దైవ దర్శనకోసం వెళ్తే దారుణం.. ఆ రోజు రాత్రి ఏం జరిగిందంటే.. సంచలన విషయాలు..
రాత్రి 10.30 సమయంలో కాలకృత్యాల కోసం ఆలయానికి ముందు ఉన్న గుట్టల సమీపంలోకి మహిళ వెళ్ళింది. ఆమెకు తోడుగా బంధువు సైతం వెళ్ళాడు. అయితే ఈ ఇద్దరినీ ఒంటరి జంటగా గమనించిన నలుగురు యువకులు.. వారిని బెదిరించి ఇంకొంత దూరం నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లారు.

తెలంగాణ రాష్ట్రంలో తీవ్ర కలకలం రేపిన ఊర్కొండపేట గ్యాంగ్ రేప్ ఘటన కేసును పోలీసులు చేధించారు. ఏడుగురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. నాగర్ కర్నూల్ జిల్లా ఊర్కొండపేట ఆంజనేయస్వామి ఆలయానికి మొక్కులు చెల్లించుకునేందుకు వచ్చిన మహిళపై యువకుల సామూహిక అత్యాచారం ఘటన తెలంగాణలో తీవ్ర కలకలం రేపింది. గత శనివారం ఆంజనేయ స్వామివారికి మొక్కులు చెల్లించుకునేందుకు ఓ వివాహిత తల్లిదండ్రులు, పిల్లలతో కలిసి ఆలయానికి వచ్చారు. ఆ రోజు రాత్రి ఆలయ ప్రాంగణంలో నిద్ర చేయాలని భావించారు. అయితే సదరు వివాహిత తెలిసిన బంధువును ఆలయానికి రమ్మని పిలిచింది. ఇద్దరు ఆలయానికి కొంత దూరంలో మాట్లాడుకుంటున్నారు. రాత్రి 10.30 సమయంలో కాలకృత్యాల కోసం ఆలయానికి ముందు ఉన్న గుట్టల సమీపంలోకి మహిళ వెళ్ళింది. ఆమెకు తోడుగా బంధువు సైతం వెళ్ళాడు. అయితే ఈ ఇద్దరినీ ఒంటరి జంటగా గమనించిన నలుగురు యువకులు.. వారిని బెదిరించి ఇంకొంత దూరం నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లారు. ఈ నలుగురు మరో ముగ్గురు మిత్రులను అక్కడికి పిలిచారు. అనంతరం వివాహితతో వచ్చిన బంధువును అక్కడే కట్టేసి… ఆమెను బెదిరించి వరుసగా ఏడుగురు నిందితులు ఒకరి తర్వాత ఒకరు అత్యంత పాశవికంగా గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారు. నిందితుల్లో ఒకరైన కార్తీక్ అనే వ్యక్తి బాధిత మహిళ పై మూత్ర విసర్జన చేశాడు. అనంతరం నగ్నంగా ఫోటోలు, వీడియోలు తీసి పోలీసులకు చెప్తే చంపేస్తామని బెదిరించారు. తెల్లవారు జామున ఇద్దరి దగ్గర ఉన్న బంగారం, నగదును దోచుకొని అక్కడి నుంచి పంపించారు.
ఆలస్యంగా వెలుగులోకి ఘటన:
అయితే గ్యాంగ్ రేప్ అంశం బయట తెలిస్తే పరువు పోతుందన్న భావనలో పోలీసులకు ఫిర్యాదు చేయలేదు బాధితురాలు. నగలు, నగదు దోచుకున్నారని మాత్రమే సోమవారం ఉదయం ఫిర్యాదు చేశారు. అయితే ఆ ఫిర్యాదు దర్యాప్తులో ఈ కిరాతక ఘటన వెలుగులోకి వచ్చింది. అదే రోజు ఏడుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని రహస్య ప్రాంతంలో విచారించారు. చేసిన నేరాన్ని ఒప్పుకోవడంతో పోలీసులు టెక్నికల్, మెడికల్ ఆధారాలను సేకరించారు. బాధితురాలు, ఆమె బంధువు స్టేట్మెంట్ రికార్డు చేశారు. నాగర్ కర్నూల్ జిల్లా ఎస్పీ వైభవ్ గైక్వాడ్ కేసును సీరియస్ గా తీసుకొని స్వయంగా పర్యవేక్షించారు.
గ్యాంగ్ రేప్ కు పాల్పడిన మార్పకుల ఆంజనేయులు, సాదిక్ బాబా, వాగుల్దాస్ మణికంఠ, కార్తీక్, మట్టా మహేష్ గౌడ్, హరీష్ గౌడ్, మట్టా ఆంజనేయులు గౌడ్ లను అరెస్టు చేసినట్లు ఎస్పీ వైభవ్ గైక్వాడ్ తెలిపారు. నిందితులను త్వరలోనే పోలీసు కస్టడీకి తీసుకొని ఇంకా లోతుగా దర్యాప్తు చేస్తామని తెలిపారు. బాధితులకు న్యాయం చేసేందుకు ఫాస్ట్ ట్రాక్ విచారణను కోరుతమని చెప్పారు. ఇక బాధిత మహిళలకు ప్రభుత్వం తరపున పరిహారం, ఔట్ సోర్సింగ్ ఉద్యోగం ఇప్పించేందుకు ప్రయత్నం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ గ్యాంగ్ గతంలో దోపిడీ నేరాలకు పాల్పడినట్లు సమాచారం ఉందన్నారు. అయితే ఇంకో గ్యాంగ్ ఉన్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో దానిపైన విచారణ చేస్తున్నామన్నారు. ఇలాంటి ఘటనలు ఎక్కడ జరగకుండా జాగ్రతలు తీసుకుంటామని ఎస్పీ వైభవ్ గైక్వాడ్ వెల్లడించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..