AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs SL: ఈ నలుగురు వాటర్ బాటిల్స్ మోసేందుకే ఫిక్స్.. ఒక్క మ్యాచ్‌లోనూ ఛాన్స్ కష్టమే..?

India vs Sri Lanka Test Series: సుదీర్ఘమైన సుదీర్ఘ ఫార్మాట్‌లో అవకాశాలు రావడం ఎప్పుడూ సులభం కాదు. ప్రస్తుతానికి బెంచ్‌కే పరిమితమైన ఈ నలుగురు ఆటగాళ్లు లభించిన సమయంలో ప్రతిభను మెరుగుపరుచుకుంటూ సరైన సమయం కోసం ఎదురుచూడటం ఒక్కటే ఏకైక మార్గం.

IND vs SL: ఈ నలుగురు వాటర్ బాటిల్స్ మోసేందుకే ఫిక్స్.. ఒక్క మ్యాచ్‌లోనూ ఛాన్స్ కష్టమే..?
India Vs Sri Lanka Test Series Players
Venkata Chari
|

Updated on: Aug 06, 2026 | 12:27 PM

Share

India vs Sri Lanka Test Series: శ్రీలంకతో జరగబోయే కీలక టెస్టు సిరీస్‌లో భారత తుది జట్టు కూర్పుపై స్పష్టత వచ్చేసింది. ఘనమైన ఫామ్‌లో ఉన్నప్పటికీ, జట్టులోని అనుభవజ్ఞుల పోటీ తట్టుకోలేక నలుగురు యంగ్ క్రికెటర్లు బెంచ్‌కే పరిమితం కానున్నారు. కనీసం ఒక్క మ్యాచ్ ఆడే అవకాశం కూడా లభించక, డ్రెస్సింగ్ రూమ్‌కే పరిమితం కావడం వారి అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేస్తోంది.

టీమిండియా పక్కా ప్లాన్.. సీనియర్లకే ప్రాధాన్యం..!

శ్రీలంక పర్యటనలో మొదటి టెస్టు కోసం భారత యాజమాన్యం అత్యంత బలమైన ప్లేయింగ్ ఎలెవన్‌ను సిద్ధం చేసింది. అక్కడి స్పిన్ పిచ్‌లు, వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని పక్కా వ్యూహంతో అడుగులు వేస్తోంది. జట్టు కలయికను సమతుల్యంగా ఉంచాలనే ఉద్దేశంతో అనుభవజ్ఞులైన ఆటగాళ్లకు మాత్రమే ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించారు.

ఇదికూడా చదవండి: అమ్మాయిలతో జాగ్రత్త.. ఆ ఇద్దరిలా అస్సలు మారొద్దు.. వైభవ్ సూర్యవంశీకి మాజీ క్రికెటర్ హెచ్చరిక..!

ఇవి కూడా చదవండి

దీంతో జట్టులోకి ఎంపికైన కొందరు యువ ఆటగాళ్లకు నిరాశ తప్పడం లేదు. సీనియర్లు ఫామ్‌లో ఉండటం, ఏ ఒక్కరికీ గాయాలు కాకపోవడంతో తుది జట్టులోకి కొత్తవారికి ప్రవేశం లభించడం దాదాపు అసాధ్యంగా మారింది. ఎలాంటి అవాంఛనీయ మార్పులు లేకపోతే ఈ సిరీస్ పొడవునా నలుగురు ఆటగాళ్లు కేవలం వాటర్ బాయ్ పాత్రకే పరిమితం కావాల్సి వస్తుంది.

తిరుగులేని అనుభవం.. రేసులో వెనకబడ్డ మానవ్ సుథార్, సారాంశ్ జైన్..!

దేశవాళీ క్రికెట్‌లో అద్భుతమైన స్పిన్ బౌలింగ్‌తో ఆకట్టుకున్న మానవ్ సుథార్‌ను బ్యాకప్ స్పిన్నర్‌గా జట్టులోకి తీసుకున్నారు. లంక పిచ్‌లపై భారత ప్రధాన స్పిన్ దళం అనుభవం ముందు అతనికి చోటు దక్కడ దాదాపు అసాధ్యం. తొలి టెస్టులోనే కాకుండా సిరీస్ అంతటా అతనికి బెంచ్ తప్పేలా లేదు.

ఇదికూడా చదవండి: స్వ్కాడ్‌లో ఈ 15మంది ఉంటే చాలు.. వద్దన్నా 2027 వన్డే వరల్డ్ కప్ పట్టుకొచ్చేస్తారంతే..!

మరొకవైపు అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్‌లో రాణిస్తూ ఆల్ రౌండర్ ప్రతిభను చూపించిన సారాంశ్ జైన్ పరిస్థితి కూడా ఇలాగే ఉంది. జట్టులో ఇప్పటికే తుది కూర్పు కుదిరిపోవడంతో ఈ ఇద్దరు స్పిన్నర్లు తమ వంతు అవకాశం వచ్చే వరకు నిరీక్షించక తప్పడం లేదు.

పేస్ దళం దాటికి గుర్‌నూర్ బ్రార్ కష్టాలు.. దేవదత్ పడిక్కల్ పరిస్థితి ఏంటి?

యంగ్ స్పీడ్‌స్టర్ గుర్‌నూర్ బ్రార్ తన వేగంతో సెలక్టర్లను ఆకట్టుకుని జట్టులో చోటు దక్కించుకున్నాడు. జస్‌ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్ వంటి ప్రపంచ స్థాయి బౌలర్లు జట్టులో ఉండటంతో గుర్‌నూర్‌కు అవకాశం లభించడం కష్టంగా మారింది. పేస్ విభాగంలో గట్టి పోటీ ఉండటంతో అతను మైదానంలోకి దిగే సూచనలు కనిపిస్తుండవు.

ఎక్కువమంది చదివింది: IND vs PAK: ఏషియన్ గేమ్స్‌కు ముందే భారత్, పాక్ హైవోల్టేజ్ పోరు.. షెడ్యూల్ లీక్, ఎక్కడంటే..?

టాప్ ఆర్డర్ బ్యాటర్ దేవదత్ పడిక్కల్ పరిస్థితి కూడా భిన్నంగా ఏమీ లేదు. ఓపెనింగ్, మిడిల్ ఆర్డర్‌లో ఇప్పటికే స్టార్ బ్యాటర్లు స్థానాలు ఖాయం చేసుకోవడంతో పడిక్కల్ రిజర్వ్ బెంచ్‌పైనే కూర్చోవాల్సి వస్తుంది. ఎవరైనా ఆటగాడు గాయపడితే తప్ప అతనికి ఆడే ఛాన్స్ రాదు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us