AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఫోన్‌ కోసం మీ బడ్జెట్‌ రూ.20 వేలా? అయితే ఈ ఫీచర్లు ఉండే ఫోనే తీసుకోండి!

రూ.20 వేల లోపు స్మార్ట్‌ఫోన్‌ని కొనేటప్పుడు బ్రాండ్ కాకుండా కీలక ఫీచర్‌లపై దృష్టి పెట్టాలి. ప్రాసెసర్, AMOLED డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, కనీసం 8GB RAM, 128GB స్టోరేజ్, OIS కెమెరా, 5000mAh బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్, 5G కనెక్టివిటీ, సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌లు పరిశీలించడం ద్వారా ఉత్తమ విలువ పొందవచ్చు.

ఫోన్‌ కోసం మీ బడ్జెట్‌ రూ.20 వేలా? అయితే ఈ ఫీచర్లు ఉండే ఫోనే తీసుకోండి!
Smartphones
SN Pasha
|

Updated on: May 09, 2026 | 9:30 AM

Share

రూ.20 వేల బడ్జెట్‌లో స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేసే ముందు కేవలం బ్రాండ్ మాత్రమే కాకుండా, రోజువారీ వినియోగానికి అవసరమైన కీలక ఫీచర్లను పరిశీలించడం చాలా ముఖ్యమని టెక్ నిపుణులు సూచిస్తున్నారు. ప్రస్తుతం ఈ ధరలో గేమింగ్, ఫోటోగ్రఫీ, బ్యాటరీ, 5G కనెక్టివిటీ వంటి అనేక ప్రీమియం ఫీచర్లు అందుబాటులోకి వచ్చాయి. ముఖ్యంగా ప్రాసెసర్ ఎంపిక కీలకం. ఈ బడ్జెట్‌లో కనీసం మీడియాటెక్ డైమెన్సిటీ సిరీస్ లేదా స్నాప్‌డ్రాగన్ 7 సిరీస్ చిప్‌సెట్ ఉన్న ఫోన్‌ను ఎంచుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఇది రోజువారీ పనులతో పాటు గేమింగ్, మల్టీటాస్కింగ్‌ను కూడా సాఫీగా నిర్వహించడానికి సహాయపడుతుంది.

డిస్‌ప్లే విషయంలో AMOLED లేదా OLED ప్యానెల్‌కు ప్రాధాన్యం ఇవ్వడం మంచిదని సూచిస్తున్నారు. కనీసం 120Hz రిఫ్రెష్ రేట్ ఉంటే స్క్రోలింగ్, వీడియోలు, గేమింగ్ మరింత స్మూత్‌గా కనిపిస్తాయి. Full HD+ రిజల్యూషన్ ఉండటం కూడా అవసరం. RAM, స్టోరేజ్ విషయంలో కనీసం 8GB RAM, 128GB స్టోరేజ్ ఉండే మోడల్‌ను తీసుకోవడం భవిష్యత్తు అవసరాలకు ఉపయోగకరంగా ఉంటుంది. కొన్ని ఫోన్లు వర్చువల్ RAM ఫీచర్‌ను కూడా అందిస్తున్నాయి. కెమెరా విషయంలో కేవలం మెగాపిక్సెల్స్‌ను మాత్రమే చూడకూడదని టెక్ నిపుణులు చెబుతున్నారు. ప్రధాన కెమెరా సెన్సార్ నాణ్యత, OIS (ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్), నైట్ మోడ్, 4K వీడియో సపోర్ట్ వంటి అంశాలు ముఖ్యమని సూచిస్తున్నారు.

బ్యాటరీ పరంగా కనీసం 5,000mAh సామర్థ్యం, 45W లేదా అంతకంటే ఎక్కువ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉండటం మంచిది. అలాగే 5G సపోర్ట్, Wi-Fi 6, స్టీరియో స్పీకర్లు, IP రేటింగ్ వంటి అదనపు ఫీచర్లు ఉంటే మరింత మంచి అనుభవం లభిస్తుంది. అదనంగా కంపెనీ ఎన్ని సంవత్సరాల సాఫ్ట్‌వేర్ అప్‌డేట్లు ఇస్తుందో కూడా పరిశీలించాలని నిపుణులు సూచిస్తున్నారు. మంచి హార్డ్‌వేర్‌తో పాటు దీర్ఘకాలిక సాఫ్ట్‌వేర్ సపోర్ట్ ఉన్న ఫోన్‌ను ఎంపిక చేసుకోవడం వల్ల డబ్బుకు సరైన విలువ లభిస్తుందని చెబుతున్నారు.

మరిన్ని టెక్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Follow Us