- Telugu News Photo Gallery Technology photos Apple launching new mini computer mac mini m4 features and price details
Mac Mini M4: ఆపిల్ నుంచి మరో స్టన్నింగ్ గ్యాడ్జెట్.. అత్యంత చిన్న కంప్యూటర్
ఆపిల్.. ఈ పేరు వినగానే అధునాతన టెక్నాలజీకి గుర్తొస్తుంది. ఈ కంపెనీ నుంచి కొత్తగా ఏదైనా ప్రొడక్ట్ వస్తుందంటే ప్రపంచవ్యాప్తంగా బజ్ ఏర్పడుతుంది. ఐఫోన్ మొదలు కంప్యూటర్స్ వరకు ప్రతీ ఒక్క ప్రొడక్ట్‌కి ఒక్కో ప్రాముఖ్యత ఉంటుంది. టెక్ ప్రియులను ఎప్పటికప్పుడు ఆకట్టుకుంటూ సరికొత్త డివైజ్‌లను లాంచ్ చేస్తూ వస్తున్న ఆపిల్ తాజాగా మరో కొత్త గ్యాడ్జెట్‌ను తీసుకొచ్చే పనిలో పడింది..
Updated on: Aug 12, 2024 | 8:58 PM

టెక్ దిగ్గజం ఆపిల్.. ఐఫోన్ 16ని లాంచ్ చేస్తున్న విషయం తెలిసిందే. వచ్చే నెలలో ఐఫోన్ 16 సిరీస్ ఫోన్‌లను తీసుకొచ్చేందుకు సిద్ధమవుతోంది. అయితే ఇదే సమయంలో మ్యాక్ మినీ పేరుతో కంప్యూటర్‌ను కూడా లాంచ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది.

అత్యంత చిన్న కంప్యూటర్‌గా దీనిని తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పవర్‌తో పాటు ఎం4 చిప్‌తో ఈ కంప్యూటర్‌ను లాంచ్ చేయనున్నట్లు సమాచారం

ఆపిల్ నుంచి అత్యంత బుల్లి డెస్క్ కంప్యూటర్ ఇదే కానుంది. 2010 నుంచి డిజైన్ మార్పుతో వస్తున్న తొలి కంప్యూటర్ ఇదే. అక్టోబర్ నెల నుంచి మార్కెట్లోకి ఈ కంప్యూటర్ మార్కెట్లోకి వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

ఈ మ్యాక్ మినీ కంప్యూటర్ ఆపిల్ టీవీ స్ట్రీమింగ్ డివైజ్ పరిమాణానాన్ని పోలి ఉంటుందని తెలుస్తోంది. ఈ కంప్యూటర్‌ను అల్యూమినియం షెల్‌తో తీసుకురానున్నారు.

కాగా ఈ కంప్యూటర్ ధర ప్రస్తుతం మార్కెట్లో ఉన్న మ్యాక్ మినీ కంటే తక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ప్రస్తుతం మ్యాక్ మినీ ధర 599 డాలర్లుగా ఉంది. ఈ కంప్యూటర్‌తో పాటు ఆపిల్ ఈ ఏడాది చివిరి నాటికి ఐమ్యాక్స్, మ్యాక్ బుక్ ప్రోస్‌లను తీసుకొస్తున్నాయని తెలుస్తోంది.




