AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: ఇంటి బయట పడుకున్న చిన్నారి.. ఒకేసారి దూసుకొచ్చిన రెండు పాములు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..?

ఒకటి కాదు.. రెండు కాదు.. రెండు విష సర్పాలు ఆ పసి ప్రాణంపై పగబట్టాయి. కన్నవారి కళ్లముందే కాలనాగులై కాటేశాయి. జనగామ జిల్లాలో జరిగిన ఈ అత్యంత విషాదకర ఘటనలో, నిద్రిస్తున్న నాలుగేళ్ల బాలుడిని మృత్యువు పాము రూపంలో కబళించింది. అల్లారుముద్దుగా పెంచుకున్న కొడుకు విగతజీవిగా మారడంతో ఆ తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి.

Telangana: ఇంటి బయట పడుకున్న చిన్నారి.. ఒకేసారి దూసుకొచ్చిన రెండు పాములు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..?
Minor Boy Bitten By Two Snakes
G Peddeesh Kumar
| Edited By: |

Updated on: May 09, 2026 | 10:06 AM

Share

విధి ఆ బాలుడి పట్ల అత్యంత క్రూరంగా మారింది. పగబట్టినట్లుగా రెండు విష సర్పాలు ఒకేసారి ఆ పసి ప్రాణాన్ని కబళించాయి. జనగామ జిల్లా దేవరుప్పుల మండలం లక్ష్మణ్ తండాలో జరిగిన ఈ విచారకర ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. లక్ష్మణ్ తండాకు చెందిన బాలాజీ, కవిత దంపతులకు ఒక కుమారుడు, ఒక కుమార్తె. కుమారుడు శ్రీయాన్‌ (4) అల్లారుముద్దుగా చూసుకుంటున్నారు. శుక్రవారం రాత్రి ఎండ వేడిమి నుంచి ఉపశమనం పొందేందుకు తల్లిదండ్రులతో కలిసి ఆరుబయట నిద్రిస్తున్నాడు. అర్ధరాత్రి రెండు గంటల సమయం.. గాఢనిద్రలో ఉన్న ఆ చిన్నారిని ఒకే సమయంలో ఒక కట్లపాము, ఒక రక్తపింజర కాటేశాయి. పాములు కరవడంతో ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచిన బాలుడు, తల్లిదండ్రులకు విషయం చెప్పాడు.

ఏ పాము కరిచిందో తెలిస్తేనే వైద్యం సులభమవుతుందని భావించిన తండ్రి బాలాజీ, చీకట్లోనే ఆ పాముల కోసం గాలించాడు. ఆ రెండు పాములను వెతికి పట్టుకుని కసితీరా హతమార్చాడు. వెంటనే ఆ పసివాడిని హన్మకొండలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు బాలుడి ప్రాణాలు కాపాడేందుకు తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ, అప్పటికే శరీరం అంతా అప్పటికే విషం పాకడంతో పరిస్థితి విషమించింది. చికిత్స పొందుతూ శుక్రవారం సాయంత్రం శ్రీయాన్ కన్నుమూశాడు.

ముద్దులొలికే కుమారుడు కళ్లముందే విగతజీవిగా పడి ఉండటంతో ఆ తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. “రెండు పాములు పగబట్టి మా బిడ్డను పొట్టనబెట్టుకున్నాయా?” అంటూ వారు గుండెలు పగిలేలా ఏడుస్తుంటే, తండా మొత్తం కన్నీరుమున్నీరైంది. అల్లారుముద్దుగా పెంచుకున్న కొడుకు ఇక లేడన్న నిజాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు.

Follow Us
టపటపా పేలిపోతున్న కార్ సన్‌రూఫ్ అద్దాలు.. కారణం ఇదే !
టపటపా పేలిపోతున్న కార్ సన్‌రూఫ్ అద్దాలు.. కారణం ఇదే !
భూమిలోకి కుంగిపోతున్న నగరాలు.. పెను ప్రమాదం తప్పదా
భూమిలోకి కుంగిపోతున్న నగరాలు.. పెను ప్రమాదం తప్పదా
ఈ నర్స్‌ చేసిన దారుణం తెలిస్తే.. మీరు రగిలిపోతారు
ఈ నర్స్‌ చేసిన దారుణం తెలిస్తే.. మీరు రగిలిపోతారు
లోకో పైలట్ మానవత్వం.. మూగజీవుల రక్షకులు అంటూ నెటిజెన్స్ కామెంట్స్
లోకో పైలట్ మానవత్వం.. మూగజీవుల రక్షకులు అంటూ నెటిజెన్స్ కామెంట్స్
రాక్షసానందం.. స్ట్రాను ఎంగిలి చేసి.. వెండింగ్‌ మెషీన్‌లో పెట్టి.
రాక్షసానందం.. స్ట్రాను ఎంగిలి చేసి.. వెండింగ్‌ మెషీన్‌లో పెట్టి.
ఎంతకు తెగించార్రా.. ఏటీఎంకు తాడుకట్టి బొలెరోతో లాక్కుపోయిన దొంగలు
ఎంతకు తెగించార్రా.. ఏటీఎంకు తాడుకట్టి బొలెరోతో లాక్కుపోయిన దొంగలు
‘సూపర్ ఎల్‌ నినో’ వచ్చేసింది..! వచ్చే రెండున్నరేళ్లూ కరువే
‘సూపర్ ఎల్‌ నినో’ వచ్చేసింది..! వచ్చే రెండున్నరేళ్లూ కరువే
అదిగదిగో లచ్చిందేవి.. డ్రైవర్‌కు కలిసొచ్చిన లక్.. రాత్రికి రాత్రే
అదిగదిగో లచ్చిందేవి.. డ్రైవర్‌కు కలిసొచ్చిన లక్.. రాత్రికి రాత్రే
మొసలికి పోస్టుమార్టం.. కడుపులో ఉన్నది చూసి షాక్‌!
మొసలికి పోస్టుమార్టం.. కడుపులో ఉన్నది చూసి షాక్‌!
ప్రాణాలను కాపాడిన.. రియల్‌ "హీరో'' ఈ ఎలుక !!
ప్రాణాలను కాపాడిన.. రియల్‌