కొత్త ఫోన్‌కి అప్‌గ్రేడ్ అవుతున్నారా? పాత ఫోన్ అమ్మే ముందు ఇవి తెలుసుకోండి
17 Jun 2026
Anand T
మీ ఫోన్‌లో ఉన్న పాత డేటాను బ్యాకప్ చేసుకునేందుకు గూగుల్ డ్రైవ్ లేదా ఐక్లౌడ్ వంటి క్లౌడ్ సర్వీసులను ఉపయోగించండి.
డేటా బ్యాకప్
ఫోన్‌లోని మొత్తం డేటాను క్లియర్ చేసేందుకు ఫ్యాక్టరీ రీసెట్ చేయండి. దీనికోసం Settings > System > Reset > Factory data reset ఆప్షన్‌లోకి వెళ్లండి. ఇది మీ ఫోన్‌ను కొన్నప్పుడు ఎలా ఉందో ఆ స్థితికి తెస్తుంది.
ఫ్యాక్టరీ రీసెట్
మీ ఫోన్‌లో లాగిన్ అయి ఉన్న గూగుల్, యాపిల్, ఈమెయిల్, సోషల్ మీడియా, ఇతర అన్ని యాప్స్ లేదా సర్వీసుల నుండి పూర్తిగా లాగౌట్ అవ్వండి.
సైన్ అవుట్ అవ్వండి
మీరు ఆండ్రాయిడ్ ఫోన్ వాడుతుంటే, కొత్తగా కొనే వ్యక్తి ఫోన్‌ను సెటప్ చేసుకునేటప్పుడు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండటానికి FRPని డిసేబుల్ చేయండి. దీనికోసం Settings > Security > Find My Device > Deactivate చేయండి.
FRPని డిసేబుల్
ఐఫోన్ వినియోగదారులు తమ యాపిల్ ఐడి ఖాతా నుండి ఆ ఫోన్‌ను తొలగించాలి అనుకుంటే. ఇందుకోసం Settings > [Your Name] > Sign Out పై క్లిక్ చేయండి.
యాపిల్ ఐడి
ఫోన్‌కు ఉన్న కేసులు, స్క్రీన్ ప్రొటెక్టర్లు లేదా ఇతర యాక్సెసరీలను తీసివేయండి. వీటిని మీరు విడిగా అమ్ముకోవచ్చు లేదా మీ కొత్త డివైజ్ కోసం ఉంచుకోవచ్చు.
యాక్సెసరీలను తీసివేయండి
ఫోన్‌పై ఉన్న మురికి, వేలిముద్రలు, మరకలను పూర్తిగా తుడిచి శుభ్రం చేయండి. క్లీన్‌గా ఉన్న ఫోన్ కొనేవారికి మంచి ఇంప్రెషన్‌ను ఇస్తుంది.
ఫోన్ క్లీనింగ్
ఐఫోన్‌ను అమ్మే ముందు యాక్టివేషన్ లాక్ ఆఫ్ చేసి ఉందో లేదో చూసుకోండి. దీనికోసం Settings > [Your Name] > Find My > Find My iPhone కి వెళ్లి, అది టర్న్ ఆఫ్ అయి ఉండేలా చూసుకోండి.