ప్రియాంక అరుళ్ మోహనన్.. ఇప్పుడిప్పుడే దక్షిణాదిలో రాణిస్తున్న హీరోయిన్. తెలుగు, తమిళం, కన్నడ భాషలలో వరుస సినిమాల్లో నటిస్తుంది.
ప్రియాంక.. నవంబర్ 20, 1995న బెంగళూరులో జన్మించింది. ఆమె తండ్రి అరుళ్ మోహన్ తమిళనాడులో వ్యాపారవేత్త.
ప్రియాంక 2019లో కన్నడ సినిమా సంకలనం ఓంధ్ కథే హెల్లాలో అధితి పాత్రలో నటించింది.
అదే ఏడాది న్యాచురల్ స్టార్ నాని సరసన గ్యాంగ్ లీడర్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఈ మూవీతో తెలుగులో మంచి క్రేజ్ సొంతం చేసుకుంది.
ఆ తర్వాత శివకార్తికేయన్ సరసన ఆమె నటించిన తొలి తమిళ సినిమా డాక్టర్ ఆమెకు మరింత గుర్తింపు తెచ్చిపెట్టింది.
డాన్, ఈథర్క్కుం తునింధవన్, శ్రీకరం వంటి చిత్రాల్లో నటించింది. ఇటీవలే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన ఓజీ మూవీతో తెలుగులో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది ఈ ముద్దుగుమ్మ.
ఆతర్వాత తెలుగులో సైలెంట్ అయిపొయింది ఈ అమ్మడు. మొన్నామధ్య తమిళ్ లో ఓ సిరీస్ లో నటించింది.