సామాజిక వర్గాన్ని కించపరిచేల వ్యవహరించేటటువంటి వారిపై ఎన్ని చర్యలు తీసుకున్న మళ్లీ ఘటనలు పునరావృతం అవుతూ ఉండడంతో వాళ్లని కఠినంగా శిక్షించాలని ఎస్సీ ఎస్టీ సంఘం డిమాండ్ చేస్తోంది. ముఖ్యంగా మైనర్లపై జరిగేటటువంటి కిడ్నాప్ లకి సంబంధించినటువంటి కేసులలో కఠిన శిక్షలు విధించాలని కోరుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.