మీ ఫోన్ పోయిందా.. ఇలా చేస్తే అప్పటిలోగా తిరిగి పొందొచ్చు..
గతంలో ఫోన్ పోయినా.. చోరీకి గురైనా.. ఇక అది చేతికి తిరిగి వస్తుందన్న నమ్మకం ఉండేది కాదు. కానీ ఇప్పుడు పోలీసులు టెక్నాలజీ సాయంతో చోరీకి గురైన ఫోన్లు ఎక్కడ ఉన్నాయో గంటల వ్యవధిలోనే ట్రాక్ చేస్తున్నారు. తాజాగా సైబరాబాద్ పరిధిలో వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో చోరీకి గురైన 345 మొబైల్ ఫోన్లను బాధితులకు అందజేశారు. ఈ ఫోన్లు అన్నింటిని కేవలం 30 రోజుల్లోనే రికవరీ చేయడం విశేషం. సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ (CEIR) పోర్టల్ ద్వారా ఐటీ సెల్ వింగ్ 30 రోజుల్లో 345 ఫోన్లను రికవరీ చేయగలిగింది.
గతంలో ఫోన్ పోయినా.. చోరీకి గురైనా.. ఇక అది చేతికి తిరిగి వస్తుందన్న నమ్మకం ఉండేది కాదు. కానీ ఇప్పుడు పోలీసులు టెక్నాలజీ సాయంతో చోరీకి గురైన ఫోన్లు ఎక్కడ ఉన్నాయో గంటల వ్యవధిలోనే ట్రాక్ చేస్తున్నారు. తాజాగా సైబరాబాద్ పరిధిలో వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో చోరీకి గురైన 345 మొబైల్ ఫోన్లను బాధితులకు అందజేశారు. ఈ ఫోన్లు అన్నింటిని కేవలం 30 రోజుల్లోనే రికవరీ చేయడం విశేషం. సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ (CEIR) పోర్టల్ ద్వారా ఐటీ సెల్ వింగ్ 30 రోజుల్లో 345 ఫోన్లను రికవరీ చేయగలిగింది. స్వాధీనం చేసుకున్న మొబైల్ ఫోన్లను గురువారం క్రైమ్స్ డీసీపీ కె.నరసింహ బాధితులకు అందజేశారు. ఈ సందర్భంగా క్రైమ్స్ డీసీపీ మాట్లాడుతూ మొబైల్ ఫోన్లు మన లైఫ్‌లో కీ రోల్స్ పోషిస్తున్నాయని.. ఎన్నో జ్ఞాపకాలతో పాటు ఎంతో ముఖ్యమైన సమాచారం అందులో నిక్షిప్తమై ఉంటుందన్నారు. దొంగలు ఎప్పుడు, ఎలా.. చోరీకి పాల్పడతారో తెలియదన్నారు. అందుకే అందరూ అలెర్ట్‌గా ఉండాలన్నారు.
అలాగే ఫోన్ల రికవరీ విషయంలో పోలీసుల అశ్రద్దగా వ్వవహరించకుండా.. పట్టుదలగా వ్యవహరించాలన్నారు. చాలా మంది చదువుకున్నవాళ్లకి కూడా.. చోరీకి గురైన ఫోన్లు దుర్వినియోగం కాకుండా ఎలా నిరోధించాలో తెలియదన్నారు. కొద్దిమందికి మాత్రమే దానిపై అవగాహన ఉన్నట్లు చెప్పారు. NCRP పోర్టల్, CEIR పోర్టల్ లేదా అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో.. అందుబాటులో ఉన్న 1930 నేషనల్ హెల్ప్ లైన్ నంబర్‌కు డయల్ చేయడం ద్వారా పోగొట్టుకున్న ఫోన్ వివరాలు చెప్పాలని డీసీపీ పౌరులకు సూచించారు. సెల్ ఫోన్లను విజయవంతంగా రికవరీ చేసిన పోలీసు బృందాలను క్రైమ్స్ డీసీపీ అభినందించారు.