Website Story: మూడు దశాబ్దాల వెబ్‌సైట్.. ప్రపంచంలో మొదటి వెబ్ సైట్ ఎవరు..ఎప్పుడు..ఎక్కడ ప్రారంభించారో తెలుసా? 

ఇప్పుడు మనం ప్రపపంచంలో ఏ విషయాన్ని అయినా మునివేళ్లమీద తెలుసుకుంటున్నాం. గూగుల్ లో అడిగితే  ఏ వివరమైన క్షణకాలంలో మనముందు ప్రత్యక్షం అయిపోతోంది. దీనికి పునాది వెబ్ సైట్.. 

Website Story: మూడు దశాబ్దాల వెబ్‌సైట్.. ప్రపంచంలో మొదటి వెబ్ సైట్ ఎవరు..ఎప్పుడు..ఎక్కడ ప్రారంభించారో తెలుసా? 
Tim Berners Lee
Follow us

|

Updated on: Aug 23, 2021 | 7:55 AM

Website Story:  ఇప్పుడు మనం ప్రపపంచంలో ఏ విషయాన్ని అయినా మునివేళ్లమీద తెలుసుకుంటున్నాం. గూగుల్ లో అడిగితే  ఏ వివరమైన క్షణకాలంలో మనముందు ప్రత్యక్షం అయిపోతోంది. దీనికి పునాది వెబ్ సైట్..  ఇప్పుడు  ఇంటర్నెట్‌లో చాలా వెబ్‌సైట్‌లు ఉన్నాయి. వాటిని లెక్కించడం దాదాపు అసాధ్యం. కానీ 3 దశాబ్దాల క్రితం వరకు పరిస్థితి ఇలా లేదు. అప్పుడు ప్రజలందరికీ ఇంటర్నెట్ లేదు ఇన్ని వెబ్‌సైట్లు లేవు. ఇంటర్నెట్ చరిత్రలో ఈ రోజు (ఆగస్టు 23) చాలా ప్రత్యేకమైన రోజు. ప్రపంచంలో మొట్టమొదటి పబ్లిక్ వెబ్‌సైట్ 1991 లో ఈ రోజున ప్రారంభించారు. అప్పటి నుండి, ప్రతి సంవత్సరం ఆగస్టు 23 న ‘ఇంటర్‌నెట్ డే’ జరుపుకుంటారు.

మొట్టమొదటి వెబ్‌సైట్‌ను టిమ్ బెర్నర్స్ లీ రూపొందించారు. టిమ్ CERN (యూరోపియన్ కౌన్సిల్ ఫర్ న్యూక్లియర్ రీసెర్చ్) లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్. ఇక్కడ పని చేస్తున్నప్పుడు, ఆలోచనలు, డేటా.. సమాచారాన్ని పంచుకోవడంలో శాస్త్రవేత్తలు చాలా ఇబ్బందులు ఎదుర్కోవలసి రావడాన్ని టిమ్ గమనించాడు. డేటా వివిధ కంప్యూటర్లలో ఉంటోంది. ఇతర ప్రాంతాల నుండి వీటిని యాక్సెస్ చేయడం కష్టం.

అప్పట్లో శాస్త్రవేత్తలు ఒకరితో ఒకరు మాట్లాడుకోవడానికి టెలిఫోన్‌లను ఉపయోగించారు. కానీ, ప్రచ్ఛన్న యుద్ధ సమయంలో టెలిఫోన్‌లు ట్యాప్ చేయడం చాలా ఎక్కువగా ఉండేది. దీంతో  టెలిఫోన్‌లో మాట్లాడటం కూడా సురక్షితం కాదు. ఈ సమస్యను ఎదుర్కోవటానికి, టిమ్ ప్రపంచవ్యాప్తంగా అన్ని కంప్యూటర్లను నెట్‌వర్క్ ద్వారా కనెక్ట్ చేయాలనే ఆలోచనపై పని చేయడం ప్రారంభించాడు.

1989 నాటికి, టిమ్ ప్రాథమిక కోడింగ్ పనిని పూర్తి చేశాడు. అతను HTML, HTTP..URI నమూనాలను సృష్టించాడు, ఇవి ఇప్పటికీ ఏ వెబ్‌సైట్ ఎలా పనిచేస్తుందనేదానికి  ప్రాథమిక నమూనాగా ఉన్నాయి. టిమ్ దీనికి వరల్డ్ వైడ్ వెబ్ అని పేరు పెట్టాడు.  దానిపై వెబ్ పేజీని సృష్టించాడు. ప్రారంభంలో, CERN శాస్త్రవేత్తలు మాత్రమే ఈ వెబ్ పేజీని యాక్సెస్ చేయగలిగేవారు. 23 ఆగష్టు 1991 న, ప్రజలకు కూడా ఈ వెబ్ పేజీకి యాక్సెస్ ఇచ్చారు. ఈ విధంగా, సాధారణ వ్యక్తులు కూడా తమ కంప్యూటర్‌లో తెరవగల ప్రపంచంలోనే మొదటి వెబ్ పేజీగా ఇది నిలిచింది.

వరల్డ్ వైడ్ వెబ్ సారాంశం ఈ వెబ్‌సైట్‌లో ఇవ్వబడింది. 1993 లో CERN ఇంటర్నెట్ సేవ అందరికీ ఉచితం అని ప్రకటించింది. ఆ తర్వాత దాని వినియోగం వేగంగా పెరగడం ప్రారంభమైంది. ఇప్పుడు వరల్డ్ వైడ్ వెబ్‌లో 100 కోట్లకు పైగా వెబ్ పేజీలు ఉన్నాయి.

Also Read: Google Banned Apps: జాగ్రత్త! మీ ఫోన్ నుండి ‘ఈ’ 8 యాప్‌లను వెంటనే తొలగించండి… Google కూడా నిషేధించింది

NASA Challenge: నాసా చేపట్టిన ‘బ్రేక్‌ ది ఐస్‌ ఛాలెంజ్‌’లో సత్తా చాటిన తెలుగు విద్యార్థులు

Toothpaste: టూత్‌పేస్టులో ఈ ఎరుపు, నీలం, ఆకుపచ్చ రంగులు ఎందుకు ఉంటాయో తెలుసా..? కారణం ఏమిటి..?

బంపర్ ఆఫర్.. ప్రభాస్‌ సలార్ బైక్ మీదే కావచ్చు.! ఎలాగో తోరపడండి..
బంపర్ ఆఫర్.. ప్రభాస్‌ సలార్ బైక్ మీదే కావచ్చు.! ఎలాగో తోరపడండి..
ఈ ముగ్గురిపై సీఎం జగన్ స్పెషల్ ఫోకస్.. ఆ అభ్యర్థులకు బంపర్ ఆఫర్..
ఈ ముగ్గురిపై సీఎం జగన్ స్పెషల్ ఫోకస్.. ఆ అభ్యర్థులకు బంపర్ ఆఫర్..
చరణ్‌కు రూ.70 కోట్లు, NTRకి రూ.50 కోట్లు | మహేష్‌ న్యూ లుక్.
చరణ్‌కు రూ.70 కోట్లు, NTRకి రూ.50 కోట్లు | మహేష్‌ న్యూ లుక్.
సలార్‌లో ప్రభాస్‌ బైక్‌ సొంతం చేసుకునే అవకాశం.. ఎలాగో తెలుసా.?
సలార్‌లో ప్రభాస్‌ బైక్‌ సొంతం చేసుకునే అవకాశం.. ఎలాగో తెలుసా.?
కుట్టుమిషిన్‌తో మొదలైన టైలర్‌ ప్రయాణం.. నేడు వేలకోట్లకు అధిపతి..!
కుట్టుమిషిన్‌తో మొదలైన టైలర్‌ ప్రయాణం.. నేడు వేలకోట్లకు అధిపతి..!
పొలిటికల్ కమాండర్‎లా మారిన సీఎం రేవంత్.. ఢిల్లీ హైకమాండ్ సపోర్ట్‎
పొలిటికల్ కమాండర్‎లా మారిన సీఎం రేవంత్.. ఢిల్లీ హైకమాండ్ సపోర్ట్‎
భారత్‌లో ఎయిర్‌ ట్యాక్సీలు వచ్చేది అప్పుడే.. ఇండిగో ప్రకటన
భారత్‌లో ఎయిర్‌ ట్యాక్సీలు వచ్చేది అప్పుడే.. ఇండిగో ప్రకటన
24 గంటల్లో 120 పబ్బుల్లో తాగేశాడు- గిన్నిస్ రికార్డ్ కొట్టేశాడు..
24 గంటల్లో 120 పబ్బుల్లో తాగేశాడు- గిన్నిస్ రికార్డ్ కొట్టేశాడు..
ఏపీలో అభ్యర్థుల ఆస్తి, అప్పుల చిట్టా ఇదే.. టాప్‎లో ఉన్నది ఎవరంటే
ఏపీలో అభ్యర్థుల ఆస్తి, అప్పుల చిట్టా ఇదే.. టాప్‎లో ఉన్నది ఎవరంటే
కూటమి నేతల్లో కలవరపెడుతున్న అసమ్మతి కుంపటి.. తెరపైకి రాజకీయ వేడి
కూటమి నేతల్లో కలవరపెడుతున్న అసమ్మతి కుంపటి.. తెరపైకి రాజకీయ వేడి