చురకత్తిలాంటి చూపులతో చితకొట్టిన భాగ్యశ్రీ బోర్సే.. పిక్స్ వైరల్

08 May 2026

Pic credit - Instagram

Phani Ch

భాగ్యశ్రీ బోర్సే గురించి ప్రత్యేకంగా చెప్పాలిసిన పని లేదు.. ‘మిస్టర్ బచ్చన్’ సినిమా ఈ ముద్దుగుమ్మ అందాలు చూసి పిచ్చెక్కిపోయారు కుర్రకారు.

హరీష్ శంకర్ డైరెక్షన్ లో రవితేజ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘మిస్టర్ బచ్చన్’ తో తెలుగు తెరకు పరిచయమైంది ఈ చిన్నది.

మిస్టర్ బచ్చన్ సినిమావిడుదలకు ముందే టాలీవుడ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసింది భాగ్యశ్రీ బోర్సే.  కానీ ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా పడింది.

అయితే ఈ సినిమా డిజాస్టార్ అయిన భాగ్యశ్రీకి వరుస ఆఫర్స్ క్యూ కడుతున్నాయి. భాగ్యశ్రీ బోర్సే స్వస్థలం మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీ నగర్.

మొట్టమొదట మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టి తరువాత బాలీవుడ్ లో యారియాన్ 2 సినిమాతో సినీరంగ ప్రవేశం చేసింది.

ప్రస్తుతం అఖిల్ అక్కినేని సరసన ‘లెనిన్’లో హీరోయిన్‌గా నటిస్తోంది. త్వరలోనే ఓ లేడీ ఓరియెంటెడ్ మూవీ చేయబోతున్నట్లుగా టాక్ నడుస్తోంది.

‘లెనిన్’లో శ్రీలీల తప్పుకోవడంతో వెంటనే, ఆమె ప్లేస్‌ని రీప్లేస్ చేసింది. ‘లెనిన్’పై ఈ భామ ఎన్నో ఆశలు పెట్టుకుంది. హిట్ కొడతానని ధీమాగా ఉంది.