చూపు తిప్పుకోనివ్వని సోయగం.. సైలెంట్‌గా కుర్రకారు గుండెలు కొల్లగొడుతున్న ప్రియాంక

08 May 2026

Pic credit - Instagram

Phani Ch

ప్రియాంక మోహన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. గ్యాంగ్ లీడర్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది ఈ ముద్దుగుమ్మ.

1994 నవంబర్ 20న జన్మించిన ఈ భామ కన్నడ తల్లికి తమిళ తండ్రికి తమిళనాడులోని మద్రాసులో పుట్టి పెరిగింది ఈ చిన్నది.

అంతేకాదు అక్కడే ఉన్న పెస్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో (PESIT)లో బయో టెక్నాలజీలో ఇంజినీరింగ్‌లో డిగ్రీని పూర్తి చేసింది.

ఒకానొక సమయంలో వరుస ప్లాప్ లతో ఇబ్బంది పడిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు వరుస హిట్లతో ముందుకెళ్తుందనే చెప్పాలి.

నానితో గ్యాంగ్ లీడర్, సరిపోదా శనివారం సినిమాల్లో నటించి హిట్ కొత్తగా. తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ OG లో హీరోయిన్ గా నటించింది ప్రియాంక.

OG తర్వాత టాలీవుడ్ లో మరో ప్రాజెక్ట్ కు సైన్ చేయని ప్రియాంక అరుళ్ మోహన్..ప్రస్తుతం తమిళం, కన్నడం మూవీస్ లో నటిస్తున్నారు.

తనకు వచ్చిన అవకాశాలు సద్వినియోగం చేసుకుంటూ కెరీర్లో దూసుకుపోతుంది ముద్దుగుమ్మ.  సోషల్ మీడియాలో యాక్టివ్ ఉంటూ ఫొటోస్ షేర్ చేస్తూఉంటుంది.