Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Drunk Driving: ఇకపై చుక్కేసి రోడ్డెక్కితే పులుసు కారిపోద్ది.. జరిమానాలే కాదు అంతకుమించి!

పూటుగా మందేసి నిర్లక్ష్యంగా వాహనాలు నడిపే మందుబాబులకు పోలీసులు సీరియస్‌ వార్నింగ్‌ ఇస్తున్నారు. తాజాగా మద్యం సేవించి వాహనం నడిపిన పలువురిని నిజామాబాద్ ట్రాఫిక్ పోలీసుల కోర్టు ముందు హాజరు పరిచగా వీరిలో ఆరుగురికి రెండు రోజులపాటు జైలు శిక్ష, మరో 11మందికి ఒక్కొక్కరికి రూ.15,500 చొప్పున జరిమానా విధించింది..

Drunk Driving: ఇకపై చుక్కేసి రోడ్డెక్కితే పులుసు కారిపోద్ది.. జరిమానాలే కాదు అంతకుమించి!
Drunk Driving
Follow us
Lakshmi Praneetha Perugu

| Edited By: Srilakshmi C

Updated on: Feb 08, 2025 | 3:28 PM

హైదరాబాద్, ఫిబ్రవరి 8: తెలంగాణ రాష్ట్రంలో మద్యం సేవించి వాహనం నడుపుతున్న వాహనదారులకు కోర్టులు జరిమానాలతో పాటు జైలు శిక్షను సైతం విధిస్తున్నాయి. ఇటీవల కాలంలో మద్యం సేవించి వాహనం నడిపిన పలువురిని నిజామాబాద్ ట్రాఫిక్ పోలీసులు కోర్టు ముందు హాజరు పరిచారు. వీరిలో 17 మంది మందుబాబులు ఉండగా, ఆరుగురు మందుబాబులకు రెండు రోజులపాటు జైలు శిక్ష విధించింది. మరో 11మందికి ఒక్కొక్కరికి రూ.15,500 జరిమానా విధించింది. ఏడుగురికి విధించిన జైలు శిక్షలో ఖానాపూర్‌కు చెందిన సంతోష్, షేక్ ఉన్నారు. మిట్టపల్లి నుంచి అనిల్, డిచ్పల్లి నుంచి మరో ముగ్గురికి జైలు శిక్ష విధించింది. మద్యం సేవించి ఎవరు కూడా వాహనం నడపవద్దని ట్రాఫిక్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. మద్యం తాగి వాహనం నడపటంతో వారి జీవితాలతో కాకుండా ఇతరుల జీవితాలను సైతం చిదిమేస్తుందంటూ హెచ్చరించారు.

అయితే మద్యం తాగి వాహనం నడిపిన వారిని పోలీసులు నేరుగా అరెస్టు చేయరు. డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తున్న క్రమంలో వారికి పరీక్షలు నిర్వహిస్తారు. పరీక్షలు సమయంలో BAC మోతాదు శాతాన్ని బట్టి వారికి శిక్షలు ఖరారు అవుతాయని ట్రాఫిక్ పోలీసులు చెబుతున్నారు. 35 శాతానికి మించి మోతాదు శాతం చూస్తే ఫైన్ లేదా జైలు శిక్ష పడుతుందంటూ పోలీసులు హెచ్చరిస్తున్నారు. రెండు బీర్లు తాగితే 60 శాతం నమోదయ్యే అవకాశం ఉందని నిజామాబాద్ ట్రాఫిక్ పోలీసులు చెబుతున్నారు.

కొన్ని సందర్భాల్లో మోతాదుకు నుంచి మద్యం తాగి వాహనం నడిపి ప్రమాదాలకు కారణం అయినవారిపై మర్డర్ కేసు కూడా నమోదు అయ్యే అవకాశం ఉంది. డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి ఆక్సిడెంట్ జరిగిన సందర్భాల్లో ప్రాణాలు కోల్పోతే తాగి వాహనం నడిపిన డ్రైవర్ పై అటెంప్ట్ టూ మర్డర్ కేసును పోలీసులు నమోదు చేస్తున్నారు. ఇలాంటి సందర్భాల్లో వారి డ్రైవింగ్ లైసెన్సులను సైతం సస్పెండ్ చేయాలని ట్రాఫిక్ పోలీసులు ఆర్టీఏ అధికారులకు సూచిస్తున్నారు. ఇలా ప్రతి ఏటా వందల మంది మద్యం బాబుల డ్రైవింగ్ లైసెన్స్‌లు సస్పెండ్ అయినట్లు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.