Telangana: గురుకుల పాఠశాలలో కరోనా కలకలం.. 42 మంది విద్యార్థినులకు పాజిటివ్..
Muthangi Gurukulam School: కరోనావైరస్ సెకండ్ వేవ్ అనంతరం పాఠశాలలు తెరుచుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో కరోనా విద్యార్థులను వెంటాడుతోంది. తెలంగాణలోని పలు ప్రాంతాల్లో
Muthangi Gurukulam School: కరోనావైరస్ సెకండ్ వేవ్ అనంతరం పాఠశాలలు తెరుచుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో కరోనా విద్యార్థులను వెంటాడుతోంది. తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఉన్న పాఠశాలల్లోని విద్యార్థులు ఇప్పటికే కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సంగారెడ్డి జిల్లా పటాన్‌చెర్వు మండలం ముత్తంగిలో కరోనా కలకలం రేపింది. ముత్తంగి గురుకుల పాఠశాలలోని 42 మంది విద్యార్థులు, ఉపాధ్యాయురాలు తాజాగా కరోనా బారినపడ్డారు. గురుకుల పాఠశాలలో 491 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తుండగా, 27 మంది సిబ్బంది ఉన్నారు. నిన్న 261 మంది విద్యార్థులు, 27 మంది సిబ్బందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. మొత్తం 43 మందికి కరోనా నిర్ధారణ అయినట్లు అధికారులు తెలిపారు. మిగతా విద్యార్థులకు ఈ రోజు కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
కాగా.. పాజిటివ్ వచ్చిన విద్యార్థులు, ఉపాధ్యాయురాలి నమూనాలను జీనోమ్ స్వీక్వెన్సింగ్‌కు పంపినట్లు వైద్యాధికారులు తెలిపారు. అయితే.. కరోనా సోకిన విద్యార్థులను వసతి గృహంలోనే క్వారంటైన్‌లో ఉంచి వైద్యసేవలు అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. మూడు రోజుల క్రితం ఓ విద్యార్థిని అస్వస్థతకు గురి కావడంతో వైద్య పరీక్షలు నిర్వహించారు. కాగా.. కరోనా సోకిన విద్యార్థుల పరిస్థితి బాగానే ఉందని అధికారులు తెలిపారు. అయితే.. ముత్తంగి గురుకుల పాఠశాలలో పలువురు విద్యార్థులకు కరోనా సోకడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.
Also Read: