Telangana: సత్తాచాటిన తెలంగాణ గురుకుల విద్యార్థులు.. ఈసారి ఎంతమందికి ఎంబీబీఎస్ సీట్లు వచ్చాయంటే ?

తెలంగాణ ప్రభుత్వం గురుకుల విద్యార్థుల కోసం చేపట్టినటువంటి ఆపరేషన్‌ బ్లూ క్రిస్టల్‌ అనే ప్రాజెక్టు సరికొత్త చరిత్రను సృష్టిస్తోంది. నీట్‌ మొదటి విడత కౌన్సిలింగ్‌లోనే సాంఘిక, గిరిజన సంక్షేమ గురుకులాల విద్యార్థులు తమ సత్తా చాటిచెప్పారు. మొదటి విడత కౌన్సెలింగ్‌లో దాదాపు 180 మంది విద్యార్థులు ఎంబీబీఎస్‌ సీట్లు దక్కించుకున్నారు. సోషల్‌ వెల్ఫేర్‌ గురుకులాల నుంచి 135 మంది, గిరిజన గురుకులాల నుంచి 45 మంది సీట్లు సాధించారు.

Telangana: సత్తాచాటిన తెలంగాణ గురుకుల విద్యార్థులు.. ఈసారి ఎంతమందికి ఎంబీబీఎస్ సీట్లు వచ్చాయంటే ?
Medical Students
Follow us
Aravind B

|

Updated on: Aug 24, 2023 | 11:32 AM

తెలంగాణ ప్రభుత్వం గురుకుల విద్యార్థుల కోసం చేపట్టినటువంటి ఆపరేషన్‌ బ్లూ క్రిస్టల్‌ అనే ప్రాజెక్టు సరికొత్త చరిత్రను సృష్టిస్తోంది. నీట్‌ మొదటి విడత కౌన్సిలింగ్‌లోనే సాంఘిక, గిరిజన సంక్షేమ గురుకులాల విద్యార్థులు తమ సత్తా చాటిచెప్పారు. మొదటి విడత కౌన్సెలింగ్‌లో దాదాపు 180 మంది విద్యార్థులు ఎంబీబీఎస్‌ సీట్లు దక్కించుకున్నారు. సోషల్‌ వెల్ఫేర్‌ గురుకులాల నుంచి 135 మంది, గిరిజన గురుకులాల నుంచి 45 మంది సీట్లు సాధించారు. అయితే వీరిలో రెగ్యులర్‌ ఇంటర్‌ విద్యార్థులు 30 మంది, లాంగ్‌టర్మ్‌ నుంచి 105 మంది విద్యార్థులు ఉన్నారు. ఇక తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్‌ జూనియర్‌ కళాశాలలకు చెందిన ఐదుగురు విద్యార్థులు సైతం ఎంబీబీఎస్‌ సీట్లు సాధించారు. అయితే గత సంవత్సరం గిరిజన గురుకులాల నుంచి 41 మంది విద్యార్థులు మెడిసన్‌లో సీట్లు దక్కించుకున్నారు. ఈసారి 45 మంది సీట్లు సాధించారు.

వీళ్లలో 18 బాలికలు ఉన్నారు. రెగ్యులర్ ఇంటర్ నుంచి 8 మంది కాగా.. లాంగ్‌టర్మ్ నుంచి 37 మంది ఎంపికయ్యారు. అయితే మొట్టమొదటిసారిగా పర్టిక్యులర్‌ వల్నరబుల్‌ ట్రైబల్‌ గ్రూప్స్‌ (పీవీటీజీ)కు చెందిన విద్యార్థిని కూడా ఎంబీబీఎస్ సీటు పొందింది. పీవీటీజీకి చెందిన సంగర్సు స్రవంతి అనే విద్యార్థిని కరీంనగర్‌లోని ప్రతిమ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌లో సీటు సాధించింది.

ఆపరేషన్‌ బ్లూ క్రిస్టల్‌ సక్సెస్‌ తెలంగాణ ప్రభుత్వం నిరుపేద విద్యార్థుల కోసం ఫ్రీగా నీట్‌ లాంగ్‌టర్మ్‌ కోచింగ్‌ అందించేందుకు ఎస్సీ గురుకులాల్లో ఆపరేషన్‌ బ్లూ క్రిస్టల్‌ (ఓపీబీసీ), గిరిజన గురుకులాల్లో ఆపరేషన్‌ ఎమరాల్డ్‌ (ఓపీఎం) లను ప్రారంభించింది. ఈ సంవత్సరం ఓపీబీసీ కింద 223 మందికి శిక్షణ ఇచ్చారు. అయితే అందులో 153 మంది ర్యాంకులు సాధించారు. రెగ్యులర్‌ గురుకులాల నుంచి మరో 50 మంది విద్యార్థులు అర్హత సాధించారు. మొత్తానికి సాంఘిక సంక్షేమ గురుకులాల నుంచే ఈ ఏడాది 203 మంది విద్యార్థులు ర్యాంకులు సాధించారు. ఓపీఎం కింద ఈ ఏడాది 93 మంది గిరిజన విద్యార్థులకు నీట్‌ లాంగ్‌టర్మ్‌ శిక్షణ ఇచ్చారు. అయితే వీరిలో 64 మంది ర్యాంకులు దక్కించుకున్నారు. మరో 8 మంది రెగ్యులర్‌ గురుకులాలకు చెందినవారు కలుపుకొని మొత్తంగా గిరిజన గురుకులాల నుంచి 72 మంది ఎంబీబీఎస్‌కు అర్హత సాధించారు. ఓపీబీసీ, ఓపీఎం నుంచి 185 మంది తొలి విడత కౌన్సిలింగ్‌లో సీట్లు పొందారు.

ఇవి కూడా చదవండి

విద్యార్థులకు మంత్రుల అభినందనలు గురుకుల విద్యార్థులు గతంలో కంటే ఎక్కువగా మెడికల్‌ సీట్లను సాధించడంపై మంత్రులు సత్యవతి రాథోడ్‌, కొప్పుల ఈశ్వర్‌, గురుకుల విద్యాలయాల సొసైటీ కార్యదర్శి నవీన్‌ నికోలస్‌, తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్‌ ఎడ్యుకేషనల్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌ సొసైటీ సెక్రటరీ షఫీవుల్లా ఆనందం వ్యక్తం చేశారు. సీట్లు దక్కించున్న విద్యార్థులకు అభినందనలు తెలిపారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

వైరల్ వీడియో: ఇంగ్లాండ్ టూర్‌కు ఆ పేసర్‌ను ఎంపిక చేయాలని డిమాండ్
వైరల్ వీడియో: ఇంగ్లాండ్ టూర్‌కు ఆ పేసర్‌ను ఎంపిక చేయాలని డిమాండ్
గత్తరలేపుతోన్న జై చిరంజీవ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్..
గత్తరలేపుతోన్న జై చిరంజీవ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్..
ఎర్రచందనం వల్ల ఎన్ని ఉపయోగాలో తెలుసా..?ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే
ఎర్రచందనం వల్ల ఎన్ని ఉపయోగాలో తెలుసా..?ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే
మొదటి భారతీయ సూపర్ స్టార్‌గా అదరగొట్టిన DK!
మొదటి భారతీయ సూపర్ స్టార్‌గా అదరగొట్టిన DK!
స్పప్నకు సీమంతంతో రుద్రాణి ప్లాన్.. కావ్య, రాజ్‌లకు మరో షాక్!
స్పప్నకు సీమంతంతో రుద్రాణి ప్లాన్.. కావ్య, రాజ్‌లకు మరో షాక్!
గంగిరెద్దుకు క్యూ ఆర్ కోడ్‌.. ఓన్లీ డిజిటల్‌ పేమెంట్స్..
గంగిరెద్దుకు క్యూ ఆర్ కోడ్‌.. ఓన్లీ డిజిటల్‌ పేమెంట్స్..
వచ్చే ఏడాది నుంచి ఇంటర్‌లో CBSE సిలబస్.. ఇంటర్‌ బోర్డు
వచ్చే ఏడాది నుంచి ఇంటర్‌లో CBSE సిలబస్.. ఇంటర్‌ బోర్డు
సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌లను పెళ్లి చేసుకున్న ముగ్గురు
సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌లను పెళ్లి చేసుకున్న ముగ్గురు
కుంకుమపువ్వు పాలు.. ఆరోగ్యానికి లాభాలు తెలిస్తే అస్సలూ వదలరు గురూ
కుంకుమపువ్వు పాలు.. ఆరోగ్యానికి లాభాలు తెలిస్తే అస్సలూ వదలరు గురూ
కిడ్నీలపై ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలుసా..? సంచలన అధ్యయనం
కిడ్నీలపై ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలుసా..? సంచలన అధ్యయనం