Telangana: ఒరెయ్ పొలం నుంచి అవి ఎలా దొంగతనం చేశార్రా.. బిత్తరపోయిన రైతు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురంలో దొంగలు రూట్ మార్చారు. కాదేది దొంగతనానికి అనర్హం అన్నట్లు మారారు కొందరు చోరులు. లోకల్ పుష్పాలుగా సినిమాని చూపిస్తున్నారు. ఇంతకీ వారేం దొంగతనం చేశారు..? ఎవరు బాధితులుగా మారారు.. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి....

బంగారం, వెండి, డబ్బు, ఇనుము, ట్రాన్స్‌ఫార్మర్లు, మోటర్లు, వాహనాలు, గేదెలు అపహరణకు గురయ్యాయి అంటూ మనం తరచుగా వార్తలు వింటూ ఉంటాం. ప్రస్తుతం సీసీ కెమెరాలు రావడం, టెక్నాలజీ ద్వారా పోలీసుల ట్రాకింగ్ పెరిగిపోవడంతో.. దొంగలు రూట్ మార్చారు. కొత్త తరహా దొంగతనాలకు తెరా లేపారు. పొలాలన్నే రైతులు ఆరుగాలం పండించిన పంటలను చోరీ చేస్తున్నారు. టమాట, ఉల్లి, మిర్చి, పత్తి వంటివి ఎత్తుకుపోవడం ఇప్పటివరకు మనం చూశాం. కానీ ఇప్పుడు అంతకుమించిన దొంగతనమే అశ్వాపురం మండలంలో జరిగింది.
వివరాల్లోకి వెళితే.. మొండికుంట గ్రామానికి చెందిన లింగారెడ్డి అనే రైతు సాగు చేస్తున్న జామాయిల్ తోటలో 120 చెట్లను నరికి.. ఆ దుంగలను రాత్రికి రాత్రే మాయం చేశారు రైతులు. దొంగతనం జరగక ముందు రోజు సాయంత్రం వరకు పొలం దగ్గర ఉన్న రైతు తన జమాయిల్ చెట్లు వేపుగా పెరిగాయని మంచి రేటు పలుకుతాయని ఆనందపడ్డాడు. తెల్లారి పొలం దగ్గరికి వెళ్లేసరికి తన జామాయిల్ చెట్లు మాయమయ్యేసరికి లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించాడు. సుమారు 80 వేల విలువ గల 12 టన్నుల జామాయిల్ కర్ర చోరీకి గురైందని, రైతు పొలంలో వేసుకున్న చెట్లకు కూడా రక్షణ లేకుండా పోతే ఏం చేయాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు వివరాలు సేకరించి ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.