అర్థరాత్రి ఎంత పనిచేశావ్ సాయి.. ప్రాణాలు మింగేసిన సెల్ ఫోన్..
మహబూబాబాద్‌లో సెల్ ఫోన్ కొనివ్వలేదని 20 ఏళ్ల యువకుడు సాయికుమార్ ఆత్మహత్య చేసుకున్నాడు. పగిలిపోయిన ఫోన్ స్థానంలో కొత్తది కావాలని మద్యం మత్తులో తల్లిదండ్రులతో గొడవపడ్డాడు. కూలి పనులతో జీవనం సాగించే పేరెంట్స్ కొనివ్వలేమని చెప్పగా, మనస్తాపంతో ఉరివేసుకున్నాడు. సెల్ ఫోన్ వ్యసనం ఓ నిండు ప్రాణాన్ని బలిగొన్న విషాద ఘటనపై.. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

తల్లిదండ్రులు సెల్ ఫోన్ కొనివ్వలేదని మనస్తాపంతో ఓ యువకుడు ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మహబూబాబాద్ జిల్లాలో కలకలం రేపింది. తన సెల్ ఫోన్ పగిలిపోవడంతో మద్యం సేవించి తల్లిదండ్రులతో కొత్త ఫోన్ కోసం గొడవ పడ్డాడు.. అయితే.. వారు ప్రస్తుతం సెల్ ఫోన్ కొనిచ్చే పరిస్థితిలేదని చెప్పారు. దీంతో మనస్థాపం చెందిన ఆ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు.. ఈ సంఘటన తొర్రూరు మండలం చింతలపల్లి గ్రామంలో జరిగింది. సాయికుమార్ అనే 20 ఏళ్ల యువకుడు మద్యానికి బానిస అయ్యాడు.. తన సెల్ ఫోన్ కిందపడి పగిలిపోవడంతో కొత్త ఫోన్ కొనివ్వాలని తల్లిదండ్రులతో గొడవపడ్డాడు..తల్లిదండ్రులు కూలి పనులు ద్వారా కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. ప్రస్తుతం సెల్ ఫోన్ కొనిచ్చే పరిస్థితిలేదని అతన్ని మందలించారు.. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన సాయి కుమార్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
ఇంట్లో అంతా నిద్రిస్తున్న సమయంలో ఇంట్లోనే ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అర్థరాత్రి చీరతో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.. సెల్ ఫోన్ అతని ఆయువు మింగేయడంతో కన్నవారు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి వివరాలను సేకరించారు. డెడ్ బాడీని పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
