Smart Watches: ఆ స్మార్ట్‌వాచ్‌లతో మీరే సూపర్ స్మార్ట్.. ది బెస్ట్ వాచ్‌లు ఏవంటే..?

చేతి మణికట్టుకు వాచ్ చాలా అందాన్ని ఇస్తుంది. సమయం చూసుకోవడానికి ఉపయోగపడుతుంది. గతంలో ప్రతి ఒక్కరి చేతికీ వాచ్ తప్పనిసరిగా ఉండేది. దానిలో టైం చూసుకుంటూ తమ షెడ్యూల్ ను రూపొందించుకునేవారు. ఇక షాపులలో అనేక రకాల వాచ్ లు ఆకట్టుకునేవి. పుట్టిన రోజులు, వివాహాలు, ఇతర వేడుకల సమయంలో వాచ్ లను బహుమతులుగా అందజేసేవారు. అయితే స్టార్ట్ ఫోన్లు వచ్చాక వాచ్ లు దాదాపు కనుమరుగయ్యాయి. ఫోన్ లోనే సమయం చూసుకునే అవకాశం ఉండడంతో వాచ్ లకు ఆదరణ తగ్గింది.

Smart Watches: ఆ స్మార్ట్‌వాచ్‌లతో మీరే సూపర్ స్మార్ట్.. ది బెస్ట్ వాచ్‌లు ఏవంటే..?
Smart Watch
Follow us

|

Updated on: Aug 13, 2024 | 4:45 PM

చేతి మణికట్టుకు వాచ్ చాలా అందాన్ని ఇస్తుంది. సమయం చూసుకోవడానికి ఉపయోగపడుతుంది. గతంలో ప్రతి ఒక్కరి చేతికీ వాచ్ తప్పనిసరిగా ఉండేది. దానిలో టైం చూసుకుంటూ తమ షెడ్యూల్ ను రూపొందించుకునేవారు. ఇక షాపులలో అనేక రకాల వాచ్ లు ఆకట్టుకునేవి. పుట్టిన రోజులు, వివాహాలు, ఇతర వేడుకల సమయంలో వాచ్ లను బహుమతులుగా అందజేసేవారు. అయితే స్టార్ట్ ఫోన్లు వచ్చాక వాచ్ లు దాదాపు కనుమరుగయ్యాయి. ఫోన్ లోనే సమయం చూసుకునే అవకాశం ఉండడంతో వాచ్ లకు ఆదరణ తగ్గింది. అవి దాదాపు ఇక కనిపించవు అనుకునే సమయంలో స్మార్ట్ వాచ్ ల రూపంలో మళ్లీ వెలుగులోకి వచ్చాయి. సమయం చూసుకోవడానికి, ఆరోగ్య పరిరక్షణకు, వ్యాయామానికి ఎంతో ఉపయోగపడుతున్నాయి. ఈ నేపథ్యంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ప్రముఖ కంపెనీల వాచ్ లు, వాటి ప్రత్యేకతలు, ధరల వివరాలు తెలుసుకుందాం.

ఆపిల్ వాచ్ ఎస్ఈ

ఆపిల్ కంపెనీ వాచ్ లను అత్యుత్తమమైనవిగా భావిస్తారు. ఈ స్మార్ట్‌వాచ్‌లో ఎల్లప్పుడూ ఆన్‌లో ఉండే రెటీనాతో 40 ఎంఎం డిస్‌ప్లే ఏర్పాటు చేశారు. తద్వారా విజువల్స్ ను చాలా స్పష్టంగా చదవొచ్చు. వర్కౌట్ ట్రాకింగ్, క్యాలరీ మానిటరింగ్‌, ఫిట్‌నెస్ ట్రాకింగ్ తదితర ఇతర ఫీచర్లు ఉన్నాయి. వాచ్ ఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్ పై పనిచేస్తుంది. దీనిలో 32 జీబీ మెమరీ కెపాసిటీ ఉంది. వైఫై, బ్ల్యూటూత్ ల ద్వారా కనెక్ట్ చేసుకోవచ్చు. ఈ ఆపిల్ స్మార్ట్ వాచ్ ధర రూ.27,499.

ఫాసిల్ జెన్ 6

ఫాసిల్ జెన్ 6 స్మార్ట్ వాచ్ అనేక ప్రత్యేకతలతో ఆకట్టుకుంటోంది. ఐవోఎస్, ఆండ్రాయిడ్ పరికరాలకు కనెక్ట్ చేసుకోవచ్చు. దీన్ని ఒక్కసారి చార్జింగ్ చేస్తే 24 గంటల వరకూ పనిచేస్తుంది. హార్ట్ బీట్ పర్యవేక్షణ, జీపీఎస్ ట్రాకింగ్, వివిధ వ్యాయామాలు చేయడానికి సహాయ పడుతుంది. గూగుల్ పే ద్వారా స్మార్ట్ నోటిఫికేషన్‌లు, సంగీత నియంత్రణ, మొబైల్ చెల్లింపులు చేసుకోవచ్చు. వీయర్ ఓఎస్ బైగూగుల్ ఆపరేటింగ్ సిస్టమ్ పై పనిచేస్తుంది. దీనిలో 32 జీబీ మెమరీ కెపాసిటీ ఉంది. ఫాసిల్ స్మార్ట్ వాచ్ ధర: రూ. 11,998.

ఇవి కూడా చదవండి

అమాజ్ ఫిట్ యాక్టివ్ స్మార్ట్ వాచ్

1.75 అంగుళాల ఎమో ఎల్ఈడీ డిస్ ప్లే తో అమాజ్ ఫిట్ యాక్టివ్ 42 ఎంఎం స్మార్ట్ వాచ్ ఎంతో ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా మీ ఆరోగ్యాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవడానికి ఎంతో ఉపయోగపడుతుంది. ఫిట్‌నెస్ ట్రాకింగ్‌ను మెరుగుపరిచే ప్రసిద్ధ ఆరోగ్య యాప్‌లు దీనిలో ఉన్నాయి. హార్ట్ బీట్, రక్త ఆక్సిజన్, ఒత్తిడి స్థాయిలను 24 గంటలూ పర్యవేక్షిస్తుంది. ఒక్కసారి చార్జింగ్ చేస్తే దాదాపు 14 రోజులు పనిచేస్తుంది. ఈ అమాజ్ ఫిట్ స్మార్ట్ వాచ్ రూ.9,999కు అందుబాటులో ఉంది.

సామ్‌సంగ్ గెలాక్సీ వాచ్ 4 

ఎమో ఎల్ఈడీ డిస్ ప్లే తో ఆకట్టుకుంటున్న సామ్‌సంగ్ గెలాక్సీ వాచ్ వీయర్ ఓఎస్ పై పనిచేస్తుంది. ఈసీజీ, రక్తపోటును ట్రాకింగ్‌ చేయగలదు. వీటితో పాటు అనేక ఆరోగ్య పర్యవేక్షణ సామర్థ్యాలు ఉన్నాయి. అన్ని విధాలుగా ఉపయోగపడే తేలికపాటి వాచ్ ఇది. నలుపు రంగులో ఆకర్షణీయంగా కనిపిస్తున్నఈ వాచ్ ధర 10,499. ఒక్కసారి చార్జింగ్ చేస్తే దాదాపు ‎40 గంటలు పనిచేస్తుంది.

ఫిట్‌బిట్ వెర్సా 4 ఫిట్‌నెస్ వాచ్

ఆరోగ్య పర్యవేక్షణ, వ్యాయామం.. ఇలా అన్ని రకాలుగా ఫిట్‌బిట్ వెర్సా 4 ఫిట్‌నెస్ వాచ్ మనకు సహాయంగా ఉంటుంది. దీనిలోని అమెలెడ్ డిస్ ప్లే కారణంగా చాలా స్పష్టంగా విజువల్స్ ను చూడవచ్చు. వీటితో పాటు అంతర్నిర్మిత జీపీఎస్, హార్ట్ బీట్, నిద్ర, ఒత్తిడిని ట్రాకింగ్ చేయడం, ఫిట్‌నెస్ కోచింగ్, గైడెడ్ బ్రీటింగ్ సెషన్‌లు, ఫిమేల్ హెల్త్ ట్రాకింగ్‌ తదతర ప్రత్యేకతలు ఉన్నాయి. వీటికి అదనంగా ఫిట్ బిట్ ప్రీమియంతో మీ ఫిట్‌నెస్‌ను తదుపరి స్థాయికి తీసుకెళ్లవచ్చు. ఒక్కసారి చార్జింగ్ చేస్తే దాదాపు ఆరు రోజుల పాటు పనిచేస్తుంది. ఈ వాచ్ రూ. 16,999కు అందుబాటులో ఉంది.

మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఆ స్మార్ట్‌వాచ్‌లతో మీరే సూపర్ స్మార్ట్..ది బెస్ట్ వాచ్‌లు ఏవంటే?
ఆ స్మార్ట్‌వాచ్‌లతో మీరే సూపర్ స్మార్ట్..ది బెస్ట్ వాచ్‌లు ఏవంటే?
రూ. 15లకే ఆ మ్యాచ్ టికెట్లు.. బంఫర్ ఆఫర్ ప్రకటించిన పీసీబీ
రూ. 15లకే ఆ మ్యాచ్ టికెట్లు.. బంఫర్ ఆఫర్ ప్రకటించిన పీసీబీ
మూసీలో చిక్కుకున్న పిల్లి.. ఆ యువకుడి ఆలోచనకు సలాం చేస్తున్న జనం
మూసీలో చిక్కుకున్న పిల్లి.. ఆ యువకుడి ఆలోచనకు సలాం చేస్తున్న జనం
వైద్యురాలిపై హత్యాచారం కేసు సీబీఐకి అప్పగింత.. కీలక ఆదేశాలు..
వైద్యురాలిపై హత్యాచారం కేసు సీబీఐకి అప్పగింత.. కీలక ఆదేశాలు..
మీ స్మార్ట్ ఫోన్ హ్యాంగ్ అవుతూ వేధిస్తుందా..?
మీ స్మార్ట్ ఫోన్ హ్యాంగ్ అవుతూ వేధిస్తుందా..?
ఈ పొరపాట్లు చేసినట్లయితే మీకు ఆదాయపు పన్ను నోటీసు రావడం ఖాయం
ఈ పొరపాట్లు చేసినట్లయితే మీకు ఆదాయపు పన్ను నోటీసు రావడం ఖాయం
'ఐపీఎల్ వేలంలోకి ఆయనొస్తే రూ.30 కోట్లకుపైగానే పట్టుకెళ్తాడు'
'ఐపీఎల్ వేలంలోకి ఆయనొస్తే రూ.30 కోట్లకుపైగానే పట్టుకెళ్తాడు'
మీ సోదరీమణులకు అరుదైన గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నారా? ఇవి ట్రై చేయండి
మీ సోదరీమణులకు అరుదైన గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నారా? ఇవి ట్రై చేయండి
స్నాప్‌చాట్‌లో స్క్రీన్ షాట్ తీయడం చాలా ఈజీ..!
స్నాప్‌చాట్‌లో స్క్రీన్ షాట్ తీయడం చాలా ఈజీ..!
షారుఖ్‌ వ్యాఖ్యలపై స్పందించిన గూగుల్‌.. ఆసక్తికరమైన ట్వీట్..
షారుఖ్‌ వ్యాఖ్యలపై స్పందించిన గూగుల్‌.. ఆసక్తికరమైన ట్వీట్..