AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Skin Care: వర్షాకాలంలో పిల్లలకు స్కిన్ కేరింగ్ టిప్స్.. ఈ 4 నూనెలతో మసాజ్‌ చేస్తే ఆరోగ్యం, అందం..!

వర్షాకాలంలో శిశువు చర్మాన్ని రక్షించడం కూడా చాలా ముఖ్యం. ఎందుకంటే, ఈ సీజన్‌లో చర్మ సమస్యలు కూడా ఎక్కువగా వస్తుంటాయి. చర్మంపై దద్దుర్లు, చర్మ అలెర్జీలు తరచూ వేధిస్తుంటాయి. వాటిని నివారించేందుకు సహజ నూనెలను తప్పనిసరిగా వాడుతూ ఉండాలి. ఎప్పటికప్పుడు శిశువు చర్మానికి తేమ, బాహ్య మెరుపును అందించడం చాలా ముఖ్యమైన విషయం.

Skin Care: వర్షాకాలంలో పిల్లలకు స్కిన్ కేరింగ్ టిప్స్.. ఈ 4 నూనెలతో మసాజ్‌ చేస్తే ఆరోగ్యం, అందం..!
Skin Care
Jyothi Gadda
|

Updated on: Jul 18, 2025 | 6:03 PM

Share

వర్షాకాలం మొదలైంది. వేడి వాతావరణం, అనేక వ్యాధుల నుండి ఉపశమనం కలిగిస్తుంది. కానీ, ఈ సీజన్‌లో ఇన్ఫెక్షన్ ప్రమాదం చాలా పెరుగుతుంది. ఇది మీ పిల్లలను ఎక్కువగా ప్రభావితం చేస్తుంది. వర్షాకాలం జలుబు, దగ్గు వంటి ఫ్లూకు కారణమవుతుంది. ఉష్ణోగ్రతలో వేగవంతమైన మార్పుల కారణంగా బలహీనమైన రోగనిరోధక శక్తి ఉన్నవారు చాలా త్వరగా వ్యాధుల బారిన పడతారు. ఈ సీజన్‌లో పిల్లలు చాలా త్వరగా వ్యాధుల బారిన పడటానికి ఇదే కారణం. రెయినీ సీజన్‌లో ముఖ్యంగా 10 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లల పట్ల మరింత జాగ్రత్తగా ఉండాలని వైద్యులు కూడా సలహా ఇస్తున్నారు. మీ పిల్లల ఆరోగ్యాన్ని ఎలా జాగ్రత్తగా చూసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం..

వర్షాకాలంలో శిశువు చర్మాన్ని రక్షించడం కూడా చాలా ముఖ్యం. ఎందుకంటే, ఈ సీజన్‌లో చర్మ సమస్యలు కూడా ఎక్కువగా వస్తుంటాయి. చర్మంపై దద్దుర్లు, చర్మ అలెర్జీలు తరచూ వేధిస్తుంటాయి. వాటిని నివారించేందుకు సహజ నూనెలను తప్పనిసరిగా వాడుతూ ఉండాలి. ఎప్పటికప్పుడు శిశువు చర్మానికి తేమ, బాహ్య మెరుపును అందించడం చాలా ముఖ్యమైన విషయం. చిన్నారుల్లో ఈ చర్మ సంబంధిత సమస్యలను నివారించేందుకు సరైన నూనెలు, బేబీ మసాజ్ ఆయిల్స్‌ మంచి ఫలితానిస్తాయి. కానీ, శిశువు చర్మం చాలా మృదువుగా ఉంటుంది. మార్కెట్లో లభించే చాలా ఉత్పత్తులు కెమికల్‌ ఆధారితంగా ఉంటాయి. కాబట్టి, మన పిల్లల శరీరంపై ఎలాంటి హాని కలిగించని సరైన వస్తువులను ఎంచుకోవడం తప్పనిసరి.

వర్షాకాలంలో మీ చిన్నారి సున్నితమైన చర్మాన్ని పొడిబారనివ్వకుండా అందమైన ఈ రెయినీ సీజన్‌ను ఎలా సద్వినియోగం చేసుకోవాలో చూద్దాం. వారి సున్నితమైన చర్మాన్ని ప్రశాంతపరిచే, ఉపశమనం కలిగించే, రక్షించే 4 సహజ నూనెలు గురించి ఇక్కడ తెలుసుకుందాం…

ఇవి కూడా చదవండి

కొబ్బరి నూనె – ఇది ఎల్లప్పుడూ శ్రేయస్కరమైనది. చర్మానికి సున్నితత్వాన్ని కలిగిస్తుంది. తేలికైనది, చర్మానికి లోతుగా తేమను అందిస్తుంది. ఎక్కువ సమయంపాటు చర్మాన్ని తాజాగా, తేమతో ఉంచుతుంది.

అశ్వగంధ నూనె – ఆయుర్వేదం అశ్వగంధను శక్తివంతమైన ఔషదంగా పేర్కొంది. అశ్వగంధతో కలిపిన నూనె కండరాలను సడలించడానికి, మంచి నిద్రను ప్రోత్సహించడానికి, చర్మం సహజ స్థితిస్థాపకతకు మద్దతు ఇస్తుంది.

స్వీట్ ఆల్మండ్ ఆయిల్ – విటమిన్ E సమృద్ధిగా ఉన్న బాదం ఆయిల్ చర్మం పొడిబారడం, చికాకును అరికట్టడానికి అనువైనది. ఇది శరీరం సులభంగా గ్రహించబడుతుంది. సున్నితమైన శిశువు చర్మానికి చాలా మేలు చేస్తుంది.

నువ్వుల నూనె – బేబీ కేర్‌లో సాంప్రదాయకంగా అందరూ వాడేది నువ్వుల నూనె. ఇది శరీరానికి వెచ్చదనాన్ని, పోషణను అందిస్తుంది. చర్మానికి రక్షణను అందిస్తుంది. దీని సహజ యాంటీఆక్సిడెంట్ లక్షణాలు చర్మ అవరోధాన్ని బలోపేతం చేయడంలో సహాయపడతాయి.

వర్షాకాలంలో శిశువు చర్మాన్ని పోషకాలతో, తేమతో, రోజంతా మృదువుగా ఉంచడానికి అవసరమైన నాలుగు సూపర్ ఆరోగ్యకరమైన ఈ నూనెలను తప్పనిసరిగా అవసరమైన వారు వాడటం ఉత్తమం అంటున్నారు నిపుణులు.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..