Bangalore: బెంగళూరులో మహిళల వాష్‌రూం చెత్తబుట్టలో ఫోన్ పెట్టి కెమెరా ఆన్ చేసి..
మహిళలకు ఎక్కడా భద్రత లేదని మరోమారు రుజువైంది. బెంగళూరులోని ఓ పాపులర్ కేఫ్ వాష్‌రూంలోని డస్ట్‌బిన్‌లో ఫోన్ పెట్టి మహిళల వీడియోలు చిత్రీకరిస్తున్న నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. వాష్‌రూంలోకి వెళ్లిన మహిళ అప్రమత్తతతో విషయం వెలుగులోకి వచ్చింది. బీఈఎల్ రోడ్డులోని థర్డ్‌వేవ్ అనే కాఫీషాప్ అవుట్‌లెట్ లో 23 ఏళ్ల ఓ మహిళ వాష్‌రూం ఉపయోగించుకునేందుకు వెళ్లింది.
మహిళలకు ఎక్కడా భద్రత లేదని మరోమారు రుజువైంది. బెంగళూరులోని ఓ పాపులర్ కేఫ్ వాష్‌రూంలోని డస్ట్‌బిన్‌లో ఫోన్ పెట్టి మహిళల వీడియోలు చిత్రీకరిస్తున్న నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. వాష్‌రూంలోకి వెళ్లిన మహిళ అప్రమత్తతతో విషయం వెలుగులోకి వచ్చింది. బీఈఎల్ రోడ్డులోని థర్డ్‌వేవ్ అనే కాఫీషాప్ అవుట్‌లెట్ లో 23 ఏళ్ల ఓ మహిళ వాష్‌రూం ఉపయోగించుకునేందుకు వెళ్లింది. అక్కడి డస్ట్‌బిన్‌లో ఆమెకు అనుమానాస్పద వస్తువేదో కనిపించింది. వెంటనే వెళ్లి చూడగా ఓ మొబైల్ ఫోన్ కెమెరా ఆన్‌చేసి కనిపించింది. టాయిలెట్‌ను చిత్రీకరించేలా ఉన్న ఆ ఫోన్‌లోని కెమెరా రెండు గంటలుగా ఆన్‌లో ఉన్నట్టు గుర్తించింది. అంతేకాదు, దానికి ఫోన్లు రాకుండా ఫ్లైట్ మోడ్ ఆన్ చేసి ఉంది. కాఫీ షాపులో పనిచేస్తున్న ఇద్దరిలో అది ఏ ఒక్కరిదో అయి ఉంటుందని భావించింది. పోలీసులకు ఫోన్ చేయడంతో వారొచ్చి నిందితుడు మనోజ్‌ను అరెస్ట్ చేశారు. గుట్టహళ్లిలో ఉంటున్న నిందితుడిది షిమోగా అని, ఆరు నెలల క్రితమే అతడు కాఫీ షాప్‌లో చేరినట్టు గుర్తించారు. ‘గ్యాంగ్స్ ఆఫ్ సినీపూర్’ పేరుతో నిర్వహిస్తున్న సోషల్ మీడియా ఖాతాలో బాధిత మహిళ ఈ విషయాన్ని వెల్లడించింది. కాగా దీనిని దురదృష్టకర ఘటనగా పేర్కొన్న కాఫీషాప్ మహిళకు క్షమాపణలు తెలిపింది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.
తెల్లవారేసరికి ఇళ్ల ముందు క్షుద్రపూజలు
లక్షల ఖర్చు లేదు.. రోడ్డుపైనే పెళ్లి.. వీడియో వైరల్!
తిరుమల గదిలో 9 అడుగుల జర్రిపోతు.. భక్తుల్లో భయం!
ప్రపంచ రికార్డు సృష్టించిన 13 రోజుల చిన్నారి
అర్థరాత్రి రోడ్డు దాటుతూ కనిపించిన వింత జీవి!
62 ఏళ్ల వయసులోనూ వర్కవుట్స్.. నీతా అంబానీ ఫిట్నెస్ రహస్యం ఇదే!
కదులుతున్న రైల్లోకి పార్శిల్ డెలివరీ.. వాటే టైమింగ్ బాస్!
అయ్యో.. ఈ భర్త కష్టం ఎవరికీ రాకూడదు!
హిట్టు కొడితే.. కోట్ల విలువ చేసే లగ్జరీ కార్ చేతిలో పడ్డట్టే..
బిగ్ బాస్ 10 - కామనర్స్ Vs సెలబ్రిటీస్ మధ్యలో మంట పెట్టిన మానస్
మహేష్ బాబు, రాజమౌళిలకు నోటీసులు..అసలేం జరిగిందంటే?
మీర్జాపూర్ ఊచకోత.. రూ.200 కోట్ల కలెక్షన్స్ దిశగా అడుగులు

