AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Business Idea: సూపర్‌ మార్కెట్‌ బిజినెస్‌ సూపర్‌ సక్సెస్‌ అవ్వాలంటే ఇలా చేయండి! భారీ లాభాలు ఖాయం

వేగంగా విస్తరిస్తున్న పట్టణాల్లో సూపర్‌ మార్కెట్ వ్యాపారం మంచి లాభాల అవకాశాలను అందిస్తోంది. సరైన ప్రదేశాన్ని ఎంచుకోవడం విజయానికి కీలకం. జనసాంద్రత గల రెసిడెన్షియల్ ప్రాంతాలు, కొత్త కాలనీలు అనుకూలం. పోటీ తక్కువగా ఉన్నచోట ప్రారంభించి, సరైన ప్రణాళికతో నడిపితే దీర్ఘకాలంలో మంచి ఆదాయం పొందవచ్చు.

Business Idea: సూపర్‌ మార్కెట్‌ బిజినెస్‌ సూపర్‌ సక్సెస్‌ అవ్వాలంటే ఇలా చేయండి! భారీ లాభాలు ఖాయం
Supermarket Business
SN Pasha
|

Updated on: May 09, 2026 | 10:00 AM

Share

పట్టణాలు, గ్రామాలు వేగంగా విస్తరిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో సూపర్‌ మార్కెట్‌ వ్యాపారం మంచి అవకాశాలను అందిస్తున్న రంగంగా మారింది. అయితే ఏ ఏరియాలో సూపర్‌ మార్కెట్‌ పెడితే బాగా నడుస్తుంది? అనే ప్రశ్నకు వ్యాపార నిపుణులు కొన్ని ముఖ్యమైన సూచనలు చేస్తున్నారు. సరైన ప్రదేశాన్ని ఎంపిక చేస్తే ఈ వ్యాపారం స్థిరమైన ఆదాయం ఇవ్వడమే కాకుండా దీర్ఘకాలంలో మంచి లాభాలను కూడా అందించగలదని చెబుతున్నారు. ప్రధానంగా జనసాంద్రత ఎక్కువగా ఉన్న రెసిడెన్షియల్‌ ఏరియాలు సూపర్‌ మార్కెట్‌కు అనుకూలంగా భావిస్తున్నారు. అపార్ట్‌మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీలు, కొత్తగా అభివృద్ధి చెందుతున్న కాలనీలు ఉన్న ప్రాంతాల్లో రోజువారీ అవసరాల కోసం ప్రజలు దగ్గరలోనే షాపింగ్‌ చేయడానికి ఆసక్తి చూపుతారు.

దీంతో కస్టమర్ల రాక నిరంతరంగా ఉంటుంది. ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో గ్రోసరీ, కిరాణా, డైరీ, కూరగాయలు, హౌస్‌హోల్డ్‌ ఉత్పత్తులకు మంచి డిమాండ్‌ ఉంటుంది. అదేవిధంగా బస్‌ స్టాండ్‌లు, మెయిన్‌ రోడ్లు, స్కూళ్లు, కాలేజీలు లేదా ఆఫీసులకు సమీపంలోని ఏరియాలు కూడా వ్యాపారానికి అనుకూలమని నిపుణులు చెబుతున్నారు. రోజూ ఎక్కువ మంది రాకపోకలు ఉండటం వల్ల కొత్త కస్టమర్లు సులభంగా దొరుకుతారు. అయితే ఇప్పటికే పెద్ద పెద్ద రిటైల్‌ చైన్‌లు అధికంగా ఉన్న ప్రాంతాల్లో పోటీ తీవ్రంగా ఉండే అవకాశం ఉంది. అందుకే పోటీ తక్కువగా ఉండి, జనాభా పెరుగుతున్న ప్రాంతాలను ఎంపిక చేయడం మంచిదని సూచిస్తున్నారు.

లాభాల విషయానికి వస్తే ప్రారంభంలో పెట్టుబడి ఎక్కువగా ఉండొచ్చు. షాప్‌ రెంట్‌, ఇంటీరియర్‌, ఫ్రిజ్‌లు, ర్యాక్‌లు, స్టాక్‌ కొనుగోలు, సిబ్బంది జీతాలు వంటి ఖర్చులు ఉంటాయి. కానీ సరైన ప్రణాళికతో నడిపితే నెలకు 10 నుంచి 25 శాతం వరకు గ్రాస్‌ మార్జిన్‌ వచ్చే అవకాశం ఉందని మార్కెట్‌ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా హోమ్‌ డెలివరీ, డిజిటల్‌ పేమెంట్లు, కస్టమర్‌ ఆఫర్లు, మెంబర్‌షిప్‌ డిస్కౌంట్లు వంటి సదుపాయాలు కల్పిస్తే కస్టమర్లను నిలబెట్టుకోవచ్చు. జనసాంద్రత ఉన్న కానీ పోటీ తక్కువగా ఉన్న ప్రాంతంలో సూపర్‌ మార్కెట్‌ ప్రారంభిస్తే ఈ వ్యాపారం దీర్ఘకాలంలో మంచి ఆదాయం ఇచ్చే అవకాశాలు ఉన్నాయని వ్యాపార నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Follow Us