Band Aid for Heart: గుండెకు బ్యాండ్‌ ఎయిడ్‌.! వానపాముల నుంచి స్ఫూర్తి సొందిన శాస్త్రేవేత్తలు

Band Aid for Heart: గుండెకు బ్యాండ్‌ ఎయిడ్‌.! వానపాముల నుంచి స్ఫూర్తి సొందిన శాస్త్రేవేత్తలు

Anil kumar poka

|

Updated on: Aug 13, 2024 | 10:01 PM

చర్మంపై గాయాలకు ‘బ్యాండ్‌ ఎయిడ్‌’ అంటించుకుని నయం చేసుకుంటుంటాం. అలాగే గుండె ఇతర అవయవాల్లోని గాయాలకూ బ్యాండ్‌ ఎయిడ్‌ అతికించుకోగలిగితే..! ఈ విషయంలో అమెరికా శాస్త్రవేత్తలు ముందడుగు వేశారు. త్రీడీ ప్రింటింగ్‌తో కొత్త బ్యాండ్ ఎయిడ్‌ను రూపొందించారు. ఇది గట్టిగా ఉండటంతో పాటు, గుండె స్పందనలకు తగ్గట్టు సాగే గుణంతో ఉంటుంది. గుండె, కార్టిలేజ్‌ కణజాలాలు ఒకేలా ఉంటాయి.

చర్మంపై గాయాలకు ‘బ్యాండ్‌ ఎయిడ్‌’ అంటించుకుని నయం చేసుకుంటుంటాం. అలాగే గుండె ఇతర అవయవాల్లోని గాయాలకూ బ్యాండ్‌ ఎయిడ్‌ అతికించుకోగలిగితే..! ఈ విషయంలో అమెరికా శాస్త్రవేత్తలు ముందడుగు వేశారు. త్రీడీ ప్రింటింగ్‌తో కొత్త బ్యాండ్ ఎయిడ్‌ను రూపొందించారు. ఇది గట్టిగా ఉండటంతో పాటు, గుండె స్పందనలకు తగ్గట్టు సాగే గుణంతో ఉంటుంది. గుండె, కార్టిలేజ్‌ కణజాలాలు ఒకేలా ఉంటాయి. సొంతంగా మరమ్మతులు చేసుకునే సామర్థ్యం వీటికి తక్కువ. అందువల్ల అవి దెబ్బతింటే కోలుకునే అవకాశం ఉండదు. ఈ భాగాల్లో మరమ్మతు ప్రక్రియను పెంచే సమర్థ పదార్థాలను అభివృద్ధి చేస్తే రోగులకు మంచి ప్రయోజనం ఉంటుంది. దృఢత్వంతోపాటు సాగే గుణం ఉండే త్రీడీ ప్రింటింగ్‌ హైడ్రోజెల్స్‌ తయారీకి అమెరికాలోని కొలరాడో విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు వానపాముల నుంచి స్ఫూర్తి పొందారు. ఆ జీవులు పరస్పరం పెనవేసుకుపోవడం.. తర్వాత విడిపోవడం చేస్తుంటాయి. సమూహంగా అవి బంతిలాంటి ఆకృతులను ఏర్పాటు చేస్తుంటాయి. ఈ ఆకృతులకు ఘన, ధ్రవ పదార్థాల లక్షణాలు ఉంటాయి. కొత్త పదార్థంతో గుండె లోపాల మరమ్మతుకు, కణజాల పునరుజ్జీవనానికి ఔషధాలను నేరుగా గుండెలోకి చేర్చే అంతర్గత బ్యాండేజీలు తయారుచేసే అవకాశం ఉందంటున్నారు శాస్త్రవేత్తలు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.