Telangana: మల ద్వారంలోకి గాలి పంపింగ్.. పరాచకం ప్రాణల మీదకు తెచ్చింది
హనుమకొండ జిల్లాలో ఓ ఇద్దరు వ్యక్తులు పరాచకంగా చేసిన పని ఒకరి ప్రాణం మీదకు తీసుకొచ్చింది. మలద్వారంలో గాలి పంపింగ్ చేయగా... అతడు ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడుతున్నాడు...
బావాబామ్మర్దులు సరదాగా మాటలు అనుకోవడం కామన్. ఒకరిని ఒకరు గేలి చేసుకుంటూ ఉంటారు. కానీ పరాచకాలు హద్దు మీరితే.. ఊహించని ఘటనలు చోటుచేసుకుంటాయి. తాజాగా అలాంటి ఘటనే హన్మకొండ జిల్లాలో వెలుగుచూసింది. బామ్మర్ధులు చేసిన పని బావ ప్రాణానికి ముప్పు తెచ్చింది. ఇప్పుడు అతను ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడుతున్నాడు.
వివరాల్లోకి వెళ్తే… హన్మకొండ జిల్లా ఐనవోలుకు చెందిన యువకుడు ట్రాక్టర్ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. ఇటీవల ట్రాక్టర్‌లో సమస్య తలెత్తడంతో… మెకానిక్ వద్దకు తీసుకెళ్లాడు. అక్కడ రిపేర్ చేస్తుండగా… అతని ఇద్దరి మిత్రులు అక్కడికి వచ్చారు. వారు ఆ యువకుడికి బావమర్దులు అవుతారు. రావడం రావడంతోనే వారు బావ వరస అయ్యే వ్యక్తిని ఆటపట్టించడం మొదలెట్టారు. కాసేపటి తర్వాత విచ్చలవిడితనంతో ప్రవర్తించారు. ఆ యువకుడి మలద్వారంలోకి హైడాల్రిక్ ఎయిర్ ప్రెషర్‌తో బలవంతంగా గాలి పంపారు. దీంతో ఆ యువకుడు తీవ్రమైన కడుపునొప్పితో.. అక్కడి సొమ్మసిల్లి పడిపోయాడు. స్థానికులు వెంటనే ఆస్పత్రిగా తరలించగా.. అక్కడి డాక్టర్ల సూచన మేరకు.. వరంగల్ సిటీలోని మరో ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి వైద్యులు సర్జరీ చేసి.. పొద్ద పేగులోని గాలిని తొలగించారు. ఇప్పటికి లక్ష పైనే ఖర్చు చేసినా అతని పరిస్థితి మెరుగుపడలేదు. మరికొద్ది రోజులు ఆస్పత్రిలోనే మానిటరింగ్ చేయాల్సి ఉంటుందని డాక్టర్లు తెలిపారు.
సరాదా అనే హద్దుల్లో ఉండాలి. శృతి మించి ప్రవర్తిస్తే పర్యవాసనాలు ఇలానే ఉంటాయి. గతంలో కూడా ఇలాంటి ఘటనలు వెలుగుచూసిన సందర్భాలు ఉన్నాయి. ఏది మంచి, ఏది చెడు అని తెలియకుండా ప్రవర్తిస్తే… ప్రాణాలు పోయే అవకాశం ఉంటుంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..