తేనెలో ఉసిరికాయలను నానబెట్టి ఉదయాన్నే తింటే..? శరీరంలో ఏం జరుగుతుందంటే..
ఉసిరికాయ- తేనె ఈ రెండూ ఆయుర్వేదంలో ప్రత్యేకమైన ప్రముఖ్యత కలిగిన సహజసిద్ధమైన పదార్థాలు. ఈ రెండింటినీ కలిపి తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయని ఆయుర్వేద వైద్య నిపుణులు చెబుతున్నారు. ప్రతిరోజూ తేనెలో నానబెట్టిన ఆమ్లా తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఉసిరికాయలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది శరీర రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. తేనెలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. ఈ రెండింటిని కలిపి తీసుకోవడం వల్ల శరీరానికి ఎన్నో రకాలుగా మేలు జరుగుతుంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
