Sleepmaker: యువతను నిద్రపుచ్చే కొత్త వృత్తి.. రెండు చేతులా సంపాదన.!
ప్రస్తుత ఉరుకుల పరుగుల కాలంలో ఎవరూ ప్రశాంతంగా నిద్రపోవడంలేదు. ఆఫీసులో పని ఒత్తిడి, నిత్య జీవితంలో రకరకాల ఒత్తిళ్లతో నిద్రకు దూరమవుతున్నారు. దీంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అనారోగ్యం పాలవుతున్నారు. దీనినే 996 వర్క్ కల్చర్‌గా పిలుస్తారు. అందుకే అలాంటివారి కోసం స్లీప్ మేకర్స్ అనే కొత్త వృత్తి పుట్టుకొచ్చింది. చైనాలో దీనికి ఫుల్ డిమాండ్ ఉండటంతో చాలామంది దీనిని పార్ట్ టైమ్‌గా ఎంచుకుని రెండుచేతులా సంపాదిస్తున్నారు.
ప్రస్తుత ఉరుకుల పరుగుల కాలంలో ఎవరూ ప్రశాంతంగా నిద్రపోవడంలేదు. ఆఫీసులో పని ఒత్తిడి, నిత్య జీవితంలో రకరకాల ఒత్తిళ్లతో నిద్రకు దూరమవుతున్నారు. దీంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అనారోగ్యం పాలవుతున్నారు. దీనినే 996 వర్క్ కల్చర్‌గా పిలుస్తారు. అందుకే అలాంటివారి కోసం స్లీప్ మేకర్స్ అనే కొత్త వృత్తి పుట్టుకొచ్చింది. చైనాలో దీనికి ఫుల్ డిమాండ్ ఉండటంతో చాలామంది దీనిని పార్ట్ టైమ్‌గా ఎంచుకుని రెండుచేతులా సంపాదిస్తున్నారు. ఈ స్లీప్ మేకర్స్ పనేంటి అంటే.. తీవ్ర ఒత్తిళ్లతో నిద్రకు దూరమైన వారితో మనసు విప్పి మాట్లాడి, వారి బాధలను పంచుకుంటారు. వారి గుండెల్లోని బాధను తొలగించి వారు హాయిగా నిద్రపోయేలా చేస్తారు. ఈ పని విధానం వల్ల వైవాహిక జీవితంతోపాటు నిత్య జీవితంలో యువత తీవ్రమైన ఒత్తిళ్లు ఎదుర్కొని నిద్రకు దూరమై మరిన్ని ఇబ్బందులకు గురవుతోంది. దీంతో వారిని నిద్రపుచ్చేందుకు ‘స్లీప్ మేకర్స్’ అనే కొత్త వృత్తి పుట్టుకొచ్చింది. బాధితులతో ఈ స్లీప్ మేకర్స్ మనసు విప్పి మాట్లాడుతూ వారి బాధలను పంచుకుంటారు. వారి గుండెల్లోని బాధను తొలగించి వారు హాయిగా నిద్రపోయేలా చేస్తారు.
ఇప్పుడిలాంటి సేవలు అందించేందుకు కొన్ని సంస్థలు పోటీపడుతున్నాయి. కొందరు వ్యక్తిగతంగానూ సేవలు అందిస్తున్నారు. మానసికంగా ఒత్తిడి ఎదుర్కొంటూ నిద్రకు దూరమవుతున్న వారికి స్లీప్‌మేకర్స్ ఎమోషనల్‌గా సపోర్ట్ ఇస్తారు. వారితో కలిసిపోయి మాట్లాడతారు. వారి బాధలు పంచుకుంటారు. బెడ్‌టైం స్టోరీలు చెబుతూ లాలించి నిద్రపుచ్చుతారు. ఈ సేవలు అందించేందుకు గంటకు 260 యువాన్లు చార్జ్ చేస్తున్నారు. మన కరెన్సీలో చెప్పుకోవాలంటే దాదాపు రూ. 3 వేలు. స్లీప్ మేకర్‌గా పార్ట్‌టైం చేస్తున్న టావోజీ అనే అమ్మాయి స్పందిస్తూ.. చాలామంది తమ వ్యక్తిగత సమస్యలను కుటుంబ సభ్యులు, స్నేహితులతో పంచుకోవడానికి ఇష్టపడరని పేర్కొన్నారు. దీనివల్ల వారు ఆ సమస్యలను తలుచుకుని మానసికంగా సతమతమవుతుంటారని పేర్కొన్నారు. అలాంటి వారి సమస్యలను తాము శ్రద్ధగా విని వారి గుండె బరువును తగ్గించే ప్రయత్నం చేస్తామని చెప్పుకొచ్చారు. వారు కూడా సమస్యలు చెప్పుకున్నాక తేలికపడి హాయిగా నిద్రపోతారని వివరించారు. ఇప్పుడీ వ్యాపారం చైనాలో మూడుపువ్వులు ఆరు కాయలుగా విస్తరిస్తోంది. కాగా, 996 వర్క్ కల్చర్ బారినపడి నిద్రకు దూరమవుతున్న వారిలో ఎక్కువ మంది యువతే ఉండడం గమనార్హం.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.