Adulterated Toddy: కల్తీ కల్లు సేవనం – గంజాయి, డ్రగ్స్‌కు మించిన వ్యసనం!
అనుకుంటాం గానీ.. డ్రగ్స్, గంజాయి, ఇతర మత్తుపదార్ధాలే ప్రమాదకరమని. కల్తీ కల్లు కూడా అంతే ప్రమాదకారి. కొకైన్, గాంజాపై ఉక్కుపాదం మోపుతున్నారు అధికారులు. తెలంగాణలో డ్రగ్స్ ఉనికే ఉండకూడదని. మరి.. ఆల్ఫాజోలం, డైజోఫామ్, క్లోరోహైడ్రేడ్‌పై కనిపిస్తోందా అంతటి సీరియస్‌నెస్. ఎస్.. వాటిపైనా నిఘా పెడుతున్నాం అని చెప్పడమే నిజమైతే... కల్తీ కల్లు బాధితులు ఇంత మంది వస్తారా? మతి తప్పి ఎర్రగడ్డ, గాంధీ ఆస్పత్రులకు క్యూ కడతారా? మత్తుపదార్ధాలతో కల్లు చేస్తున్నారనడానికి సాక్ష్యాలు కావా అవి?

కరోనా టైమ్‌లో ఓ ఇన్సిడెంట్ జరిగింది. అత్యవసర విభాగాలు మాత్రమే తెరిచి ఉన్న ఆ టైమ్‌లో.. వైన్ షాపులకు అనుమతిచ్చారు. రోజూ మందు తాగే అలవాటు ఉన్నవాళ్లు సడెన్‌గా మానేస్తే… క్రమంగా న్యూరోలాజికల్ సమస్యలు వస్తాయనేమో. ప్రభుత్వాలకు ఆదాయం లేకపోవడం కూడా ఒక కారణమై ఉండొచ్చు. కాని, ఒక్కసారిగా మద్యం తాగడాన్ని ఆపేస్తే.. అలవాటైన ప్రాణాలు అల్లాడిపోతాయి. కాని, ఒక్క విషయంలో మెచ్చుకోవాలి. ఆనాడు లాక్‌డౌన్‌లో 40 రోజుల పాటు మద్యం షాపులను మూసేశారు. బట్.. మతి తప్పి ప్రవర్తించిన వాళ్లు పెద్దగా లేరు. చనిపోయిన దాఖలాలు కూడా లేవు. ఇదంతా ఎందుకు చెప్పుకోవాల్సి వస్తోందంటే… కల్లు కాంపౌండ్లు ఓ మూడు నాలుగు రోజులు మూసేస్తే అల్లకల్లోలం జరుగుతోంది తెలంగాణలో. జస్ట్ అప్పుడప్పుడు కల్లు తాగుతున్న వాళ్లు కావొచ్చు, రెగ్యులర్‌గా కల్లు తాగుతున్న వాళ్లు కావొచ్చు రెండుమూడ్రోజులు తాగకపోయినా ఆగగలరు. ఆగగలగాలి కూడా. కాని, అలా జరగడం లేదంటే ఏంటి అర్థం? అందులో కలవకూడనిదేదో కలుస్తోంది. కలపకూడనిదేదే కలుపుతున్నారని. కల్తీ కల్లు తాగినందుకు 11 మంది చనిపోయారంటే కచ్చితంగా సీరియస్ మ్యాటరే. ఇక్కడ మృతుల సంఖ్యను మాత్రమే లెక్కలోకి తీసుకోకూడదు. కల్తీ కల్లు దొరక్క అల్లాడిపోతున్న బాధితుల సంఖ్యను కూడా పరిగణలోకి తీసుకోవాలి. వీళ్లకి మామూలు కల్లు దొరక్క కాదు. కల్తీ కల్లు దొరక్క, కెమికల్స్ కలపని కల్లు లభించక విలవిలలాడిపోతున్నారు. మామూలు కల్లు తాగించినా ఉండలేనంత పరిస్థితిలో ఉన్నారు ఆ బాధితులు. ఎందుకంటే.....
