AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అయ్యో పాపం.. పుట్టిన రోజు తెల్లారే అనంత లోకాలకు చిన్నారి నితిన్.. బిస్కెట్స్‌ కోసం వెళితే..

బాలుడిని వెంటనే నర్సాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తీవ్ర గాయాలు కావడంతో చికిత్స పొందుతూ మృతి చెందాడు చిన్నారి నితిన్. జేరుపుల ఓభ్య, లావణ్య కు ఇద్దరు కూతుర్లు ఇద్దరు కుమారుల్లో చిన్న కుమారుడు నితిన్ అంగన్వాడి స్కూల్ కి వెళ్లేవాడు. ఆడుతూ పాడుతూ తల్లిదండ్రులను సంతోషపరిచే నితిన్ ఉండేవాడు.

అయ్యో పాపం.. పుట్టిన రోజు తెల్లారే అనంత లోకాలకు చిన్నారి నితిన్.. బిస్కెట్స్‌ కోసం వెళితే..
4 Year Old Dies
P Shivteja
| Edited By: |

Updated on: Jul 18, 2025 | 9:40 PM

Share

మెదక్ జిల్లా శివ్వంపేట మండలంలో విషాద సంఘటన చోటు చేసుకుంది.  రూప్ల తండాలో నాలుగేళ్ల చిన్నారి మృతి అందరినీ కలచి వేసింది.  ( 4) సంవత్సరాల జేరుపుల నితిన్ ను ఇంటి నుంచి ఆడుకుంటూ షాప్ కు వెళ్లి బిస్కెట్స్ తెచ్చుకుందామని వెళ్లి వస్తుండగా వీధి కుక్కల గుంపు దాడి చేసింది. నితిన్ ను చుట్టుముట్టిన వీధి కుక్కలు బాలుడిని చెట్ల పొదల్లోకి తీసుకెళ్లి తింటూ ఉండగా తండాకు చెందిన శారదా, బుజ్జి, చూసి కేకలు పెట్టారు. గ్రామస్తుల అరుపులు, కేకలతో వీధి కుక్కలను కొట్టడంతో అక్కడి నుండి వెళ్లిపోయాయి.

ఏడుస్తూ కేకలు పెట్టడంతో చుట్టుపక్కల వారు తల్లి లావణ్య వచ్చి వెంటనే తీవ్ర గాయాలతో ఉన్న బాలుడిని వెంటనే నర్సాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తీవ్ర గాయాలు కావడంతో చికిత్స పొందుతూ మృతి చెందాడు బాలుడు  జేరుపుల ఓభ్య, లావణ్య కు ఇద్దరు కూతుర్లు ఇద్దరు కుమారుల్లో చిన్న కుమారుడు నితిన్ అంగన్వాడి స్కూల్ కి వెళ్లేవాడు. ఆడుతూ పాడుతూ తల్లిదండ్రులను సంతోషపరిచే నితిన్ ఉండేవాడు.

తల్లి లావణ్య ఇంటి దగ్గరనే ఉంది ఆడుకుంటున్నాడు అనుకొని అనుకుంది సాయంత్రం ఐదు గంటల సమయంలో కుక్కలు దాడి చేశాయి. తీవ్ర గాయాలయాయని తండావాసులు తెలపడంతో బోరును ఏడ్చుకుంటూ పరుగులు తీస్తూ ఘటన స్థలానికి వెళ్లి చూసేసరికి వీధి కుక్కలు శరీరం మొత్తం ముఖ్యంగా తలపై తీవ్రంగా దాడి చేసి గాయపరిచాయి. అది చూసిన తల్లి బోరున విలపిస్తూ నిన్ననే ఘనంగా బర్త్డే సంబరాలు జరిపాను కొడుకా నీకు అని ఏడుస్తుండడంతో చుట్టుపక్కల వారు కూడా బోరున విలపించారు. వీధి కుక్కలు విపరీతంగా సంచరిస్తూ మనుషులపై దాడులకు దిగుతున్నాయని, వీధి కుక్కల సమస్యను పరిష్కరించాలని తండావాసులు కోరుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..