LIC HFL Recruitment 2024: డిగ్రీ అర్హతతో లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్‌లో భారీగా ఉద్యోగాలు.. తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని పోస్టులున్నాయంటే

లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(LIC) హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ (HFL)కు చెందిన ఎల్ఐసీ హెచ్‌ఎఫ్‌ఎల్‌ కార్యాలయాల్లో.. జూనియర్ అసిస్టెంట్ పోస్టుల భ‌ర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ కింద మొత్తం 200 జూనియర్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని రాష్ట్రాల్లో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. తెలుగు రాష్ట్రాల్లో కూడా భారీగానే ఖాళీలు ఉన్నాయి..

LIC HFL Recruitment 2024: డిగ్రీ అర్హతతో లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్‌లో భారీగా ఉద్యోగాలు.. తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని పోస్టులున్నాయంటే
LIC HFL Junior Assistant Recruitment
Follow us
Srilakshmi C

|

Updated on: Jul 26, 2024 | 3:14 PM

లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(LIC) హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ (HFL)కు చెందిన ఎల్ఐసీ హెచ్‌ఎఫ్‌ఎల్‌ కార్యాలయాల్లో.. జూనియర్ అసిస్టెంట్ పోస్టుల భ‌ర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ కింద మొత్తం 200 జూనియర్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని రాష్ట్రాల్లో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. తెలుగు రాష్ట్రాల్లో కూడా భారీగానే ఖాళీలు ఉన్నాయి. ఏపీ పరిధిలో 12 పోస్టులు, తెలంగాణ పరిధిలో 31 జేఏ పోస్టులు ఉన్నాయి. కనీస 60% మార్కులతో ఏదైనా డిగ్రీ పూర్తిచేసిన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే కంప్యూటర్ సిస్టమ్స్‌ ఆపరేటింగ్, వర్కింగ్ నాలెడ్జ్‌ కూడా ఉండాలి. కంప్యూటర్‌ ఆపరేషన్స్‌/ లాంగ్వేజ్‌లలో సర్టిఫికెట్‌ లేదా డిప్లొమా లేదా డిగ్రీ చదివి ఉండాలి. అభ్యర్ధుల వయసు జులై 1, 2024 నాటికి 21 నుంచి 28 సంవత్సరాల మధ్య ఉండాలి. దరఖాస్తు ఫీజు కింద ప్రతి ఒక్కరూ రూ.800 చెల్లించవల్సి ఉంటుంది. ఆసక్తి కలిగిన అభ్యర్ధులు జులై 25 నుంచి ఆగస్టు 14, 2024 వరకు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు.

రాష్ట్రాల వారీగా ఖాళీల వివరాలు..

  • ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోస్టుల సంఖ్య- 12
  • గుజరాత్ రాష్ట్రంలో పోస్టుల సంఖ్య- 5
  • కర్ణాటక రాష్ట్రంలో పోస్టుల సంఖ్య- 38
  • అస్సాం రాష్ట్రంలో పోస్టుల సంఖ్య- 5
  • హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో పోస్టుల సంఖ్య- 3
  • మధ్యప్రదేశ్ రాష్ట్రంలో పోస్టుల సంఖ్య- 12
  • ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో పోస్టుల సంఖ్య- 6
  • జమ్మూ కశ్మీర్ రాష్ట్రంలో పోస్టుల సంఖ్య- 1
  • మహారాష్ట్ర రాష్ట్రంలో పోస్టుల సంఖ్య- 53
  • పుదుచ్చేరి రాష్ట్రంలో పోస్టుల సంఖ్య- 1
  • సిక్కిం రాష్ట్రంలో పోస్టుల సంఖ్య- 1
  • తమిళనాడు రాష్ట్రంలో పోస్టుల సంఖ్య- 10
  • తెలంగాణ రాష్ట్రంలో పోస్టుల సంఖ్య- 31
  • ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో పోస్టుల సంఖ్య- 17
  • పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో పోస్టుల సంఖ్య- 5

ఆన్‌లైన్ రాత పరీక్ష, ఇంటర్వ్యూ, సర్టిఫికేట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి నెలకు రూ.32,000 నుంచి రూ.35,200 వరకు జీతం చెల్లిస్తారు.

ఆన్‌లైన్ రాత పరీక్ష ఎలా ఉంటుందంటే..

ఇంగ్లిష్ లాంగ్వేజ్ విభాగం నుంచి 40 ప్రశ్నలకు 40 మార్కులు, లాజికల్ రీజనింగ్ విభాగం నుంచి 40 ప్రశ్నలకు 40 మార్కులు, జనరల్ అవేర్‌నెస్ విభాగం నుంచి 40 ప్రశ్నలకు 40 మార్కులు, న్యూమరికల్ ఎబిలిటీ విభాగం నుంచి 40 ప్రశ్నలకు 40 మార్కులు, కంప్యూటర్ స్కిల్ విభాగం నుంచి 40 ప్రశ్నలకు 40 మార్కుల చొప్పున మొత్తం 200 మార్కులకు 120 నిమిషాల్లో పరీక్ష ఉంటుంది. ప్రశ్నాపత్రం కేవలం ఇంగ్లిష్ మాద్యమంలో మాత్రమే ఉంటుంది. ఆన్‌లైన్ పరీక్ష సెప్టెంబర్ 2024లో ఉంటుంది.

ఇవి కూడా చదవండి

నోటిఫికేషన్‌ కోసం క్లిక్‌ చేయండి.

మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.