AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Artificial Brain: కృత్రిమ మెదడును ఆవిష్కరించిన శాస్త్రవేత్తలు..మెదడు సంబంధిత వ్యాధుల్లో ప్రత్యామ్నాయ వ్యవస్థ కోసం పెద్ద ముందడుగు!

పరిశోధకులు సరికొత్త పరిశోధనలు చేస్తూ వస్తున్నారు. మానవ శరీరంలోని ప్రతి అవయవాన్ని కృత్రిమంగా సృష్టించే దిశలో వారు ఎంతో ముందడుగు వేస్తున్నారు.

Artificial Brain: కృత్రిమ మెదడును ఆవిష్కరించిన శాస్త్రవేత్తలు..మెదడు సంబంధిత వ్యాధుల్లో ప్రత్యామ్నాయ వ్యవస్థ కోసం పెద్ద ముందడుగు!
Artificial Brain
KVD Varma
|

Updated on: Aug 23, 2021 | 9:50 AM

Share

Artificial Brain: పరిశోధకులు సరికొత్త పరిశోధనలు చేస్తూ వస్తున్నారు. మానవ శరీరంలోని ప్రతి అవయవాన్ని కృత్రిమంగా సృష్టించే దిశలో వారు ఎంతో ముందడుగు వేస్తున్నారు. ఇప్పటికే కొన్నిరకాల కృత్రిమ అవయవాలను సృష్టించి.. అవయవాలు కోల్పోయినవారికి జీవితాన్ని ఇచ్చిన శాస్త్రవేత్తలు మరో ముందడుగు వేశారు. ఈసారి వారు కృత్రిమ మానవ మెదడును సృష్టించారు. జర్మన్ శాస్త్రవేత్తలు ప్రయోగశాలలో కృత్రిమ మానవ మెదడును సృష్టించారు. ఈ చిన్న మెదడుకి కళ్ళు కూడా ఉన్నాయి. కళ్ళు పూర్తిగా అభివృద్ధి చెందకపోయినా. ఈ చిన్న మెదడు మానవ మూలకణాల నుండి అభివృద్ధి చేశారు.

దీనిని ఇన్స్టిట్యూట్ ఫర్ హ్యూమన్ జెనెటిక్స్, జర్మనీ పరిశోధకులు తయారు చేశారు. మినీ మెదడులోని కళ్ళు 5 వారాల పిండంలా అభివృద్ధి చెందాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. భవిష్యత్తులో, దీని నుండి అనేక కొత్త విషయాలు వెల్లడవుతాయి, ఇది అనేక వ్యాధుల చికిత్సలో సహాయపడుతుంది.

ఈ కృత్రిమ మెదడు ఎందుకు ప్రత్యేకమైనది..

మినీ బ్రెయిన్ 3 మిమీ. వెడల్పుగా ఉంటుంది.  ఇందులో ఉండే కళ్లలో కార్నియా, లెన్స్, రెటీనా ఉన్నాయి. దాని సహాయంతో అది కాంతిని చూడగలుగుతుంది. ఈ కళ్ళు న్యూరాన్లు.. నరాల కణాల సహాయంతో మెదడుతో కూడా కమ్యూనికేట్ చేయగలవు. ప్రయోగశాలలో తయారు చేసిన ఈ రెటీనా భవిష్యత్తులో వస్తువులను చూడలేని వ్యక్తులకు ఉపయోగకరంగా ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

సెల్ స్టెమ్ జర్నల్‌లో ప్రచురించబడిన పరిశోధన ప్రకారం, ఈ కళ్ళపై కాంతి కిరణాలు పడినపుడు, సంకేతాలు మెదడుకు చేరాయి. కళ్ళు చూసేవి మెదడుకు చేరుతున్నాయని ఇది రుజువు చేస్తుంది. ప్రయోగశాలలో అభివృద్ధి చేసిన మెదడులో మొదటిసారిగా ఇది కనిపించింది.

పరిశోధకులు ఈ సందర్భంగా మాట్లాడుతూ, చిన్న మెదడు సహాయంతో, పిండం అభివృద్ధి సమయంలో, పుట్టుకతో వచ్చే రెటీనా రుగ్మతలలో..రెటీనాపై కొన్ని ఔషధాలను పరీక్షించడం ద్వారా కంటి మరియు మెదడు ఎలా సంకర్షణ చెందుతాయో తెలుసుకోవడం సాధ్యమవుతుందని చెప్పారు.

రక్త సరఫరా లేకపోవడం వల్ల ఈ మెదడు మనుగడ సాగించలేదు..

శాస్త్రవేత్తలు ఇలా చెబుతున్నారు.. 60 రోజుల్లో సుమారు 314 మినీ బ్రెయిన్‌లు తయారు చేశారు. వీటిలో మూడు వంతులు పూర్తిగా అభివృద్ధి చెందాయి. అవి కనిపించే మానవ పిండాల వంటివి. రక్త సరఫరా లేకుండా అవి  ఎక్కువ కాలం జీవించలేవు. రక్త సరఫరా లేకపోవడం వల్ల, అవి  క్రమంగా రెండున్నర నెలల్లో జీవం కోల్పోతాయి.

ఈ ఆవిష్కరణ పూర్తిగా విజయవంతం కాకపోయినప్పటికీ.. భవిష్యత్ లో పూర్తిస్థాయిలో మానవ మెదడును కృత్రిమంగా సృష్టించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఈ ఆవిష్కరణ మానవాళికి చాలా మేలు చేస్తుందని వారు చెబుతున్నారు.

Website Story: మూడు దశాబ్దాల వెబ్‌సైట్.. ప్రపంచంలో మొదటి వెబ్ సైట్ ఎవరు..ఎప్పుడు..ఎక్కడ ప్రారంభించారో తెలుసా? 

Mask Mouth: మాస్క్ తీస్తే ఒక భయం.. పెట్టుకుంటే మరొక భయం.!.. డెంటిస్టుల వద్దకు బాధితుల క్యూ

Follow Us