Banana Business: ఖుషీ ఖుషీగా అరటి రైతులు.. అసలు కారణం ఇదే.! పెద్ద ఎత్తున దిగుమతి..

Banana Business: ఖుషీ ఖుషీగా అరటి రైతులు.. అసలు కారణం ఇదే.! పెద్ద ఎత్తున దిగుమతి..

Anil kumar poka

|

Updated on: Aug 14, 2024 | 12:17 PM

కోనసీమ.. కొబ్బరి తోటలకే కాదు, అరటితోటలకూ పెట్టింది పేరు. ఇక్కడి రైతులు ప్రతీ శుభకార్యానికి తప్పనిసరిగా వినియోగించే అరటి, కొబ్బరిని ఎక్కువగా సాగు చేస్తారు. ఆషాఢమాసం రావడంతోనే జాతరలు మొదలవుతాయి. ప్రతీ గ్రామ దేవతకూ ఈ మాసంలో ఉత్సవాలు జరిపిస్తారు ఆయా గ్రామస్తులు. ఆ తర్వాత శ్రావణమాసం అంతా పండగే పండగ.. శ్రావణ మాసమంతా పూజలు, వ్రతాలు, నోములతో లోగిళ్లన్నీ కళకళలాడుతుంటాయి.

కోనసీమ.. కొబ్బరి తోటలకే కాదు, అరటితోటలకూ పెట్టింది పేరు. ఇక్కడి రైతులు ప్రతీ శుభకార్యానికి తప్పనిసరిగా వినియోగించే అరటి, కొబ్బరిని ఎక్కువగా సాగు చేస్తారు. ఆషాఢమాసం రావడంతోనే జాతరలు మొదలవుతాయి. ప్రతీ గ్రామ దేవతకూ ఈ మాసంలో ఉత్సవాలు జరిపిస్తారు ఆయా గ్రామస్తులు. ఆ తర్వాత శ్రావణమాసం అంతా పండగే పండగ… శ్రావణ మాసమంతా పూజలు, వ్రతాలు, నోములతో లోగిళ్లన్నీ కళకళలాడుతుంటాయి. అందుకే ఈ రెండు మాసాలూ అరటి, కొబ్బరి రైతులకు మంచి లాభాలను తెచ్చిపెడతాయని చెప్పవచ్చు. అరటి ఎగుమతులు పెరిగి వ్యాపారం జోరందుకోవడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

రావులపాలెం అరటి మార్కెట్‌లో అరటి గెలల వ్యాపారం జోరుగా సాగుతోంది. ప్రస్తుతం శ్రావణమాసం కావడం.. నెలంతా పండుగలు రావడం, ఆ తర్వాత వినాయక చవితి కూడా కావడం ఇలా ఫెస్టివల్స్ అన్నీ వరుసగా ఉండడంతో అరటికి గిరాకీ బాగా పెరిగింది. దీంతో అరటి ఎగుమతులు ఒక్కసారిగా ఊపందుకున్నాయి. ఇటీవల గోదావరి వరదల్లో వేల ఎకరాల్లో అరటికి నష్టం వచ్చినప్పటికీ మిగిలిన అరటి పంటకు ఇప్పుడు డిమాండ్ పెరిగింది. ఇది రైతుల్లో ఆనందాన్ని నింపింది. ఈ ఏడాది అరటి ధర రికార్డు స్థాయి లో అదరహో అనే రీతి లో పలుకుతోంది. ఎగుమతులు పెరగడంతో పాటు వచ్చే రెండు నెలల్లో మరింతగా ధర పెరిగే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నాయి మార్కెట్ వర్గాలు .

శ్రావణమాసం శుభవేళ అరటి గెలల ధరలు పెరగడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు రైతులు. గత రెండు నెలల నుంచి ధరలు అంతంత మాత్రంగా ఉండడంతో ఇటు రైతులు, అటు వ్యాపారులు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల్లో రైతులు పండించిన అరటిపంట రావులపాలెం అరటి మార్కెట్‌ నుండి ఇతర రాష్ట్రాలకు ఎగుమతి అవుతుంది. పశ్చిమ బెంగాల్, ఒడిశా, బీహార్, ఛత్తీస్ ఘడ్, తెలంగాణ రాష్ట్రాలకు పెద్ద ఎత్తున అరటి గెలలను ఎగుమతి చేస్తారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.