AP Schools: పాఠశాలల్లో సీబీఎస్‌ఈ, టోఫెల్‌ అమలుపై మంత్రి లోకేశ్‌ కీలక ప్రకటన

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని పాఠశాలల్లో గత ప్రభుత్వం తీసుకువచ్చిన సీబీఎస్‌ఈ, టోఫెల్‌ అమలుపై ఏపీ సర్కార్ కీలక ప్రకటన చేసింది. సీబీఎస్‌ఈ, టోఫెల్‌ మంచి చెడులపై లోతుగా అధ్యయనం చేసి, వచ్చే విద్యాసంవత్సరం ప్రారంభానికి ముందే తమ నిర్ణయం ప్రకటిస్తామని మంత్రి లోకేశ్‌ తెలిపారు. గత ప్రభుత్వం సీబీఎస్‌ఈ, టోఫెల్‌ విధానాలను హడావుడిగా తెచ్చి అమలు చేసిందని, అందుకు విద్యార్థులు, ఉపాధ్యాయులు సన్నద్ధంగా లేరని ఆయన గురువారం..

AP Schools: పాఠశాలల్లో సీబీఎస్‌ఈ, టోఫెల్‌ అమలుపై మంత్రి లోకేశ్‌ కీలక ప్రకటన
Minister Lokesh
Follow us
Srilakshmi C

|

Updated on: Jul 26, 2024 | 3:54 PM

అమరావతి, జులై 26: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని పాఠశాలల్లో గత ప్రభుత్వం తీసుకువచ్చిన సీబీఎస్‌ఈ, టోఫెల్‌ అమలుపై ఏపీ సర్కార్ కీలక ప్రకటన చేసింది. సీబీఎస్‌ఈ, టోఫెల్‌ మంచి చెడులపై లోతుగా అధ్యయనం చేసి, వచ్చే విద్యాసంవత్సరం ప్రారంభానికి ముందే తమ నిర్ణయం ప్రకటిస్తామని మంత్రి లోకేశ్‌ తెలిపారు. గత ప్రభుత్వం సీబీఎస్‌ఈ, టోఫెల్‌ విధానాలను హడావుడిగా తెచ్చి అమలు చేసిందని, అందుకు విద్యార్థులు, ఉపాధ్యాయులు సన్నద్ధంగా లేరని ఆయన గురువారం విలేకరులతో తెలిపారు. ఈ నేపథ్యంలో వాటి అమలుకు సంబంధించి మంచి చెడులపై అధ్యయనం చేశాకే ఓ నిర్ణయానికి వస్తామని ఆయన తెలిపారు. అనంతరం తల్లికి వందనం పథకం గురించి మాట్లాడుతూ.. అర్హులైన అందరికీ తల్లికి వందనం పథకం వర్తించేలా మార్గదర్శకాలు రూపొందిస్తున్నామని స్పష్టం చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న ప్రతి విద్యార్ధికి ఈ పథకం కింద లబ్ధి చేకూరుస్తామని పేర్కొన్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలు తగ్గుతున్నందున అడ్మిషన్లు పెంచడం, నాణ్యమైన విద్య అందించడంపై వివిధ రాష్ట్రాల్లో అమలవుతున్న విధివిధానాలను పరిశీలిస్తామని మంత్రి లోకేష్‌ చెప్పుకొచ్చారు.

ఏపీ సర్కార్ కీలక ప్రకటన.. పీజీ వైద్యవిద్యలో ఇన్‌సర్వీస్‌ కోటా సీట్ల తగ్గింపు

నీట్‌ పీజీ ద్వారా ఇన్‌సర్వీస్‌ కోటాలో కేటాయించే సీట్ల సంఖ్య తగ్గిస్తూ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం గురువారం (జులై 25) ఉత్తర్వులు జారీ చేసింది. జనరల్‌ మెడిసిన్, జనరల్‌ సర్జరీ, గైనకాలజీ, పీడియాట్రిక్స్‌ అనస్థీషియా, ఎమర్జెన్సీ మెడిసిన్‌ స్పెషాలిటీల్లో 15 శాతం, నాన్‌-క్లినికల్‌ కేటగిరీ విభాగాల్లో 30 శాతం సీట్లను మాత్రమే భర్తీ చేస్తామని ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది. ఈ ఉత్తర్వులను 2024-25 విద్యా సంవత్సరంలో అమలుచేస్తామని వివరించింది. 2025-26 విద్యా సంవత్సరం నుంచి స్పెషాలిటీల వారీగా భర్తీ చేసే సీట్ల సంఖ్యకు సంబంధించిన వివరాలను ప్రకటిస్తామని ఉత్తర్వుల్లో తెలిపింది. క్లినికల్‌ విభాగంలో 15 శాతం, నాన్‌-క్లినికల్‌ విభాగంలో 30 శాతం మించకుండా సీట్ల కేటాయింపు ఉంటుందని పేర్కొంది. అలాగే పీజీ పూర్తిచేసిన అభ్యర్ధులు పదేళ్లపాటు విధిగా ప్రభుత్వ సర్వీసులో పనిచేయాల్సి ఉంటుందని తెలిపింది. ఒప్పందంలో పేర్కొన్న ప్రకారంగా వ్యవహరించని వైద్యుల అర్హత సర్టిఫికెట్లను రద్దు చేసే అధికారం యూనివర్సిటీకి ఉంటుందని, అంతేకాకుండా అటువంటి వారికి రూ.50 లక్షల వరకు జరిమానా కూడా విధిస్తామని హెచ్చరించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.

నిరుద్యోగులకు బలేఛాన్స్.. DEETలో ప్రైవేటు ఉద్యోగాలు! దరఖాస్తు ఇలా
నిరుద్యోగులకు బలేఛాన్స్.. DEETలో ప్రైవేటు ఉద్యోగాలు! దరఖాస్తు ఇలా
కుంభ మేళా ఏర్పాట్లు పరిశీలించిన సీఎం యోగి.. అధికారులతో సమీక్ష
కుంభ మేళా ఏర్పాట్లు పరిశీలించిన సీఎం యోగి.. అధికారులతో సమీక్ష
చిల్డ్ బీర్ ఆర్డర్ చేస్తే.. చినిగి చాటయ్యింది..
చిల్డ్ బీర్ ఆర్డర్ చేస్తే.. చినిగి చాటయ్యింది..
ఇంట్లో హనుమంతుడు ఫోటోలు పెట్టుకోవడానికి వాస్తు నియమాలున్నాయని తెల
ఇంట్లో హనుమంతుడు ఫోటోలు పెట్టుకోవడానికి వాస్తు నియమాలున్నాయని తెల
క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో CA విద్యార్ధుల సత్తా.. 8వేల మంది ఎంపిక
క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో CA విద్యార్ధుల సత్తా.. 8వేల మంది ఎంపిక
న్యూఇయర్ వేళ గోల్డ్ లవర్స్‌కి గోల్డెన్ న్యూస్.. తగ్గిన బంగారం ధర
న్యూఇయర్ వేళ గోల్డ్ లవర్స్‌కి గోల్డెన్ న్యూస్.. తగ్గిన బంగారం ధర
కానిస్టేబుల్‌ అభ్యర్థులకు దేహదారుఢ్య పరీక్షలు ప్రారంభం
కానిస్టేబుల్‌ అభ్యర్థులకు దేహదారుఢ్య పరీక్షలు ప్రారంభం
ఈ ఏడాది స్పోర్ట్స్‌లో జరిగిన అద్భుతాలు, హార్ట్ బ్రేక్‌లు ఇవే..!
ఈ ఏడాది స్పోర్ట్స్‌లో జరిగిన అద్భుతాలు, హార్ట్ బ్రేక్‌లు ఇవే..!
కోనసీమ విద్యార్థినిలకు దక్కిన అరుదైన గౌరవం..
కోనసీమ విద్యార్థినిలకు దక్కిన అరుదైన గౌరవం..
Horoscope Today: వారికి ఆకస్మిక ధన లాభానికి అవకాశం..
Horoscope Today: వారికి ఆకస్మిక ధన లాభానికి అవకాశం..
వాతావరణం చల్లగా ఉందని వేడి వేడిగా తింటున్నారా.? జాగ్రత్త.!
వాతావరణం చల్లగా ఉందని వేడి వేడిగా తింటున్నారా.? జాగ్రత్త.!
మొన్న చెయ్యి.. ఇవాళ కాలు.. ఇడుపులపాయలో వింత పుట్టగొడుగులు.!
మొన్న చెయ్యి.. ఇవాళ కాలు.. ఇడుపులపాయలో వింత పుట్టగొడుగులు.!
సముద్రం ఒడ్డున బంగారం తెచ్చుకున్నోళ్లకు తెచ్చుకున్నంత.! వీడియో..
సముద్రం ఒడ్డున బంగారం తెచ్చుకున్నోళ్లకు తెచ్చుకున్నంత.! వీడియో..
డేటా యూజర్లకు జియో షాక్‌.! డేటా ప్యాక్‌ల వ్యాలిడిటీని తగ్గించిందా
డేటా యూజర్లకు జియో షాక్‌.! డేటా ప్యాక్‌ల వ్యాలిడిటీని తగ్గించిందా
ఏపీలో సంక్రాంతి సెలవులపై ప్రభుత్వం క్లారిటీ.! ఇన్ని రోజులా..
ఏపీలో సంక్రాంతి సెలవులపై ప్రభుత్వం క్లారిటీ.! ఇన్ని రోజులా..
ఆలయ హుండీ లెక్కింపు.. రూ.20 నోటుపై రాసింది చూసి అందరూ షాక్.!
ఆలయ హుండీ లెక్కింపు.. రూ.20 నోటుపై రాసింది చూసి అందరూ షాక్.!
మల్లారెడ్డి సిక్స్ ప్యాక్.? ఏడు పదుల వయసులో జిమ్‌.. వీడియో వైరల్.
మల్లారెడ్డి సిక్స్ ప్యాక్.? ఏడు పదుల వయసులో జిమ్‌.. వీడియో వైరల్.
హెల్మెట్‌లో దూరి.. కాటేసిన పాము.! గుండె గుబేల్ అనిపించే వీడియో..
హెల్మెట్‌లో దూరి.. కాటేసిన పాము.! గుండె గుబేల్ అనిపించే వీడియో..
భీకర అలల తాకిడికి మునిగిన నౌక.! కాపాడాలంటూ అత్యవసర సందేశం..
భీకర అలల తాకిడికి మునిగిన నౌక.! కాపాడాలంటూ అత్యవసర సందేశం..
పేద స్నేహితుడి కుమార్తె పెళ్లికి డబ్బు సాయం.! పూర్వ విద్యార్థలు..
పేద స్నేహితుడి కుమార్తె పెళ్లికి డబ్బు సాయం.! పూర్వ విద్యార్థలు..